Delhi Liquor: మద్యం పాలసీ కేసు కొట్టివేత..కేజ్రీవాల్‌ కన్నీటిపర్యంతం

Read Time:  1 min
మద్యం పాలసీ కేసు కొట్టివేత..కేజ్రీవాల్‌ కన్నీటిపర్యంతం
మద్యం పాలసీ కేసు కొట్టివేత..కేజ్రీవాల్‌ కన్నీటిపర్యంతం
FONT SIZE
GET APP

దేశ రాజధానిలో ఆప్‌ పతనానికి కారణమైన మద్యం విధాన రూపకల్పనలో అవినీతి హై-ప్రొఫైల్ కేసును దిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా కేజ్రీవాల్‌ (Kejriwal) ను కేసులో ఇరికించారని సీబీఐపై కోర్టు తీవ్రంగా మండిపడింది. ఎక్సైజ్ పాలసీలో ఎలాంటి కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశ్యం లేదని న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కల్వకుంట్ల కవిత సహా 23 మందికి విముక్తి కల్పిస్తూ తీర్పు ఇచ్చింది. వారిపై చర్యలు తీసుకోవడానికి తగిన సాక్ష్యాలను సమర్పించడంలో CBI విఫలమైందని పేర్కొంది. నిందితులపై ప్రాథమిక కేసులు నమోదు చేయలేదని, సీబీఐ ఛార్జిషీట్‌లో అనేక లోపాలు ఉన్నాయని న్యాయమూర్తి అన్నారు. ఏ సాక్షి, వాంగ్మూలంతో చార్జ్‌షీట్‌లోని అభియోగాలు సరిపోవడం లేదని పేర్కొన్నారు. దిల్లీ మద్యం విధాన రూపకల్పన కేసులో “సౌత్ గ్రూప్” అనే పదాన్ని ఉపయోగించడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది. అలాంటి వ్యక్తీకరణకు స్పష్టత, సరైన ఆధారాలు లేవని తెలిపింది.

Read Also: Livestock wealth: పశు సంపద పెంచితేనే.. స్వచ్ఛమైన పాలు

  Liquor policy case dismissed..Kejriwal in tears
Liquor policy case dismissed..Kejriwal in tears

అవినీతికి వ్యతిరేకంగా పోరాడినవాళ్లం మేం: కేజ్రీవాల్

కోర్టు తీర్పు అనంతరం ఆవరణలో మీడియా ముందు మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు కేజ్రీవాల్‌. “ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఐదుగురు నేతలను జైలులో పెట్టారు. సీఎం, డిప్యూటీ సీఎం సహా ఐదుగురిని జైలులో పెట్టారు. కేజ్రీవాల్‌ ఏనాడూ అవినీతికి పాల్పడలేదు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడినవాళ్లం మేం. ప్రధాని మోదీ కేవలం విపక్షాలపైనే దృష్టి పెట్టారు. ప్రజల సమస్యలను ప్రధాని మోదీ ఏమాత్రం పట్టించుకోరు. నిరుద్యోగం, దిల్లీలో పొల్యూషన్ గురించి మోదీ మాట్లాడరు. విపక్ష నేతలను రాజకీయంగా వేధించడం గురించి మోదీ ఆలోచిస్తారు” అని ఆరోపించారు. తాను, మనీశ్ సిసోదియా ఇద్దరూ నిజాయితీపరులు అని కోర్టు చెప్పిందని ఆయన అన్నారు.
“నేను అవినీతిపరుడిని కాదు. కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా నిజాయితీపరులని కోర్టు చెప్పింది. నేడు ఈ కేసులోని నిందితులందరినీ కోర్టు విడుదల చేసింది. నిజం గెలుస్తుందని మేం ఎప్పుడూ చెబుతుంటాం. భారత న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.