Newark Airport: నెవార్క్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్

Read Time:  1 min
నెవార్క్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్
నెవార్క్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్
FONT SIZE
GET APP

విమానాల్లో చిన్న సాంకేతిక సమస్య తలెత్తినా అది కొన్నిసార్లు పెద్ద ప్రమాదాలకు దారితీయొచ్చు. అందుకే ఏ సమస్య వచ్చినా పైలట్లు వెంటనే దగ్గర్లోని ఎయిర్‌పోర్టులో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు. తాజాగా అమెరికా(America)లోని నెవార్క్‌ ఎయిర్‌ పోర్టులో ఒక విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 5.55 గంటలకు జెట్ బ్లూ విమానయాన సంస్తకు చెందిన ఎయిర్ బస్ 320 విమానం నెవార్క్ నుంచి ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌కు బయల్దేరింది.

విమానం బయల్దేరిన 17 నిమిషాల్లోనే తిరిగి నెవార్క్ ఎయిర్‌పోర్టుకు..

విమానం బయల్దేరిన కొద్దిసేపటికే కాక్‌పిట్‌ నుంచి పొగలు రావడాన్ని పైలట్లు గుర్తించారు. వెంటనే ఏటీసీకి సమాచారం అందించారు. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతించారు. విమానం బయల్దేరిన 17 నిమిషాల్లోనే తిరిగి నెవార్క్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా వారికి కీలక సూచన చేశారు. రెగ్యులర్ డోర్ నుంచి కాకుండా ఎమర్జెన్సీ స్లైడ్స్ నుంచి దిగాల్సిందిగా ప్రయాణికులకు సూచించారు. దీంతో వారంతా ఎమర్జెన్సీ డోర్స్ నుంచి త్వరగా దిగేశారు. ఈ సమయంలో విమానం పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌పోర్టును కొన్ని గంటలపాటు మూసివేశారు. ఇతర విమానాల రాకపోకలపై నిషేధం విధించారు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఎయిర్‌పోర్టును మూసివేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.