📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్

Kaja Kallas: భారత్​తో సమగ్ర ఒప్పందానికి ఈయూ సిద్ధం

Author Icon By Vanipushpa
Updated: January 22, 2026 • 4:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌తో ఒక సమగ్ర ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉందని యూరోపియన్ యూనియన్ తెలిపింది. ఈయూ బృందం భారత్ పర్యటన సమయంలో ఈ ఒప్పందం కుదిరే అవకాశముందని ఈయూ విదేశాంగ, భద్రతా విధానాల ప్రతినిధి కాజా కల్లాస్(Kaja Kallas) తెలిపారు. ఈమేరకు యూరోపియన్ పార్లమెంట్‌లో మాట్లాడిన ఆమె మాట్లాడారు. భారత్- ఈయూ మధ్య 16వ శిఖరాగ్ర సమావేశం దిల్లీలో జరగనుంది. రిపబ్లిక్ డేకు ప్రత్యేక ఆహ్వానితులుగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియా కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లియన్‌ వస్తున్నారు. ఈ పర్యటనలోనే భారత్–ఈయూ వ్యూహాత్మక అజెండాను ఆమోదించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాజా కల్లాస్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.

Read Also: America: చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ

Casa Callas: భారత్​తో సమగ్ర ఒప్పందానికి ఈయూ సిద్ధ

ఇండియాతో కొత్త భద్రతా రక్షణ భాగస్వామ్య ఒప్పందం

‘భారత్‌తో పటిష్టమైన నూతన వాణిజ్య అజెండాను అమలు చేయడానికి యూరప్ సిద్ధంగా ఉంది. ఈరోజు ఇండియాతో కొత్త భద్రతా రక్షణ భాగస్వామ్య ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈయూ అంగీకరించింది. ఈ ఒప్పందం ద్వారా సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధం, సైబర్ రక్షణ వంటి రంగాల్లో ఇరు వర్గాల సహకారం మరింత విస్తరిస్తుంది. వచ్చే వారం దిల్లీలో జరిగే ఈయూ- ఇండియా సమ్మిట్​ సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి ఎదురు చూస్తున్నా’ అని కాజా కల్లాస్ పేర్కొన్నారు. భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లియన్‌ కూడా స్పందించారు. భారత్​-ఈయూ మధ్య కుదిరే వాణిజ్య డీల్​ చివరి దశలో ఉందని, దీన్ని కొందరు అన్ని ఒప్పందాలకు తల్లిగా అభివర్ణిస్తున్నారని ఇటీవల ఆమె పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

comprehensive agreement EU India partnership foreign policy news India EU relations international trade deal strategic cooperation Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.