వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్న తర్వాత లాటిన్ అమెరికా దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వెనిజులా ఘటనతో ఆగిపోకుండా.. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను కారణంగా చూపుతూ మెక్సికో, క్యూబా, కొలంబియా వంటి దేశాలను టార్గెట్ చేశారు. మీరు వైఖరి మార్చుకోకపోతే వెనిజులాకు ఎదురైన పరిస్థితే తప్పదని వార్నింగ్ ఇవ్వడంతో భౌగోళిక ఉద్రిక్తలు ఒక్కసారిగా పెరిగాయి. శనివారం ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్.. మెక్సికోపై తీవ్ర ఆరోపణలు చేశారు. మెక్సికోను ప్రస్తుతం అక్కడి అధ్యక్షురాలు క్లౌడియా షీన్ బామ్ పాలించడం లేదని, శక్తివంతమైన డ్రగ్ కార్టెల్స్ దేశాన్ని
నడుపుతున్నాయని వ్యాఖ్యానించారు.
Tensions have risen due to Trump’s warnings to Latin American countries
భవిష్యత్తులో మరింత కఠిన చర్యలకు సంకేతంగా
అమెరికాలోకి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు అక్రమంగా ప్రవేశించడానికి మెక్సికోనే ప్రధాన ద్వారంగా మారిందని.. దీనిని ఇక సహించబోమని ట్రంప్ స్పష్టంగా చెప్పారు. మెక్సికో ఏదో చేయాల్సిందే.. లేకపోతే అమెరికా తానే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించడం, భవిష్యత్తులో మరింత కఠిన చర్యలకు సంకేతంగా భావిస్తున్నారు. క్యూబాపై ఇదే వ్యాఖ్యలు చేసిన ట్రంప్ క్యూబాను ఆయన విఫలమైన రాజ్యంగా అభివర్ణించారు. అయితే. క్యూబా ప్రజల పట్ల తనకు సానుభూతి ఉందని, వారికి సహాయం చేయాలని అమెరికా కోరుకుంటోందని తెలిపారు. క్యూబా నుంచి బలవంతంగా వెళ్లగొట్టబడిన వారికి సాయం చేయాలన్న ఉద్దేశం ఉందని ట్రంప్ చెప్పారు.
ఒకవైపు మానవతా సహాయం మాటలతో, మరోవైపు కఠిన వాచ్చరికలతో ట్రంప్ క్యూబాపై ఒత్తిడి పెంచుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. కొలంబియా విషయానికి వచ్చేసరికి ట్రంప్ ఆరోపణలు మరింత తీవ్రమయ్యాయి. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో కనీసం మూడుభారీ కొకైన్ ఫ్యాక్టరీలకు మద్దతు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్కడ తయారవుతున్న కొకైన్ ను అమెరికాలోకి అక్రమంగా తరలిస్తున్నారని..ఇకపై ఈ పరిస్థితిని ఇక అంగీకరించబోమని ట్రంప్ అన్నారు. కొలంబియా నుంచి వచ్చే డ్రగ్స్ అమెరికా యువతను నాశనం చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
గ్రీన్ లాండ్ కూ తప్పని ట్రంప్ హెచ్చరిక
అలాగే గ్రీన్ లాండ్ దేశానికి కూడా ట్రంప్ హెచ్చరికలు చేశారు. జాతీయ భద్రత కారణాలతో గ్రీన్ లాండ్ అమెరికాకు అవసరమని ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. చైనా, రష్యా జలాంతర్గాములు ఆ ప్రాంతంలో తిరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. అయితే గ్రీన్ లాండ్ డెన్మార్క్ లో భాగం కాగా, అది నాటో మిత్రదేశం. డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెక్, గ్రీన్ లాండ్ వంటి స్వయం ప్రతిపత్తి ప్రాంతాన్ని బెదిరించడం ఆపాలని ట్రంప్ ను కోరుతూ ప్రకటన చేశారు. ఇదే పరిస్థితుల్లో ట్రంప్ ఇరాన్ లో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో ఇదివరకే హెచ్చరించారు. ప్రజలపై హింస కొనసాగితే, అమెరికా నుంచి తీవ్ర ప్రతిచర్య ఎదురవుతుందని హెచ్చరించారు. ఇది మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగే అవకాశాన్ని సూచిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: