ఆంధ్రప్రదేశ్ పదో తరగతి చదువుతున్న లక్షలాది మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఇళ్లలో ప్రస్తుతం ఒకే చర్చ నడుస్తోంది. అది ‘100 రోజుల యాక్షన్ ప్లాన్’ విద్యా సంవత్సరం ప్రారంభంలో నెమ్మదిగా సాగే పాఠశాల వాతా వరణం డిసెంబర్ వచ్చేసరికి ఒక్కసారిగా యుద్ధ ప్రాతి పదికన మారిపోయింది. ఫిబ్రవరి నాటికి పూర్తికావాల్సిన సిలబస్ ను డిసెంబర్ నాటికే ముగించాలన్న అధికారుల ఆదేశాలతో తరగతి గదుల్లో బోధన వేగం పుంజుకుంది. అయితే, ఈ వేగం వెనుక విద్యార్థుల భవిష్యత్తుపై ఉన్న ఆందోళనకంటే, రాష్ట్ర స్థాయిలో ఉత్తీర్ణతా శాతం పెంచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలన్న ప్రభుత్వ లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తోందన్న విమర్శలు విద్యా రంగ నిపుణుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చా కార్యక్రమ ఉద్దేశాలకు, ఏపీలో అమలవుతున్న ఈ యాక్షన్ ప్లాన్కు మధ్య ఉన్న స్పష్టమైన వైరుధ్యం చర్చనీ యాంశంగా మారింది. నిజానికి ప్రధాని మోడీ ‘పరీక్షా పే చర్చా’ ద్వారా ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తున్నారు. పరీక్షలు అనేవి కేవలం విద్యార్థుల జ్ఞాపకశక్తిని కొలిచే సాధనాలు కాకూడదని, వాటిని పండుగలా (ఎగ్జామ్స్ యాజ్ ఫెస్టివల్) ఆనందంగా ఎదుర్కో వాలని ఆయన పిలుపునిచ్చా రు. పరీక్షల సమయంలో విద్యార్థుల్లో కలిగే ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే ఈ కార్యక్రమంపరమార్థం. కానీ, ఏపీలో అమలవుతున్న వంద రోజుల ప్రణాళిక దీనికి భిన్నంగా, విద్యార్థులను నిరంతర ఒత్తిడికి గురిచేసేలా ఉందని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం
చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరంతర బోధన, ఆపై ప్రత్యేక తరగతులు, ఆదివారాలు కూడా మాక్ టెస్టులు నిర్వహించడం వంటి చర్యలు విద్యార్థులను మానసిక అలసటకు గురిచేస్తున్నాయి. శాస్త్రవేత్తలు చెప్పిన ట్లుగా, పిల్లల అభ్యాస ప్రక్రియ అనేది ఒక సహజ వృద్ధి విధానం. దానిని అర్థం చేసుకునే సమయం, పునశ్చరణ, స్వేచ్చగా ప్రశ్నలు అడిగే వాతావరణం అవసరం. వేగంగా సిలబస్ పూర్తి చేయాలన్న ఆరాటంలో ముఖ్యంగా గణితం, సైన్స్ వంటి కఠినమైన సబ్జెక్టుల్లో మూలభూత సూత్రాలు అర్థం కాకుండానే తదుపరి పాఠాలకు వెళ్లడం వల్ల విద్యార్థు లకు సమాచారం చేరుతోంది కానీ జ్ఞానం కలగడం లేదు.
Read Also : Chhattisgarh: బ్లేడ్లు, పిన్నలు సాయంతో చేతులు కోసుకున్న స్కూల్ విద్యార్థులు
Exams
ప్రధాని మోడీ సైతం తన ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకంలో మార్కుల కంటే అవగాహనకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచిం చారు. ‘జ్ఞాపకశక్తి కంటే భావనాత్మక స్పష్టత మిమ్మల్ని జీవితంలో గొప్పవారిని చేస్తుంది’ అన్న ఆయన మాటలకు, కేవలం పరీక్షా ఫలితాలకోసం చేస్తున్న ఈ యుద్ధ సన్నద్ధత వ్యతిరేక దిశలో ప్రయాణిస్తోంది. మరోవైపు, ప్రతి రోజు స్లిప్ టెస్టులు నిర్వహించి వాటి మార్కులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్న నిబంధన ఉపాధ్యాయులను డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మారుస్తోంది.\ బోధన నాణ్యతపై దృష్టి పెట్టాల్సిన గురువులు, మార్కుల నమోదు, అటెండెన్స్ వివరాల సేకరణలో సమయం వృధా చేయాల్సి వస్తోంది. ఇది ఉపాధ్యాయుల్లో కూడా అసహనాన్ని, అలసటను పెంచుతోంది. ‘మూల్యాంకనం అనేది విద్యార్థి లోపాలను సరిదిద్దే ఆలోచనాత్మక ప్రక్రియ కావాలి కానీ, అది యాంత్రి కంగా మారకూడదు’ అని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. పండుగల సెలవుల్లో కూడా విద్యార్థులను బడికి రప్పించ డం వల్ల వారు కుటుంబంతో గడిపే సమయాన్ని కోల్పోతు న్నారు. ఇది వారి భావోద్వేగ అభివృద్ధిపై ప్రతికూల ప్రభా వం చూపుతుంది. ప్రస్తుతం ఏపీలోని పదో తరగతిగదుల్లో ప్రతి విద్యార్థి ఒక సంఖ్యగా మారిపోతున్నాడనే విమర్శ వినిపిస్తోంది. చైల్డ్ సైకాలజీ ప్రకారం,14-15 ఏళ్ల వయసు లో ఉన్న పిల్లలకు శారీరక, మానసిక మార్పులు సంభవి స్తున్న తరుణంలో అధిక ఒత్తిడి కలిగించడం వల్ల వారిలో నిద్రలేమి, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు తలెత్తుతాయి. పరీక్షా (Exams)ఫలితాలు రాష్ట్ర విజయ సూచిక కావచ్చు కానీ, అది విద్యార్థుల సృజనాత్మకతను బాల్యాన్ని బలితీసుకునేదిగా ఉండకూడదు. ‘ఫలితాలు ముఖ్యమే కానీ, ఆ ఫలితాల వైపు సాగే ప్రయాణం కూడా అంతే ముఖ్యమని’ ప్రధాని పదేపదే చెబుతుంటారు. అంతిమంగా, విద్యా సంస్కరణలు అనేవి విద్యార్థిని మానసిక దృఢత్వం కలిగిన వ్యక్తిగా తీర్చి దిద్దాలి. 100 రోజుల యాక్షన్ ప్లాన్ లక్ష్యాన్ని సమతుల్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరీక్షల ప్రిపరేషనను ఒక సహజ అభ్యాస ప్రక్రియగా మార్చి, స్లిప్ టెస్టుల మోత తగ్గించి, విద్యార్థులకు తగినంత విశ్రాంతిని కల్పించినప్పుడే అది నిజమైన విద్యా సాధన అవుతుంది. పరీక్షలు (Exams)జీవితం లో ఒక మలుపు మాత్రమే తప్ప. అవే జీవితం కాదన్న వాస్తవాన్ని విద్యార్థులకు, తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పడమే ‘పరీక్షా పేచర్చా’ అసలు ఉద్దేశ్యం. ఆ స్ఫూర్తి తోనే రాష్ట్రస్థాయి ప్రణాళికలు కూడా రూపొందితే విద్యార్థు లు ఎగ్జామ్ వారియర్లుగా మారి విజయం సాధిస్తారు.
-నల రవికుమార్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: