తీవ్రమైన నయం కాని వ్యాధితో బాధపడ్తున్నవ్యక్తి జీవితం ఇక కొనసాగించలేని, అలా అని స్వ చ్ఛంద మరణం పొందలేని పరిస్థితుల్లో వారి ఆత్మీయులు ఈ విషయాన్ని బయటికి చెప్పి వారి ఆకస్మిక మరణానికి దారిచూపవచ్చు. అదే వైద్య పరి భాషలో ‘యుథనేసియా’ అంటారు. మరణం ఎలాంటి దైనా చావలేక బతుకలేక చచ్చేటంతటి నరకబాధను అను భవిస్తూ ఆత్మీయులకు తీవ్రవేదన కల్పిస్తున్న దశలో ‘కారుణ్య మరణం కోరడం సబబే అని ప్రపంచంలోని 27 దేశాలు చట్టాలు చేశాయి. అయితే దానికీ ఎన్నో నియమ నిబంధనలు, ఆటంకాలు, అడ్డంకుల ఆలోచనలు మానవ మస్తిష్కంలో ఉదయిస్తారు. అలాంటి సంఘర్షణ ఒకటి సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది. ఎంతో కారుణ్యమున్నా ఇలాంటి సందర్భాల్లో చట్టపరిధిలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎంతటి వారికైనా మనసు హృద్యంగా మారి ఉంటుంది. అందుకే 13ఏళ్లకు పైగా కోమాలో ఉన్న 32 ఏళ్ల హరీష్ రాణాకు ‘పరోక్ష కారుణ్య మరణాన్ని’ ప్రసాదిస్తూ తీర్పు వెలువరించిన సందర్భంలో జస్టిస్ పార్టీవాలా కంటనీరు చెమ్మగిల్లింది. అంటే ఇలాంటి అంశాల్లో నిర్ణయం తప్పనిసరైనప్పుడు బాధ తప్త హృదయాలతోనే తీర్పు ఇవ్వడం జరిగే విష యమే. ‘జీవితం ఎంత క్షణభంగురమో తెలిసొచ్చినా ప్రేమ, కారుణ్యం ఆధారంగానే తప్ప హేతుబద్ధత, తర్కా లతో నిర్ణయం జరుగదు. కృత్రిమ పద్ధతుల్లో జీవితాన్ని నిరర్థకంగా పొడిగించాల్సిన అవసరముండదు. ఎంత వైద్యం చేసినా సజీవంగా ఉంచామన్న పేరుకే తప్ప ఏ జీవికి చావును తప్పించలేమన్నది ‘ధర్మాసనం’ అభిప్రాయ పడింది. ఈఅంశంపై మనకు ప్రత్యేక చట్టాలులేవు. సుప్రీం కోర్టు నిర్ణయం సంచలనాత్మకమే. మిశ్రమ అభిప్రాయాలు వెలిబుచ్చినా వైద్య చికిత్సలు కొనసాగిస్తూ మనుడకు ప్రాణం పోయడమే తప్ప ఏ వ్యక్తికీ సజావైన జీవితాన్ని ఇవ్వలేరు.
Read Also :Odisha hospital fire : ఒడిశా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, ఐసీయూలో 10 మంది మృతి
రోగి కోలుకునే అవకాశం ఏమాత్రమూ లేదని ఎందరో వైద్య నిపుణులు, ఎన్నో మెడికల్ బోర్డులు తేల్చి చెప్పాయి. హరీష్ తండ్రి వైద్యంద్వారా తన కుమారు డిని బతికించుకోవాలని చూసారు. 13ఏళ్లు కోమాలో ఉన్న హరీషక్కుకుటుంబం యావత్తు బాసటగా నిలిచారు. నిస్వార్థ సేవలు చేస్తూ హరీష్ పట్ల అంతులేని ప్రేమ చూపేవారు. తండ్రి అశోక్ రాణా తన బిడ్డపడే నరక యాతనను చూడలేక ‘పరోక్ష కారుణ్య మరణం’ ప్రసాదిం చమని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అంటే తన కుమారునికి వైద్యసేవలు నిలిపి వేసేందుకు అనుమతి అన్న మాట. ఈ పిటిషన్పై జస్టిస్ పార్థీవాలా, కె.వి. విశ్వనా థన్లు ధర్మాసనం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ తీర్పు మేరకు హరీష్కు ఒక క్రమపద్ధతిలో వైద్యాన్ని నిలిపివేసి అతడ్ని సహజ మరణం వైపునకు ప్రేరిపిస్తారు. అనంత రం అతని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోతుంది. దేశంలో కారుణ్యమరణాన్ని (Euthanasia) కోర్టు ఆమోదించిన ప్రప్రథమ కేసు ఇదే అవుతుంది. ఎన్నో ఏళ్లుగాచర్చనీయాంశంగా ఉన్న ఇలాంటి ‘యుధోనేసియా’ ప్రక్రియపై 2018లో ‘కామన్ కాజ్ కేసులో ప్రత్యేక పరిస్థితుల్లో పరోక్షకారుణ్య మరణాన్ని(Euthanasia) అనుమతించవచ్చునని రాజ్యాంగ ధర్మాసనం సూచించింది. అప్పట్లో 1973లో ముంబై కింగ్ అడ్వర్డ్ స్మారక మెమోరియల్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న అరుణ శాన్బాగ్పై లైంగిక దాడిజరిగింది. పెనుగులాటలో మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి కోమాలోకి వెళ్లి పోతే ఆమె నాలుగు దశాబ్దాలపాటు ఆసుపత్రిలోనే ఉండి పోయింది. 2009లో పింకీ విరానీ అనే స్నేహితురాలు ఆమెదుస్థితి చూడలేకపోతున్నందున శాన్బాగ్కు కారుణ్య మరణానికి ఆదేశాలిమ్మని కోర్టును కోరింది. ఆసందర్భాన్నే ఉదాహరణగా తీసుకొని అప్పటి ధర్మాసనం కారుణ్యమర ణం సమంజసమేనని, అందుకు పూర్తి అర్హతలున్న కేసే నని వ్యక్తంచేసింది.
కానీ రోగి ఆత్మబంధువులు కాకుండా స్నేహితురాలు కోర్టును ఆశ్రయించడంతో దానినిసాంకేతిక కారణాలతో అభ్యంతరం పెట్టారు. ‘యుథనేసియా’పై ఒక చట్టాన్ని తీసుకురావాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీవించే హక్కుతోపాటు గౌరవప్రదంగా తను వు చాలించడం కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 రీత్యా పరిగణనలోకి తీసుకోదగినదని కోర్టు అభిప్రాయపడింది. ముందుగా హరీష్కు కారుణ్య మరణం ప్రసాదించే విష యంలో ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దాంతో అతని తల్లిదండ్రులు సుప్రీంకోర్టు తలుపుతట్టారు. పైపులద్వారా అందించే పోషకాహారం కూడా వైద్య చికిత్స కిందకే వస్తుంది కనుక వైద్యుల పరిశీలనానంతరం లైఫ్ సపోర్టు తోపాటు పోషకాహారాన్ని నిలిపివేయాలని ధర్మాసనం చెబుతోంది. తాజాగా మరో కేసులో ఇక జీవించే అవకాశం లేదని వైద్యనిపుణులు భావించి ‘బ్రెయిన్డెడ్’గా నిర్ణయిం చిన ఓ మహిళను ఇంటికి తీసుకెళ్తుండగా చలనం వచ్చి బతికింది. బ్రెయిన్టెడ్ మహిళ బతికి బట్టకట్టింది. ఆమెను ఇంటికి తీసుకెళ్తున్న అంబులెన్స్ రోడ్డు గుంతలోపడింది. మిగిలినవారు చెల్లాచెదురుగా కిందపడగా ఆమెలోకాస్తంత చలనం గమనించి ఆసుపత్రికి చేర్చి వైద్యసహాయం అంధిస్తే లేచి కూర్చొంది. ఎంత అద్భుతం. మృత్యుంజయిగా పేర్కొనవచ్చు. తాజా సంఘటన మరోలా అన్వయించ వచ్చు. ఈ ఉదంతం కూడా ఇకపై కారుణ్య మరణం కోసం తపించే అంశాలకు కొత్తదారి చూపించవచ్చు. అది లేకుంటే మరో మార్గాంతరం కోసం అన్వేషించనూవచ్చు. జీవచ్ఛవంలా బతుకుతున్న వారికి, వారి సేవలో అంటి పెట్టుకుని ఉండేవారికి ప్రస్తుత తీర్పు దిశానిర్దేశాన్ని సూచి స్తుంది. ఎన్నో ఏళ్లుగా చర్చల్లో ఉన్న ‘యుథోనేసియా’కు కొత్త కొత్త సూచనలు బాసటగా ఉండే అవకాశం ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: