📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Fairs: కాలుష్యరహితంగా జాతరలు జరగాలి

Author Icon By Sudha
Updated: March 13, 2026 • 4:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు ప్రజలు వారి నివాస ప్రాంతాల్లో కొన్నినిర్దిష్ట రోజు ల్లో పలు ఉత్సవాలు, జాతరలు నిర్వహిస్తుంటారు. ఇవి ఆయా ప్రాంతాల ప్రజల చరిత్ర, సంస్కృ తి, వారసత్వ సంపదకు సాక్షి భూతంగా నిలుస్తాయి. సాధార ణంగా సంక్రాంతి పండుగ పోయిన వెంటనే జాతర్ల సీజన్ మొదలవుతుంది. ఇది తొలకరికాలం వచ్చేవరకు సాగుతుంది. ఈ జాతరలు గిరిజన, మైదాన, తీరప్రాంతాలు అనే తేడా లేకుండా జరుగుతాయి. ఆయా ప్రాంతాలలో వెలసియున్న గ్రామదేవతల లేదా స్థానిక దేవుళ్ళ వార్షిక ఉత్సవాలను జాతరలుగా చేయడం పరిపాటి. ఇంకా పలు పుణ్యక్షేత్రాల లో కొలువై ఉన్న ప్రఖ్యాత దేవుళ్ల పేరుమీద కూడా యాత్ర లు నిర్వహించబడతాయి. ఇవన్నీ ప్రతియేటా క్రమం తప్ప కుండా జరుగుతుండడం విశేషం. ఇవి మూడు రోజులనుండి పది రోజుల కాలవ్యవధిగా కొనసాగుతుంటాయి. ఈ యాత్ర లను స్థానిక ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుం టారు. ఈ జాతరల (Fairs)కు లక్షలాదిమంది భక్తులు
హాజరవుతుం టారు. వారంతా స్థానిక దేవతామూర్తులను అత్యంత భక్తి ప్రపత్తులతో దర్శించుకుంటారు. ఈ యాత్రలకు పిల్లాది మొదలు కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్తారు. రాష్టేతర ప్రాంతాల నుండి ప్రజలు పెద్దయెత్తున హాజరుకావడం గమ నిస్తాం. మేడారంలో సమ్మక్క సారలక్క గిరిజన జాతర వైభవోపేతంగా జరుగుతుంది.

Read Also : Gas Shortage: యుద్ధంతో వంటగదిలో కిరోసిన్ సెగ

Fairs

తెలంగాణా ప్రభుత్వం సంద ర్శకులకు అనేక సదుపాయాలు కల్పించి యాత్రను ఘనం గా నిర్వహిస్తుంది. ఈ యాత్రకు కోట్లమంది భక్తులు హాజర వుతారనడం ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదు. ఇంకా తెలంగాణలో నాగోబా జాతర (Fairs), బోనాల పండుగ ప్రసిద్ధమై నవి. ఇదే మాదిరిగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో వత్సలవలస రాజులమ్మ యాత్ర వారంలో శని, ఆదివారాల్లో జరుగుతుంది. ఇలా ఆరేడు వారాలు వరుసగా యాత్ర కొనసాగడం విశేషం. ప్రతివారం లక్షల కొలదీ భక్తులు యాత్రకు వస్తుంటారు. ఇంకా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం, శంబర పోలమాంబ యాత్ర, రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర, చీపురుపల్లి కనక మహలక్ష్మి అమ్మవారి యాత్ర, కమ్మసిగడాం మహాలక్ష్మి యాత్ర, అనకాపల్లి నూకాలమ్మ తల్లి జాతరలు కన్నుల పండుగగా జరుగుతుంటాయి. ఇంకా కళింగాంధ్ర అంతటా జగన్నాథుని రథాయాత్రలు వైభవంగా జరుపుతారు. మధ్యాంధ్రలో భీమవరం మావుళ్ళమ్మ జాతర, ఏలూరు గంగమ్మ పోతురాజు బాబు జాతర, నెల్లూరు ప్రాంతంలో రొట్టెల పండుగ ఘనంగా జరుపుతారు. రాయలసీమలో తిరుపతి గంగమ్మ జాతర, దేవరగట్టు జాతర, అహోబిలం పార్వేట ఉత్సవం, శ్రీకాళహస్తి ఏడుగంగల జాతర ప్రసిద్ధి కెక్కాయి. ఇవే కాకుండా రాష్ట్రంలో ప్రఖ్యాతినొందిన పుణ్య క్షేత్రాలైన తిరుమల బ్రహ్మోత్సవాలు, శ్రీముఖలింగం, రామ తీర్థం, సింహాచలం, విజయవాడ కనకదుర్గమ్మ, గుణదల మేరీమాత, కోటప్పకొండ ప్రభల తిరునాళ్ళు, లేపాక్షి ఉత్స వం, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి తిరునాళ్లు వార్షిక ఉత్సవాలుగా జరుగుతాయి. వీటిని తిలకించేందుకు కోట్ల మంది జనం సంబంధిత ప్రాంతాల్లో గుమిగూడుతారు. ఇవే కాకుండా వినాయక చవితి, దసరా, శ్రీరామనవమి, బతు కమ్మ పండుగల పేరిట ప్రతి ఏడాది ప్రజలు ఉత్సవాలు చేసుకుంటుంటారు. ఇవన్నీ వివిధ ప్రజాసమూహాల సంస్కృ తీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల మేళవింపుగా జరుగుతాయి. ఈ యాత్రలతోపాటు ఉత్తరాంధ్రలో ఉన్న గ్రామాలలో వెలసియున్న పలు గ్రామదేవతల పేరిట ఉత్స వాలు జరుగుతుంటాయి. ఇవి జనవరి
నుంచి జూన్ మధ్య కాలంలో ఎక్కువగా నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాలను ఊరి పెద్ద పండుగనీ, అసిరమ్మ పండుగనీ అనడం కద్దు. అయితే ఇవి ఏటేటా జరగవు. కొన్ని సంవత్సరం తప్పించి సంవత్స రానికి, మరికొన్ని చాలా సంవత్సరాల విరామంతో జరుగుతాయి. ఐతే ప్రతి ఏడాది క్రమం తప్పకుండాజరుపు కునే సంబరాలు కూడా ఉంటాయి. వీటిని వారాలు అని అంటారు. ఇవి ఆయా గ్రామ ప్రజలచే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడడం చూస్తుంటాం.

