చెడునడత కలవారికి స్థానం లేదు. కాస్త ఆలస్యంగానైనా మానవ సమాజంలో ఈ విష యం ధృవపడే సత్యం. కానీ ఉత్తర అమెరికా లోని ‘మెక్సికోలో మాదక ద్రవ్య వ్యాపారం. పేరు పడిన ఎల్మెంచో ఆదివారం మెక్సికో సైన్యం చేతిలో హతమయ్యాడు. అమెరికాకు, మెక్సికోకు అతను ‘మోస్ట్ వాంటెడ్క్రి మినల్ అతన్ని పట్టుకుంటే 136 కోట్ల నజరానా ఉంది. కానీ అతని ప్రియురాలి వద్ద ఉన్న అతన్ని మెక్సికో పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. ప్రముఖ డ్రగ్స్ ముఠానేత నెమెసియో ఒసెగువేరా సర్వెంటెస్ ఎలియాస్ ఎల్మెంచోను చుట్టుముట్టారు. ఈ సందర్భం లో మెక్సికో అనుచరులు దాడులకు దిగి, 25మంది నేషనల్ గార్డ్ సభ్యులను హత్యచేశారు. మెంచోను అతని స్వరాష్ట్రం హలిస్కోలో ని తపాల్పాలో మెక్సికో సైన్యం ఆదివారం నాడు భారీ ఆపరేషన్ చేపట్టి అదుపులోకి తీసుకుంది. ఆ సమయంలో అతడి అనుచరులు కాల్పులు జరుపగా సైన్యం ఎదురు కాల్పులకు దిగింది. దాదాపు 62 మంది డ్రగ్స్ ముఠా సభ్యులు హతమ య్యారు. అతను అంతర్జాతీయ నేరస్తుడైనా, పలు డ్రగ్స్ కేసుల్లో నిందితుడైనా మెక్సికోలోని పలు పట్టణాల్లో అతని అనుచరులు చేపట్టిన హింసాత్మకదాడులు కారణంగా మెక్సికో అట్టుడికిపోయింది. ఇలాంటి నేర స్తునికి కూడా ఇంత పెద్ద విస్తృత అనుచర వర్గం ఉం దంటే విశేషమే. ఎల్మెంచోను కుట్టుకోవడంలో మెక్సికో సైన్యానికి తాము కూడా నిఘా సహాయ హస్తమందించి నందునే మెక్సికో ఆపరేషన్ సాధ్యమైందని అమెరికా గర్వంగా ప్రకటించింది.
Read Also : Central Govt: ఈ నెల 28 నాటికి KYC తప్పనిసరి
ఒక నేరస్తునికి అందున మాదక ద్రవ్య వ్యాపారికి ఇంత పెద్ద ఎత్తున నెట్వర్క్ ఉంటుం దని నమ్మలేం. వ్యాపారానికి నెట్వర్క్ సహజమే. కానీ అతని హత్యను జీర్ణించుకోలేక తిరుగబడే భక్తులుంటారా! అనే భావన కలుగుతోంది. అతడి అనుచరులు వాహనా లను తగలబెట్టి విధ్వంసకాండకు శ్రీకారం చుట్టారు. ఆపై అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని భారత్ సహా పలు దేశాలు మెక్సికోలో ఉన్న తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేసి అప్రమత్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడ జీవి స్తున్నా తమ దేశ పౌరులు ఇతర ప్రాంతాల్లో ఇబ్బంది పడ్తున్నట్లుగా ఉంటే వారిని కుశలాలడిగి భద్రత కల్పిం చడం బాధ్యతగా తీసుకునే లక్షణం భారతదేశానిది. అందుకే ఎక్కడెక్కడ జీవనోపాధిలో ఉన్నా భారతదేశ స్థులను అప్రమత్తం చేసారు. ఎల్మెంచ్ హతమయ్యాక మెక్సికోలో జరిగిన విధ్వంసకాండ ఇంతా అంతా కాదు. అంటే అతని మాదకద్రవ్య సామ్రాజ్యం ఆ ప్రాంతంలో ఎంతగా వేళ్లూనుకుందో తెలుసుకోవచ్చు. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఇలాంటి ముఠాలున్నా వాటిని మట్టుబెట్టడం ఎంతో ముఖ్యం. కరుడుగట్టిన నేరగాడిగా తయారయ్యేం దుకు ఎల్మెంచోకు ఎన్ని కారణాలున్నా అతనో నేర సామ్రాజ్యానికి అధిపతిగా ఉంది. మాదకద్రవ్య వ్యాపారం లో ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. అదే అతను చేసిన తప్పి దం. మెక్సికో, వెనెజులా వంటిదేశాల్లో ఎంతగా మాదక ద్రవ్య సంస్కృతి పెరిగిపోయిందో ఆ మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రపంచానికి చాటి చెప్పారు. ‘న్యూ జనరేషన్కు కార్టెల్ అనే క్రిమినల్ సంస్థకు మెంచో ‘డాన్’. అలాంటి వారిని ఇంతకాలం ప్రజల్లో ఉంచడమే మెక్సికో చేసిన తప్పిదమయి ఉండొచ్చు. లేదా అక్కడి పాలకులకన్నా మెంచో బలవంతుడై ఉండాలి.
ఏమయినా తోటకూరనాడే మెంచో తోక కట్ చేసి ఉంటే తొండ ముదిరి ఊసరవెళ్లి అయిందన్న చందాన అలా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకుని ఉండేవాడు కాదు. 1980లో ఎల్మెంచో కాలిఫోర్నియాలో హెరాయిన్ సరఫరా చేస్తూ పోలీసులకు దొరికాడు. కొంతకాలం జైలుశిక్ష కూడా అను భవించాడు. తిరిగి మెక్సికోకి వచ్చాక కొన్నాళ్లు పోలీసుగా పనిచేశాడు. ఆపై అన్ని మెళకువలు తెలుసుకున్నాకదాన్ని వదిలిపెట్టి 2009లో తన డ్రగ్ మాఫియా (Drug mafia)కు ప్రాణం పోసాడు. అనూహ్యంగా ఆ ముఠా 2015లో 20 మంది పోలీసుల్ని తలలు నరికి చంపేసింది. అప్పట్నించిమెంచో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాబితాలోకి చేరి పోయాడు. ఎల్మెంచో వద్దనున్న ఆయుధ సంపత్తి అలాంటిలాంటిది కాదు.సాయుధ వాహనాలు, రాకెట్ లాంఛర్లు, భారీ ఎత్తున ఆయుధాలను కూడా మెక్సికో సైన్యం స్వాధీన పరుచుకొంది. అతని ముఠాలో ఉన్న వాళ్లంతా కిరాయి హంతకులుగా పేరుపడిన వారే. తనకు ఎదురు తిరిగిన ప్రభుత్వాధికారుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేవాడు. ఈ ముఠా మెక్సికో సైన్యానికి సవాల్గా మారింది. సైర్యానికి చెంది న హెలికాప్టర్లపైనా దాడి చేసి కూల్చివేసిన ఉదంతాలు న్నాయి. విచిత్రమేమిటంటే మాఫియా (Drug mafia)డాన్ మెంచోను హతం చేసింది తామంటే తామని అమెరికా, మెక్సికో దేశాలు వాదించుకుంటున్నాయి. అతడి నేర సామ్రాజ్యా న్ని పెంచిపోషించిన వారెవరో అందరికీ తెలుసు. గత ఫిబ్రవరిలో అమెరికా మెంచో సంస్థను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. భారత కరెన్సీలో అతనిపై రూ.136 కోట్ల రివార్డు కూడా ఉంది. అమెరికాలో డ్రగ్స్ సర ఫరాలో శిక్ష అనుభవించిన మెంచోను మెక్సికోలో పోలీసు ఉద్యోగం ఇవ్వడమే వారి ఆలోచనారహిత విధానానికి కారణం. అదే అతడిని డానన్ను చేసింది. మెక్సికో ఆపరేషన్లో మెంచోతోపాటు అతని అనుచరులు మరో ఆరుగురు కూడా మరణించారు. మెంచో ప్రధానంగా ఫెంటానిల్, మెథా ఫెటమైన్, కొకైన్లను అక్రమ రవాణా చేస్తుంటాడు. అదీ అమెరికాకు కావడంతో ఆ దేశం కూడా ఇతన్ని నార్కో టెర్రరిస్ట్ గా ప్రకటించి పట్టుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది. చివరకు మెంచోకు చావు తప్పలేదు. అందుకే నేర స్వభావం ఉన్న వారికి ఏ రూపంలోనూ సకహరించకూడదన్న హితవు ఇందులోనే ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: