📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్

EU: ట్రంప్ నిర్ణయంపై తిరగబడ్డ ఐదు మిత్ర దేశాలు

Author Icon By Vanipushpa
Updated: January 22, 2026 • 12:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మిత్రదేశాలే ఇప్పుడు కొట్టుకుంటున్నాయి. ఒక ద్వీపం కోసం నువ్వెంత అంటే నువ్వెంత అని గొడవలు పడుతున్నాయి. అమెరికా మొదలుపెట్టిన ఈ యుద్ధాన్ని ఐరోపా దూశాలు కంటిన్యూ చేస్తున్నాయి. వెనెజెవెలా తర్వాత అమెరికా అధ్యక్షుడు గ్రీన్ ల్యాండ్ మీద ఫోకస్ చేశారు. సహజ వనరులతో నిండి ఉన్న దాన్ని ఎలా అయినా సొంతంత చేసుకుంటానని చెప్పారు. కానీ దీనికి డెన్మాక్క్ తో సహా ఐరోపా దేశాలన్నీ ఒప్పుకోలేదు. గ్రీన్ ల్యాండ్ తమ భూభాగమని డెన్మార్క్ వాదిస్తోంది. దానికి ఐరోపా దేశాలు మద్దతు పలుకుతున్నాయి. మరింకో వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఊరుకున్నారా…అబ్బే మీకే అంత ఉంటే నాకెంత ఉండాలి అంటూ…తనకు మద్దతు ఇవ్వని ఐరోపా దేశాల మీద సుంకాల మోత మోగించారు. మొదట 10 శాతంతో విరుచుకుపడ్డారు. దాన్ని ఇంకా పెంచుతానని కూడా హెచ్చరించారు. దీంతో ఈయూకు మండింది.

Read Also: WEF: తెలంగాణకు భారీ పెట్టుబడులు: టాటా గ్రూప్‌తో కీలక ఒప్పందాలు

EU: ట్రంప్ నిర్ణయంపై తిరగబడ్డ ఐదు మిత్ర దేశాలు

ఈయూ దేశాల నేతలు, అమెరికా అధ్యక్షుడు హాజరు

ఇదిలా జరుగుతుండగా…ప్రతీ ఏటా జరిగే ఎకానిమిక్ ఫోరమ్ దావోస్ టైమ్ వచ్చింది. ప్రపంచదేశాలన్నీ ఇందులో పాల్గొన్నాయి. ఈయూ దేశాల నేతలు, అమెరికా అధ్యక్షుడు అందరూ వచ్చారు. ఇదే సరైన సమయం అనుకున్నాయి ఐరోపా దేశాధినేతలు . ట్రంప్ మీద ఉన్న కోపాన్ని అంతా చూపించేశారు. అమెరికా ఆధిపత్యం కారణంగా ప్రపంచం విచ్ఛిన్నం అవుతోందని, ఇక ఆ దేశంతో కలిసి నడిచే రోజులు పోయాయని కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్పష్టం చేశారు. శక్తివంతమైన దేశాలు ఏం కావాలంటే అది చేస్తున్నాయి. బలహీనమైన దేశాలు నష్టపోతున్నాయి. ఈ పద్ధతి ఇక మీదట కొనసాగదు అని కార్నీ అన్నారు.

ట్రేడ్ బజూకాకు సిద్ధం కావాలని ఆయన ఐరోపా కూటమికి పిలుపు

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సైతం ట్రంప్ పై విరుచుకుపడ్డారు. అమెరికా కొత్త వలసవాద సామ్రాజ్య విధానాన్ని అనుసరిస్తోందని, దీనివల్ల దశాబ్దాల నాటి భాగస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ మాక్రన్ హెచ్చరించారు. మనం బెదిరిర చేవాళ్లకు, క్రూరమైన చట్టాలకే గౌరవం ఇస్తున్నామంటూ ప్రస్తుత యూరప్‌ విధానాలను తూర్పారబట్టారు.సుంకాల ద్వారా ఐరోపాను అణిచివేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

EU news European Union politics five allied countries global political tensions International Diplomacy Telugu News online Telugu News Today Trump decision backlash US EU relations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.