Fairs

సాధారణంగా రెండు వారాల పాటు ఈ గ్రామదేవత ఉత్సవాలు జరుగుతాయి. ఒక వారం గ్రామదేవతను ఊర్లోకి తెస్తారు. ఆ రెండోవారం వనంగుడికి సాగనంపుతారు. ఈ తంతు యావత్తూ మేళతా ళాలతో, వివిధ కళా ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా జరుగుతాయి. గ్రామంలో గల కుటుంబాలన్నీ తమ తమ బంధుమిత్రులను ఆహ్వానించి ఘనంగా ఉత్సవాలను నిర్వ హించుకుంటారు. ఈ పండుగల్లో సదరు కుటుంబానికి చెం దిన ఆడపిల్లలు, అల్లుళ్లు,
మనవళ్ళు ప్రత్యేక ఆకర్షణగా కనబడతారు. ఈఉత్సవాల చివరి మూడు రోజులూ ప్రజలు హెచ్చుసంఖ్యలో హాజరవుతుంటారు. వారంతా ఉత్సవాల్లో ఒకరికొకరు భావోద్వేగాల్ని పంచుకొని ఆనందంగా గడుపు తారు. ఈ జాతరలు గ్రామీణ సంస్కృతికి అద్దంపడతాయి. పంటలు బాగా పండాలనీ, ప్రజలంతా ఆరోగ్యంతో ఉండా లనీ స్థానిక దేవతలకు జనం పూజలు చేస్తారు. చాలామంది భక్తులు పొట్టేళ్ళు, మేకపోతులు, కోళ్ళు బలి ఇస్తుంటారు. బోనాలు సమర్పిస్తుంటారు. ఇంకా అగ్నిగుండాల ఏర్పాటు, జానపద నృత్యాలు, పౌరాణిక పద్యనాటకాలు, సాంప్రదా య వేషధారణలు, విద్యుద్దీపాలతో వీధుల అలంకరణ, మందుగుండు సామాన్లు కాల్చడం, మరికొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ యాత్రల లో పల్లె ప్రజలే కాకుండా, పట్టణ ప్రాంతవాసులు కూడా హుషారుగా పాల్గొంటారు. నేటి పట్టణాలు ఒకప్పుడు పల్లె ప్రాంతాలే కదా! అందువల్ల కొన్ని జాతరలు పట్టణాల నడి బొడ్డున, శివార్లలో జరుగుతుంటాయి. పలైనా, పట్నమైనా జాతర అంటే జాతరే. సందడి సందడిగా ఉంటుంది. ఎన్నో మధుర జ్ఞాపకాలను పంచుతుంది. అయితే ఈరెండు సంద ర్భాలలో పర్యావరణానికి హెచ్చుస్థాయిలో ప్రమాదం వాటిల్లుతుంది. గాలి, నీరు, ఆహారం కలుషితమోతుంది. డీజే, మైక్ సెట్టింగ్ల వినియోగం వలన శబ్ద కాలుష్యానికి అంతే ఉండదు. విష రసాయన మందుగుండు సామాన్లు కాల్చడం వలన గాలిలో విషవాయువులు చేరుతాయి. జనసమ్మర్థత వల్ల వలన స్థానికంగా ఉండే నీటి వనరులు కలుషితమవు తాయి. చుట్టు పక్కల భూ ఆవరణమంతా దుర్గంధభరితమై వివిధ రకాల వ్యాధుల వ్యాప్తికి కారణభూతం అవుతుంది. అందువల్ల ఈజాతరలు, గ్రామదేవత ఉత్సవాలను పర్యావ రణ కాలుష్యరహితంగా జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.దీనికై ప్రభుత్వం ప్రజలు ఐక్యంగా కృషిచేయాలి. పక్కా ప్రణా ళికలతో స్థానిక పరిపాలనా విభాగాలు పనిచేయాలి. అధికార యంత్రాంగం ముందస్తుగా తగు జగ్రత్తలు తీసుకోవాలి.
-పిల్లా తిరుపతిరావు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News eco friendly festivals fairs kalushya rahitanga jataralu jaragali latest news pollution free fairs Telugu News temple fairs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.