అంతర్జాతీయంగా కృత్రిమ మేధస్సు (AI) దూసుకుపోతోంది. ఈ రంగం ఆ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాల్లో ఆధిపత్యం దిశగా పయనిస్తోంది. ఉద్యోగులు సంవత్సరాల తరబడి చేసే పనిని AI రోజుల వ్యవధిలో చేస్తోంది. దీంతో కంపెనీలు ఐఏ మీద భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ రంగంలో పెట్టుబడులు వెల్లువలా ప్రవహిస్తుండటంతో ఉద్యోగులకు గడ్డు కాలం మొదలయింది. ప్రపంచ వ్యాప్తంగా వేలాది కంపెనీలు లక్షలాది మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. భవిష్యత్తులో కూడా ఏఐ దెబ్బకు లక్షలాది మంది రోడ్డు మీదకు వస్తారని నివేదికలు చెబుతున్నాయి. టాప్ టెక్ కంపెనీలు కూడా ఏఐ స్కిల్స్ నేర్చుకుంటేనే భవిష్యత్ అని ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
Read Also: Gyanesh Kumar: ఎన్నికల సంస్కరణలపై జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం
కృత్రిమ మేధస్సు రంగంలో వేగంగా మార్పులు
తాజాగా ఈ రంగంలో ఏ దేశం ముందు ఉందనే ప్రశ్నకు నిపుణులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) రంగంలో వేగంగా మార్పులు జరుగుతున్న వేళ.. చైనా ఈ పోటీలో ముందంజలో ఉందని Christopher Wood వ్యాఖ్యానించారు. గ్లోబల్ ఈక్విటీ స్ట్రాటజీ హెడ్‌గా ఉన్న ఆయన, మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన BSE Manthan 2026 కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓపెన్-సోర్స్ AI మోడళ్లపై చైనా ఎక్కువగా ఆధారపడటం వల్ల.. అమెరికా కంటే చైనా AI అభివృద్ధికి మరింత అనుకూలంగా మారిందని వివరించారు. క్రిస్టోఫర్ వుడ్ ప్రకారం.. భారత్ ప్రస్తుతం ఒక ప్రత్యేకమైన రివర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రేడ్ మార్గాన్ని అనుసరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా AI రంగంలో పెద్ద టెక్ కంపెనీలు భారీ మూలధనాన్ని వెచ్చిస్తున్న కొద్దీ.. భారత మార్కెట్లు తాత్కాలికంగా ఇతర దేశాలతో పోలిస్తే బలహీనంగా ప్రదర్శించే అవకాశముందని ఆయన హెచ్చరించారు.
రివర్స్ AI ట్రేడ్ అంటే ఏమిటి?
ముఖ్యంగా AI మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెరుగుతున్న సమయంలో.. ఆ పెట్టుబడులు నిజంగా లాభాలను ఇస్తాయా లేదా అన్న ప్రశ్నలు ఈ ఏడాది అమెరికా స్టాక్ మార్కెట్లలో ఉత్పన్నమవుతాయని ఆయన అంచనా వేశారు. అయితే భారతీయ ఐటీ సేవల కంపెనీల భవిష్యత్తుపై పూర్తిగా ప్రతికూల దృక్పథం అవసరం లేదని వుడ్ స్పష్టం చేశారు. మారుతున్న AI పరిసరాలకు ఈ కంపెనీలు ఎంత సమర్థవంతంగా అనుగుణంగా మారతాయనే అంశంపై నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. కొందరు విశ్లేషకులు AI కారణంగా సాంప్రదాయ ఐటీ సేవల లాభదాయకతపై ఒత్తిడి పెరుగుతుందని భావిస్తుండగా, మరికొందరు ఈ మార్పును ఒక అవకాశంగా చూస్తున్నారు. ఈ విషయాన్ని వివరిస్తూ వుడ్ ఒక సరళమైన వివరణ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: