బంగ్లాదేశ్ ప్రధాన ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలను విరమించుకుంటూనే భారత్‌ను రెచ్చగొట్టే విధంగా యూనస్ ఖాన్ (Younus Khan) ప్రసంగించారు. తన పాలనలో బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారం, గౌరవాన్ని తిరిగి పొందిందని, ఇకపై ఇతర దేశాల ఆదేశాల ద్వారా ఢాకా నడుచుకోబోదని వ్యాఖ్యానించారు. బంగ్లా ఇకపై లొంగిపోయే దేశం కాదని, ఇతర దేశాల సూచనలు, సలహాలపై ఆధారపడబోదని పేర్కొన్నారు. సోమవారం వీడ్కోలు సందర్భంగా జాతికి ఉద్దేశించి చేసిన టెలివిజన్ ప్రసంగంలో యూనస్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
Read Also: Delhi HC- Ilayaraja: హైకోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ
ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా ముందుకు సాగుతోంది
‘నేటి బంగ్లాదేశ్ స్వతంత్ర ప్రయోజనాలను కాపాడగల ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా ముందుకు సాగుతోంది. పార్టీ, మతం, జాతి, లింగ భేదాలు లేకుండా న్యాయం, ప్రజాస్వామ్యం కోసం పోరాటం కొనసాగించాలని నేను పిలుపునిస్తున్నా. ఈ విజ్ఞప్తితో, నేను గొప్ప ఆశావాదంతో వీడ్కోలు పలుకుతున్నా. బంగ్లాదేశ్‌కు తెరిచి ఉన్న సముద్ర మార్గం పెద్ద వ్యూహాత్మక ఆస్తి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ద్వారం. కనెక్టివిటీ భవిష్యత్ అభివృద్ధికి కేంద్రబిందువు. అలాగే ప్రాంతీయ సహకారం కింద నేపాల్, భూటాన్, భారత ఈశాన్య ప్రాంతం తో బలమైన సంబంధాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది’ అని యూనస్ తెలిపారు. తన పాలనలో దాదాపు 130 కొత్త చట్టాలు రూపొందించినట్లు యూనస్ తెలిపారు. పలు చట్టాల్లో సవరణలు చేసినట్లు చెప్పారు. అలాగే 600 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారని, అందులో 84శాతం అమలు చేసినట్లు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: