భవిష్యనిధి సంస్థ (EPFO) ట్రాన్స్‌జెండర్ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులు ఇప్పుడు పీఎఫ్ ఖాతా రికార్డుల్లో పేరు, జెండర్ మార్చుకోవడం మరింత సులభం అయ్యింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ట్రాన్స్‌జెండర్ ఐడీ కార్డును అధికారిక ధృవీకరణ పత్రంగా EPFO ఆమోదించింది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది ఉద్యోగులకు పెద్ద ఊరట లభించింది మరియు సామాజిక సమానత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది.
Read alos: Microsoft Layoffs: జనవరిలో భారీగా తొలగింపులు నిజమేనా?
EPFO provides a key facility to transgender employees
పీఎఫ్ రికార్డుల మార్పులో పాత ఇబ్బందులకు ముగింపు
ఇంతకుముందు, పీఎఫ్ రికార్డుల్లో పేరు, పుట్టిన తేది లేదా జెండర్ మార్పు కోసం ఆధార్, పాన్ వంటి పత్రాలు అవసరమయ్యేవి. ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులు లింగ మార్పు తర్వాత పాత పత్రాలతో రికార్డులను సరిచేయడం కష్టం అనిపించేది. ఈ సమస్యను అధిగమించడానికి EPFO కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ ద్వారా జారీ అయ్యే ఐడీ కార్డు ఇప్పుడు చెల్లుబాటు అయ్యే అధికారిక పత్రాల్లో చేర్చబడింది.
ట్రాన్స్‌జెండర్ (Transgender) వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం–2019ను అనుసరించి, అర్హులైన ఉద్యోగులు EPFO యూనిఫైడ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో “జాయింట్ డిక్లరేషన్” సమర్పించి, తమ ట్రాన్స్‌జెండర్ ఐడీ కార్డును అప్‌లోడ్ చేయడం ద్వారా రికార్డులను సులభంగా నవీకరించుకోవచ్చు. ఈ విధానం ద్వారా పత్రాల సేకరణలో ఎదురయ్యే వివక్ష, సాంకేతిక ఇబ్బందులు తొలగిపోతాయి. భవిష్యత్తులో పింఛను, విత్‌డ్రా క్లెయిమ్‌లను కూడా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేసుకోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: