📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TG Municipal Election Results: కాంగ్రెస్ లీడ్, బీఆర్‌ఎస్ తొలి విజయం

Author Icon By Pooja
Updated: February 13, 2026 • 11:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. చాలా చోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా, కొన్ని ప్రాంతాల్లో బీజేపీ కూడా ముందంజలో ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో(Election Results)మొదటి ఫలితం వెలువడింది. మెదక్ జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 14 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా, మూడు వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

Read Also: Election counting: కౌంటింగ్ లో కాంగ్రెస్ ఆధిక్యం

Election Results: Congress leads, BRS wins first

నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఆధిపత్యం
నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హవా(Election Results)కొనసాగుతోంది. నందికొండ, హాలియా, చండూరు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ ప్రకారం మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

మున్సిపాలిటీలు (116) – మొత్తం 2581 వార్డులు:

కార్పొరేషన్లు (7) – మొత్తం 414 వార్డులు:

లెక్కింపు కొనసాగుతోంది
ఇంకా అనేక మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కొనసాగుతుండటంతో ఫలితాలు గంటగంటకూ మారే అవకాశం ఉంది. అధికారిక ప్రకటనల కోసం రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

BJPTelangana CongressLead Google News in Telugu Latest News in Telugu TGMunicipalElections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.