📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Epstein Files: దేశాధినేతల పీఠాలకే ఎసరుపెడుతున్న ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు

Author Icon By Vanipushpa
Updated: February 10, 2026 • 10:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా మల్టీ మిలియనీర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ (Epstein)కు సంబంధించిన రహస్య పత్రాలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ వర్గాలను వణికిస్తున్నాయి. ఈ ఎప్‌స్టీన్ ప్రకంపనలు అగ్రరాజ్యం అమెరికాను దాటి ఐరోపా ఖండంలోని ప్రధాన దేశాలను తాకాయి. ఈ స్కాండల్ ప్రభావంతో ఇప్పటికే పదికి పైగా దేశాల్లో మంత్రులు, దౌత్యవేత్తలు, ఉన్నత స్థాయి అధికారులు తమ పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఫైల్స్ వల్ల అత్యధికంగా ప్రభావితమైన దేశం బ్రిటన్. ఈ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ప్రస్తుతం తన రాజకీయ జీవితంలోనే అత్యంత కఠినమైన దశను ఎదుర్కొంటున్నారు. అమెరికాలో బ్రిటన్ మాజీ రాయబారిగా పనిచేసిన పీటర్ మాండెల్సన్‌కు ఎప్‌స్టీన్‌తో ఉన్న సంబంధాలు ఈ ఫైల్స్ ద్వారా బయటపడ్డాయి. మాండెల్సన్ గతంలో ప్రభుత్వ రహస్యాలను, కీలకమైన దౌత్య సమాచారాన్ని ఎప్‌స్టీన్‌కు చేరవేసినట్లు ఆధారాలు లభించాయి. ఇటువంటి వివాదాస్పద వ్యక్తిని కీలక పదవిలో నియమించినందుకు ప్రధాని స్టార్మర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని చీఫ్ ఆఫ్ స్టాఫ్ మోర్గాన్ మెక్‌స్వీనే ఇప్పటికే రాజీనామా చేశారు.

Read Also: AI Summit: ఆకాశాన్ని అంటిన ఢిల్లీలో హోటల్ గదుల ధరలు

Epstein Files: దేశాధినేతల పీఠాలకే ఎసరుపెడుతున్న ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు

బ్రిటన్‌తో పాటు నార్వే, స్వీడన్, స్లొవేకియా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కూడా ఎప్‌స్టీన్ సంబంధాలు

బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ పేరు మరోసారి ఈ స్కాండల్‌లో ప్రముఖంగా వినిపిస్తోంది. 2001 నుంచి 2011 మధ్య కాలంలో ఆయన ప్రత్యేక వాణిజ్య ప్రతినిధిగా ఉన్నప్పుడు అధికారిక పర్యటనలు, ప్రభుత్వ పెట్టుబడులకు సంబంధించిన అతి రహస్య నివేదికలను ఎప్‌స్టీన్‌కు ఈమెయిల్స్ ద్వారా పంపినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. దీనిని అధికారిక రహస్యాల చట్టం కింద తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. బ్రిటన్‌తో పాటు నార్వే, స్వీడన్, స్లొవేకియా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కూడా ఎప్‌స్టీన్ సంబంధాలు బయటపడటంతో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. జోర్డాన్‌లో నార్వే రాయబారిగా పనిచేస్తున్న మోనా జూల్, ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్నట్లు రుజువు కావడంతో సస్పెన్షన్‌కు గురై ఆ తర్వాత రాజీనామా చేశారు. స్లొవేకియా దేశ మాజీ విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు మిరోస్లావ్ లజక్ కూడా ఈ వివాదంలో చిక్కుకుని తన పదవిని కోల్పోయారు. స్వీడన్ సీనియర్ దౌత్యవేత్త జోనా రుబిన్‌స్టీన్ కూడా ఎప్‌స్టీన్‌తో ఉన్న పరిచయాల కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

elite power networks Epstein scandal global headlines global political crisis International Politics political scandals Telugu News online Telugu News Today world leaders controversy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.