కర్ణాటక మంత్రివర్గంలోకి కొత్త రక్తానికి అవకాశం కల్పించాలని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) స్పష్టం చేశారు. పాత తరం నాయకులు ఎప్పటికీ కొనసాగలేరని, పార్టీ భవిష్యత్తు కోసం తాజా ఆలోచనలు అవసరమని పేర్కొన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్న శివకుమార్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు కేబినేట్లో స్థానం కల్పించాలన్న డిమాండ్‌కు మద్దతు తెలిపారు. తన కేబినేట్ సహచరుడు హెచ్‌సీ మహాదేవప్ప చేసిన దళిత ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందిస్తూ, రాష్ట్రంలో నాయకత్వ మార్పు గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని శివకుమార్ తెలిపారు. మహాదేవప్ప చేసిన వ్యాఖ్యలను వినినట్లు చెప్పారు.
Read Also: Indian Elections: ఓటు హక్కుపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
అందుకే దళిత నాయకుడు ముఖ్యమంత్రి కావాలని వ్యాఖ్యలు చేసి ఉంటారని అన్నారు. కానీ తన దగ్గర మాత్రం ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా మంత్రుల వ్యాఖ్యలపై నిశ్శబ్దంగా ఉన్నారన్న విమర్శలపై శివకుమార్ స్పందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలను నియంత్రించాల్సింది ముఖ్యమంత్రే అని తెలిపారు. పార్టీకి సంబంధించిన విషయాలను తాను ఎప్పటికప్పుడు అధిష్ఠానంతో చర్చిస్తూ వస్తున్నానని తెలిపారు. తనను, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను దిల్లీకి పిలిచారనే వార్తలపై స్పందిస్తూ, తనకు ఎలాంటి కాల్స్ రాలేదని స్పష్టం చేశారు. తన శాఖకు సంబంధించిన పనుల కోసం దిల్లీకి వెళ్లాల్సి ఉందని శివకుమార్ తెలిపారు. మంత్రి సతీశ్ జార్ఖిహొళి సీనియరు నాయకుడని, తనతో కలిసి కార్యాధ్యక్షునిగా సేవలు అందించారని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: