📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Dragon : బరిలోకి డ్రాగన్?

Author Icon By Sudha
Updated: March 4, 2026 • 3:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా పోసిన ఆజ్యంతో ఇప్పటికే మధ్య ప్రాచ్యం మండిపోతోంది. ఇరాన్ సార్వభౌమ త్వాన్ని కాపాడతామంటూ చైనా (Dragon) ఎప్పుడైతే రంగంలోకి దిగిందో ప్రపంచ దేశాల్లో మూడో ప్రపంచ యుద్ధ ఛాయలు కనపడుతున్నాయి. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో 24 గంటల్లో ఇరాన్పై భీకర దాడుల్ని చేసేందుకు సిద్ధమౌ తున్నట్లు ఆఘమేఘాల మీద ప్రకటించేశారు. తాము ఇరాన్లోని చెత్తను తొలగిస్తాం. నిన్ననే ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధంమరో నాలుగైదు వారాలు తప్పదని ట్రంప్ ముందే హెచ్చరించారు. ఆ వెనువెంటనే యుద్ధ తీవ్రత ఎలా ఉంటుందో కూడా చెప్పనే చెప్పారు. ఎనిమిది అరబ్దేశాలు ఇరాన్ దాడులతో విలవిల్లాడుతున్నాయి. ఇరాన్ అమెరికాతో ‘రాజీ’ చర్చల కోసం ఏవిధంగానూ ప్రయ త్నించడం లేదు. అమెరికా మాత్రం చర్చలకు అవకాశాలు న్నట్లు చెప్పుకోవడంలో లౌక్యం కనపడుతోంది. సౌదీ లోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం ఆరామ్క చమురు రిఫైనరీపై ఇరాన్ దాడి చేయడంతో చమురు సరఫరా ఆగిపోయింది. ఇరాన్ తన హోర్ముజ్ జలసంధిని మూసి వేస్తే ప్రపంచ దేశాలకు అందే చమురు సరఫరా ఆపి వేయగల శక్తివంతమైన దేశమని, ఆ జలసంధి ఇరాన్ ఆధీనంలో ఉన్నందున దానిని మూసివేస్తే దాదాపు 20 దేశాలకు ఆ మార్గం గుండా చమురు నౌకలను పంపడానికి ఆటంకమేర్పడ్తుందని ముందుగానే అంచనా వేశారు. అంతటి సమస్య వస్తుందని తెలిసినా ట్రంప్ ఎంతో దూకుడుగా ఇరాన్పై యుద్ధతంత్రం మొదలెట్టారు. తాజాగా చైనా నోరు విప్పడంతో ఈ యుద్ధం కీలకమైన మలుపు దారిలో ఉన్నట్లు అర్థమౌతోంది. ఒకవేళ ఇరాన్లో రహస్యంగా కొనసాగుతున్న న్యూక్లియర్ రియాక్టర్ఏ మాత్రం లీక్ అయినా, ఇరాన్, పరిసర ప్రాంతాల్లో ఉన్న దేశాలకు కూడా ముప్పు ముంచుకొస్తుందన్న అవగాహన ఇటు ఇరాన్కు అటు అమెరికాకు కూడా అవగాహనఉంది. కానీ ఎందుకో ఇరాన్ కూడా తమ దాడుల తీవ్రత పెంచింది.

Read Also : Israel Lebanon Conflict: బీరూట్‌లో భీకర దాడులు.. 16 గ్రామాలకు ఖాళీ చేయాలని హెచ్చరిక!


Dragon

హోర్ముజ్ జలసంధిలో మార్షల్ ఐలాండ్స్ జెండా తో ప్రయాణిస్తున్న ఎంకెడి వ్యోమ్ చమురు ట్యాంకర్ నౌకపై పలావ్ జెండాతో ప్రయాణిస్తున్న స్కైలెట్చమురు ట్యాకంర్పై డ్రోన్ దాడులు జరిగాయి. బహ్రెయిన్ పోర్టులో ఆగి ఉన్న అమెరికాకు చెందిన స్టెనా ఇంపరేటివ్ చమురు నౌక పైనా డ్రోన్ దాడులు జరిగి మంటలు చెలరేగాయి. ఇరాన్ ప్రతీకార దాడుల్లో ప్రధానంగా అమెరికా తదితర దేశాల చమురు నౌకలు దెబ్బతింటే ఆయా దేశాలు ఇక చమురు దొరికినట్లే. ఇంత క్రితమే గత నెల మూడవ వారంలో హర్మోజ్లో ముందుగానే యుద్ధమేఘాలు అలుముకున్నాయి. ఒకవైపు అమెరికా యుద్ధనౌకల మోహరింపు. మరోవైపు ఇరాన్, రష్యా యుద్ధ నౌకలు సంయుక్త నావికాదళ విన్యాసాల కవ్వింపుతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మింటికెగయడంతో భారత్ దేశంతో సహా ఎన్నో దేశాల్లో నిత్యావసర వస్తువుల ధరలు, పప్పు ధాన్యాలు, నూనెల ధరలపై విపరీతమైన ప్రభావం పడు తోంది. ఇప్పటికే దక్షిణ కొరియా, జపాన్, చైనా స్టాక్ మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. ఈక్విటీ మార్కెట్ లో మదుపరులు ఆసక్తిగా పెట్టుబడులు పెట్టే ఆస్కార మున్న బిఎస్ఇ లిస్టెడ్ కంపెనీలమొత్తం మార్కెట్ విలువ బాగా పడిపోయింది. తాజా పరిస్థితుల రీత్యా యుద్ధ సంకేతాలు విస్తరించి ఆయా దేశాలు ఏదో ఓ పక్కకు చేరిపోవడం ఒక్కటే ప్రత్యామ్నాయంగా ఉన్నందున యుద్ధం మరికొంతకాలం తమ ప్రతాపాలను చూపిస్తుంది. యుద్ధం ఆగినా యుద్ధకాలపు ప్రభావాలు అంతత్వరగా ఉపసంహరణ జరుగదు. ఆ తర్వాత కూడా మార్కెట్లు కోలుకోవడానికి, పెరిగిన ధరలు తగ్గడానికి మరెంతో కాలం పడుతుంది. హోల్సేల్ మార్కెట్లోనే కాదు, రిటైల్ మార్కెట్లో పప్పుధాన్యాలు, చమురు ధరలు బాగా పెరిగి పోవడంతో సామాన్యులకు అందని ద్రాక్షలుగా మారాయి.


Dragon

ఇరాన్ తమ సామీప్య సముద్ర జలాల్లో నిలిపి ఉంచిన అమెరికా యూఎస్ఎస్లిం కన్ విమాన వాహక యుద్ధ నౌకపై కూడా ఇరాన్ దాడి చేసింది. ఇరువైపులా భీకర యుద్ధమే సాగుతోంది. ఎవరూ తగ్గేటట్లు లేరు. నతాంజ్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్, అమెరికా దాడి చేసాయి. ఈ దాడిలో ఏమరుపాటున ఆ అణుకేంద్రం నుంచి వెలువడే అణుధార్మికత ప్రమాదకరమే. అరబ్ దేశాల్లో ఉన్న లక్షలాది భారతీయుల కోసంవారిని స్వస్థలాలకు తరలించడా నికి కేంద్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లతో తొలివిడత కొం దరు స్వదేశం చేరారు. ప్రస్తుతం గగనతల ప్రయాణంపై నిషేధమున్న రీత్యా యుద్ధం ఆగితే తప్ప మిగిలిన వారు ఇండియాకు రాలేరన్నఅనుమానం వ్యక్తమవుతోంది. ప్రస్తుత యుద్ధ ప్రభావితమైన దేశాల్లో దాదాపు కోటిమంది భారతీ యులుంటారని అంచనా. ఇరాన్లో 10వేల మంది భార తీయ విద్యార్థులు, ఇజ్రాయెల్లో 20వేలమంది విద్యా ర్థులు ఉన్నట్లు కేంద్రంవద్ద నమోదైన అంకెల సమాచారం. వీరంతా యుద్ధం ముగిసే వరకూ అక్కడే ఉండిపోవాల్సి వస్తుందన్న భయం వారి కుటుంబ సభ్యుల్లో ఉంది. గత మూడురోజుల్లో 1117 విదేశీ విమాన సర్వీసులరద్దు చేసిం ది. సందట్లో సడేమియా అన్నట్లు ఇరాన్ ను భూకంప తీవ్ర త ‘గెరాష్’ భూకంప కేంద్రంగా చుట్టుముట్టింది.ఎలాగైనా ఇరాన్ను లొంగదీసుకోవాలని అమెరికా అధినేత ట్రంప్ ప్రయత్నిస్తున్న తరుణంలో చైనా (Dragon) ఇరాన్తో చేయికల్పడం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనని సర్వత్తా భయాం దోళనలు వ్యక్తమవుతున్నాయి. కాలమే పరిష్కారం చూసి విశ్వమానక సౌభ్రాతృత్వం దిశగా అడుగులు వేస్తుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

arena battle Breaking News dragon Fantasy latest news mythical creatures Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.