పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతుండగా, ఆ దేశ మాజీ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని హతమార్చే లక్ష్యాన్ని గత ఏడాది నవంబర్‌లోనే నిర్ణయించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ (Israeli Defense Minister Israel Katz) వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో కలిసి జరిగిన అత్యంత రహస్య భద్రతా సమావేశంలో ఆ లక్ష్యాన్ని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. మొదట ఆ ఆపరేషన్‌ను 2026 మధ్యలో అమలు చేయాలని భావించినప్పటికీ, ఇరాన్‌లో నెలకొన్న అంతర్గత అస్థిరత కారణంగా దాడి సమయాన్ని ముందుకు జరిపినట్లు తెలిపారు. జెరూసలేం పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ వ్యూహాన్ని అమెరికాతో కూడా పంచుకున్నట్లు కాట్జ్ తెలిపారు. ఇరాన్‌లో మతపెద్దల పాలనపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వారు ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యాలపై దాడులకు దిగే అవకాశముందని భావించి ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
Read Also: Iran War: పశ్చిమాసియా ఉద్రిక్తతలు..మోదీ మౌనంపై రాహుల్ గాంధీ ఫైర్
టెహ్రాన్ సహా పలు ప్రాంతాల్లో ఉన్న భద్రతా మౌలిక సదుపాయాలపై బాంబుల వర్షం
ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రోరింగ్ లయన్, ఎపిక్ ఫ్యూరీ ప్రారంభ దశలోనే ఈ లక్ష్యాన్ని అమలు చేసినట్లు సమాచారం. ఒక సార్వభౌమ దేశ అత్యున్నత నాయకుడిని వైమానిక దాడి ద్వారా హతమార్చడం ఇదే మొదటిసారి అని అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం ఈ చర్యను సమర్థించుకుంటోంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం, అణు కార్యక్రమం తమ దేశానికి అస్తిత్వ ముప్పుగా మారిందని చెబుతోంది. అందుకే ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా బలహీనపరచడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంది. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ టెహ్రాన్‌లో దాడులను మరింత ముమ్మరం చేశాయి. తాజాగా 12వ దశ వైమానిక దాడులను పూర్తి చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. టెహ్రాన్ సహా పలు ప్రాంతాల్లో ఉన్న కీలక సైనిక, భద్రతా మౌలిక సదుపాయాలపై బాంబుల వర్షం కురిపించినట్లు తెలిపింది. అల్‌బోర్జ్ ప్రావిన్స్‌లో ఉన్న ప్రత్యేక భద్రతా దళాల ప్రధాన కార్యాలయం ప్రధాన లక్ష్యంగా దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ వైమానిక దళం వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: