📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Cooking gas: వంటింటికి ‘వార్’ దెబ్బ!

Author Icon By Sudha
Updated: March 12, 2026 • 3:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వంటింటిపై పడింది. యుద్ధ ప్రభావ తీవ్రత పరాకాష్టకు చేరింది. దేశవ్యాప్తంగా వంట గ్యాసు తీవ్ర కొరత ఏర్పడింది. రెండు రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర పెంచింది. ఒకపక్క కూడా యిల్ బ్యారెల్ ధర పెరిగి అన్ని చమురు ఉత్పత్తుల ధరలు పెరిగాయి. రవాణారంగంపై పెట్రోలు, డీసెల్ ధరల తాకిడి వలన ఆటోలు, టాక్సీలు, రవాణా వాహ నాలన్నిటిపై ఛార్జీలు పెంచేశారు. అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ 120 డాలర్లు ఉంటే ఇరాన్ ఆధీనంలోని హర్మూజ్ జలసంధి మూసివేయడంలో అక్కడే ఆగివున్న నౌకలు తిరుగుముఖం పట్టాయి. ఇరాన్ చమురు కేంద్రా లపై ఇజ్రాయెల్ విరుచుకుపడడం వల్ల కూడా చమురు ధరలకు రెక్కలొచ్చాయి. తమపై దాడులు ఇలాగే కొన సాగితే బ్యారెల్ చమురును 200 డాలర్లకు పెంచేస్తామని ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇప్పటికే గల్ఫ్ దేశాలకు హెచ్చరిక జారీ చేసింది. కేవలం చమురు రంగమే కాదు చమురు వినియోగంపై ఆధార పడి ఉన్న అని పరిశ్రమలపై యుద్ధ ప్రభావం పడింది. వైరి యుద్ధాల (War)పక్షాల సవాళ్ల పరిస్థితి ఏమోగానీ ఇప్పటికీ మానవ సమాజఅవసరాలు స్తంభించిపోయాయి. భారత దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మీద, సాధారణ గృహావసరాల మీద పెద్ద దెబ్బే పడింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ (War)సమయంలో కూడా న్యూస్ ప్రింట్, తదితర ఉత్పత్తుల మీద కాస్తంత భారం పడినా అది కేవలం ఆ రంగానికే పరిమితమైంది. అప్పట్లో గృహవినియోగ వస్తు వుల మీద చెప్పుకోదగిన ప్రభావం ఏమీలేదు కనుక సామాన్యులు బతికిపోయారు. ఈసారలా కాదు. అమెరికా దూరాలోచన లేని దురాలోచన వల్ల యుద్ధసన్నద్ధత, లేకుండానే ఇరాన్ మీద విరుచుకుపడిన ప్రయత్నం బెడిసికొట్టింది. యుద్ధంలో విజేతలెవరు, పరాజితులెవరో తేలేముందరే సామాన్య ప్రజానీకాన్ని చావుదెబ్బ కొట్టారు.

Read Also : Cylinder QR Code: ఇకపై ప్రతి సిలిండర్‌కు QR కోడ్.. ఆ వివరాలన్నీ మీ ఫోన్లోనే!

Cooking gas

వంటగ్యాస్ తయారీ పరిశ్రమ కుదేలవడంతో గతంలో సిలిండర్ బుకింగ్ వ్యవధి 21 రోజులుండగా తాజాగా 25 రోజులకి పెంచారు. దేశంలో పెట్రోల్, డిజిల్ ధరలు అప్రకటితంగా పెరిగాయి. ఇప్పట్లో వాటి ధరలను పెంచ బోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్కెట్లో ఒడుదొడుకులు కారణంగా పరోక్షంగా చెల్లింపులు పెరగ వనే గ్యారెంటీ ఏమిలేదు. వినియోగదారులు ఇలాంటి భారాన్నుంచి తప్పించుకోలేడు. ఇప్పటికే పప్పుదినుసులు, నూనెగింజలు, వంట నూనెలధరలు పెరగడంతో వంటి ళ్లన్నీ ఖాళీ అయిపోయాయి. ఫిబ్రవరి 28న యుద్ధఛాయలు కమ్ముకోగానే ఇరాన్, హర్మూన్ల బంధం తెలిసిన కార్పొరేట్ వ్యాపారులు వారి మాల్స్లో ధరలను దాచేయడం, లేదా ఆయిల్ తదితర సరుకుల్లేవని బోర్డులు పెట్టేశారు. వాటిని వెలికి తీసి అమ్మించడంలో ప్రభుత్వం తక్షణ చర్యల్ని చేపట్టడానికి ఆలస్యమైంది. నెల జీతాలు చేతికందేసరికి నిత్యావసర వస్తువుల రేట్లుబాగా పెరిగాయి. ‘నో స్టాక్ బోర్డులతో కృత్రిమ కొరత మార్కెట్లో తాండ విస్తోంది. హోల్సేల్ మార్కెట్లకు కూడా ఎలాంటి మిన హాయింపు లేదు. ఎల్పీజిస్టాక్ లేక గ్యాస్ కంపెనీలు చేతు లెత్తేసే పరిస్థితి కనుచూపు మేరలో కనపడుతోంది. ఇప్ప టికీ బొంబయి, బెంగళూరు, కోల్కతా, చెన్నైవంటి ప్రధాన నగరాల్లో కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ల సరఫరా నిలిచి పోయింది. కొన్ని హోటళ్లను తినుబండారాలు ప్రస్తుత ధరలకు అందించలేక మూతబడ్డాయి. ప్రభుత్వ తొలి ప్రాధాన్యత ఎలిజి సిలెండర్లకిచ్చారు. ప్రస్తుతం ఉన్న స్టాక్ అయిపోతే గృహ వినియోగదారుల పరిస్థితి ఇంకా టమే. ఖతార్ నుంచి ఎల్ఎన్ఆ సరఫరా ఆగిపోవడంలో భారతదేశ గృహ వినియోగంపై పెద్ద దెబ్బ తగిలింది. దాదాపు 88శాతం దేశీయ ఇంధన అవసరాలు గల్ఫ్ దేశా ల మీదనే ఆధారపడ్డాయి. మరో ప్రత్యామ్నాయమేదీ కనపడదు.

Cooking gas

దేశంలోని ముడిచమురు, పెట్రోలియం, ఉత్ప త్తులు ఆరువారాల వరకు వస్తాయని కేంద్రమే ప్రకటిం చింది. కేంద్రం వాణిజ్య సిలిండర్లపై తీసుకున్న నిర్ణయంతో చిన్నమధ్యతరగతి రెస్టారెంట్లు, మెస్లు, టిఫిన్ సెంట ర్లకు గ్యాస్ బండల కొరత ఏర్పడింది. పెద్దపెద్ద నగరాల్లో 25 శాతం హోటళ్లు మూసేసిన వాటిలో ఉంటాయని అం చనా. డొమెస్టిక్ సిలెండర్లకు కొరత నానీకుండా చూడగల మని ప్రభుత్వం ఎంతో ధీమాలో ఉంది. సహజవాయువు దేశీయంగా కొంత తయారవుతుంది. వాటి సరఫరాకు ప్రభుత్వం రేషన్పెట్టింది. ప్రభుత్వ ఆదేశాలమేరకు చమురు శుద్ధికర్మాగారాలు ఎల్పీజీ ఉత్పత్తిని 10శాతం పెంచా యి. గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా కృత్రిమ కొరత సృష్టించే వారిపై అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని (ఎస్మా) అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కార్పొ రేట్ కల్చర్ ఉన్నప్రధాన నగరాల్లో హాస్టళ్లు గ్యాస్ సిలిం డర్ల సమస్యను ఎదుర్కొంటున్నాయి. విద్యార్థులకు పూర్తి స్థాయి ఆహార పదార్థాలను అందించలేక విలవిల్లాడుతు న్నాయి. దేశంలో రూ.6.6 లక్షల కోట్ల విలువైన హోటల్ పరిశ్రమపై, వంటగ్యాస్ కొరత వలన పరోక్షంగా ఆ రంగానికి చెందిన ఉద్యోగులు ఉపాధి కోల్పోతారని రెస్టారెంట్ల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. మనదేశంలో 3.1 కోట్ల టన్నుల ఎలెజి అవసరముంది. ఇందులో 87 శాతం గృహోపయోగం కోసమే. మిగిలిన వాణిజ్య గ్యాస్ అవసరాలపై కేంద్రం నిషేధం పెట్టడంతో ఆతిధ్యరంగం మూలన పడింది. ఆ అవసరాలపై కోత పెట్టకుండా ఉంటే బాగుండేది. యుద్ధం ఆగినా ఆగకున్నా వంటింటి సెగ ఇప్పట్లో ఆరిపోయేది, ఆగి పోయేది కాదు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News Cooking Gas household expenses India LPG prices kitchen budget latest news LPG price hike Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.