हिन्दी | Epaper

Economic development : జనాభా సరే.. ఆర్థిక అభివృద్ధి సాధించామా?

Sudha
Economic development : జనాభా సరే.. ఆర్థిక అభివృద్ధి సాధించామా?

ఇ టీవల ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో ఆ సంస్థ అధినేత మోహన్ భగవత్ మరో కొత్త నినాదాన్ని అందించారు. అదే ప్రతొక్కరూ ముగ్గురు పిల్లలు కనాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. దేశంలో కొన్ని నివేదికలు కూడా జనాభా విషయంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది అవస రమని స్పష్టం చేశాయి. దీని ఆధారంగా దేశాన్ని దృష్టిలో ఉంచుకొని చెబుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలో సరిపడే జనాభా ఉండాలి, లేకుంటే దేశంలోని కాలానుగు ణంగా సమస్యలను ఎదురో్కలేం. అందుకే ప్రతొక్కరూ ముగ్గురు మాత్రమే ఎక్కువ ఉండ కూడదనేది అందరూ అంగీకరించాల్సిందేనని తెలిపారు. హిందూ సమాజాన్ని ఐక్యం చేసి సాధికారత కల్పించాలన్నారు. హిందూ కుటుం బాలు ముగ్గురు పిల్లలను కనాలి. అలాగే చొరబాటుదారులు, మతం మారినోళ్లను గుర్తించాలి, ఉద్యోగాల్లో ఉంటే వారిని బహిష్కరించాలి. ఇదే హిందూ సమాజానికి కీలక మందు. తగ్గుతున్న హిందూ జనాభాను చూస్తే ఆందోళనకరంగా ఉందని మోహన్ భగవత్ అన్నారు. ఇప్పటికే హిందూ కుటుంబాలు సగటు కంటే తక్కువగా సంతానోత్పత్తి ఉన్న సమాజాలు భవిష్యత్తులో నిర్వీర్యమవుతాయని, ప్రస్తుతం ముందున్న పరిష్కారం కొత్త జనరేషన్ కు ముగ్గురు పిల్లల అవగాహన కల్పించాల్సిందే, సృష్టిని ముందుకు తీసుకెళ్ల డమే మన లక్ష్యం. పౌర సమాజమంతా ఒకే దేశం, ఒకేజన్మభూమిపై పట్టు బిగించాలి. కాలాను గుణంగా సనాతన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలని దేశానికి ఆయన పిలుపునిచ్చారు. మన దేశసాంప్రదాయం మహిళ లకు గౌరవప్రదమైన స్థానం ఇస్తుంది, యావత్తు ప్రపంచంలోని సమస్యలకు పరిష్కార మార్గాలు మన దేశ నాగరికతలో ఉన్నాయి. అందుకోసం బలహీన వర్గాలకు మద్దుతుగా నిలిచి సామాజిక సామరస్యాన్ని పెంపొందిం చాలని, పరోక్షంగా అమెరికా, చైనాలో కొన్ని శక్తులుదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయనివిమర్శించారు. కెరీర్ అంటే కేవలం ఎక్కువ సంపాదించడం లేదా వినియోగించడం కాదు. ఇతరులను పంచుకోవడం, సేవ చేయడమనేది పిల్లలకు నేర్పించాలి.

Read Also : Bank Charges: బ్యాంకు ఛార్జీలపై పార్లమెంట్లో రాఘవ్ చద్దా ఫైర్

Economic development
Economic development


ముఖ్యంగా దేశానికి అన్నిటికంటే ఉన్నత విలువలు ఉన్న కుటుంబాలను అందించాలి. సమాజానికి వ్యక్తి కాదు, కుటుంబమే ప్రాథమిక యూనిట్ అని, సామాజిక ప్రవర్తన దానిలోనే రూపుదిద్దుకుంటుందని భగవత్ అన్నారు. 1990లో దేశ జనాభా విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో యావత్ దేశం ఆందోశనలో పడింది. అప్పట్లో జనాభా నియంత్రణ కోసం అందుబాటు లో ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించేశారు. ముగ్గురు వద్దు, ఇద్దరు ముద్దు అనే నినాదాన్ని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఉద్యమంలా ప్రచారాలు చేశాయి. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పథకాలు రావని, అనర్హతగా పరిగణించి కట్టడి చర్యలు తీసుకున్నారు. స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు కూడా ఇద్దరు పిల్లల నిబంధన గ్రామ, పట్టణ అమలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పాటు గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ నిబంధనలతో చట్టాలు చేసి అమలు చేస్తున్నారు. జనాభా పెరగడం వల్ల వచ్చే అనర్థాలను కళ్లకు గట్టినట్లు చెప్తూ ప్రచారం చేసేవారు. అయితే కాలం మారే కొద్దీ ఇద్దరు బిడ్డల నినాదం మరింత బలంగా మారి ఆర్థికఅవకా శాలకు తలొగ్గి ఒక్కరికే పరిమితమైన కుటుంబాలు పెరిగా యి. అధిక సంతానం వల్ల వారిని పోషించడంలో భారం, చదువు వ్యయం భరించలేమన్న భయం బాగా ఫలించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సరికొత్త నినా దం అమల్లోకి వచ్చింది. ఎక్కువ మందిని పిల్లలు ఉంటేనే జాతి నిర్వీర్యాన్ని అడ్డుకోగలమని ముందున్న లక్ష్యంగా మారింది. ఒకప్పుడు స్థానిక సంస్థలు, సర్పంచ్ఎ న్నికల్లో నూ ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులుగా ప్రకటిం చారు. సమాజంలో ఇద్దరు పిల్లలు నినాదాన్ని బలేపేతం చేసేందుకే ఆ నిబంధనను అనుచరించారు. తాజగా మరిన పరిస్థితుల దృష్ట్యా నిబంధను కూడా ఎత్తివేసే పరిస్థితి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిబంధన ఎత్తివేయ డంపై చర్చనీయంగా మారింది. మొన్నటి వరకు పాత నిబంధననే అమలులో ఉంచారు. కొత్త చట్టాన్ని రూపొం దించినప్పుడు ప్రభుత్వాలు మార్చుకోలేదు. పలు రాజకీయ పక్షాలతో పాటు ప్రముఖలు నిబంధన ఎత్తివేయాలని కోర డంతో ఇద్దరు పిల్లల నిబంధనకు చెక్ పడింది.

తెలంగాణలో ఆమోదానికి రాలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించి ఇద్దరి
కంటే ఎక్కువ మంది ఉన్నా పోటీ చేసుకునేలా వెసులు బాటు కల్పించింది. మోహన్ భగవంత్ సంఘ్ సభలో ప్రకటించిన నినాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. ఇది ఇప్పుడిప్పుడే చెబుతున్నది కాదు ఎంతో కాలం నుంచి జనాభా విషయంలో అప్రమత్తంగా ఉండాలని, జనాభా పెరగాలని, చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే అది ఒక వర్గానికి అనుసరించినదే. ఎన్నికల సమయంలో చంద్రబాబు కూడా ఇదేవిషయాన్ని నొక్కి చెప్పారు. అయితే ఒక బ్రహ్మచారి కుటుంబ విలువలు, భావనల కోసం చెప్పడంకహస్యాస్పదంగా ఉందనేది పలువురి ప్రముఖుల మాట. అన్ని మతాలను విమర్శించకుండా పిల్లలను కనాలని చెప్పడం వెనుక స్వార్థపూరితమైన లక్ష్యం కనబడుతోంది. ఎక్కువ మంది పిల్లలతో జిందగీని సాగించే వాళ్లకు తెలుస్తుంది నొప్పేంటోనని, సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని స్వార్థ భావనలు ప్రచారం చేసిన వారికి కుటుంబ బతుకులంటే తెలియని బ్రహ్మచారులు, సాధువులు, మునులకు ఎలా తెలుస్తుంది?. ముందుగా ముగ్గురు పిల్లలను వర్గంలో ఎంతమంది కంటున్నారు, వాళ్లకు బతుకు భరోసా ఎలా ఉందో, జనాభా పెరగాలన్నే లక్ష్యానికి ఎంతమంది కట్టుబడి ఉన్నారో అనేది ఆచరణలో చూపించాలి. జనాభా రేటు తగ్గడమనేది నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియనే. అయితే హిందూ సమాజం తగ్గుతోందనడం సరైనదికాదు. ఓట్ల కోసమే బలం మాటున భావనను ప్రదర్శిస్తున్నారనేది కనబడుతోంది. దేశంలో ముస్లిం, ఇతర మతాలు రాకముం దు ఉన్న మతమేంటి? దానితో మనకు ఒరిగిందేమిటి? జనాభా పేరుతో హిందువులు తగ్గుతున్నారనేదే ముఖ్యమైన అంశం. ప్రస్తుతం హిందువుల మనుగడ పుట్టే పిల్లలపై ఆధారపడిఉందనేది తెలుస్తుంది. మరోవర్గం ముస్లింలను అడ్డు కొనే శక్తి కోసమే పిల్లలు కనాలనేది కనబడుతోంది. హిందూ సమాజం నిర్వీర్యం అయితే ఏంజరుగుతుంది.

Economic development
Economic development

ఇతర దేశా ల్లోనూ మన దేశ సంతతివాళ్లు ఉన్నారు. మరి అక్కడ దేశ సంస్కృతులు పాటించకుండా ఉండలేరెమో కాదా? మన దేశంలో హిందు మాటున ఉన్న హింసాత్మక వ్యక్తుల మనుగడ కోసం నినాదాలను తీసుకొస్తున్నారు. దేశ ఆర్థిక బలం(Economic development) కోసం, మానవాభివృద్ధి పేరుతో సంతానోత్పత్తిని తగ్గించే చర్యలు కొనసాగుతున్నప్పుడూ జనాభాలో తగ్గుముఖంపడు తూనే వస్తోంది. అప్పటికి ఆర్థికబలమే నిజమైన నినాదం. మూలాలు అంటూ హిందు సమాజానికి పిలుపునిచ్చి ముం దుకు తీసుకెళ్లారు. మరో పక్క ముస్లిం వర్గంలో మాత్రం
పిల్లలు భవిష్యత్తు దేవుళ్లగా పరిగణించి ముందుకెళ్తున్నా వాళ్లనూ జనాభా సమతూకంలో ఉండాలని కట్టడి చర్యలకు గురి చేశారు. అయినా వాళ్లు పరోక్షంగా పిల్లల భవిష్యత్తేనేకొనసాగించారు. ఇప్పుడు జనాభా నియంత్రణ నుంచిజనాభా నినాదానికి మార్చుకుంటున్నారు. మతానికి బలం చేకూర్చేం దుకు పిల్లలు అవసరమైతే కనాలనే చెబుతున్నారు. మరి ఆర్థిక బలం సంగతేంటి? జనాభా తగ్గితే అభివృద్ధికి మూలం అన్నారు. ఇప్పుడేమో జనాభా పెరగాలంటున్నారు. ఇప్పటి వరకు ఆర్థిక బలమూలేదు, అభివృద్ధి లేదు.(Economic development) కేవలం మాతోన్మాద బలమే సాధించినట్లా? ఇతర ముస్లిం, క్రైస్తవ దేశాల్లో సంతానోత్పత్తితో సమానంగా అభివృద్ధిని ముందుకుతీసుకెళ్లే చర్యలు పాటించినాయి. ఎంత పెద్ద కుటుంబమైనా, ఎంత మంది పిల్లలు ఉన్నా ఆర్థికభరోసాను బాధ్యతగా తీసుకున్నా యే తప్ప ఎలాంటి కట్టడి చర్యలు తీసుకోలేదు. మరిమనదేశం లో జరుగుతున్నదేంటి? పిల్లలను కనాలనిచెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బాగోగుల కోసం ఏం చేస్తుంది.
-పట్ట హరిప్రసాద్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870