📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Comprehensive education : సమగ్ర విద్యతోనే సమసమాజ నిర్మాణం!

Author Icon By Sudha
Updated: March 4, 2026 • 3:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విద్య అనేది మనిషి జీవితాన్ని మార్చే జ్ఞాన ప్రక్రియ. అది కేవలం పాఠశాలల్లో, కళాశాలలో పుస్తకాలు చద వడం మాత్రమే కాదు, మనస్సును, ఆలోచనలను, ప్రవర్తనను, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే అతి పెద్ద జీవన పద్ధతి. విద్య అనేది మనిషిని లోపల నుంచి మార్చే మహోన్నత మార్గం. నైపుణ్యంతో ముందుకు నడిపిస్తుంది, నీతి విలువలతో సరైన మార్గం చూపిస్తుంది. నవచైతన్యంతో ప్రపంచాన్ని మార్చే ధైర్యం ఇస్తుంది. ఈ మూడు లక్షణాలు కలిసినప్పుడే వ్యక్తి సంపూర్ణంగా ఎదుగుతాడు. సమాజం అభివృద్ధి చెందుతుం ది, దేశం ముందుకు సాగుతుంది. విద్య అనేది వ్యక్తి వ్యక్తి త్వాన్ని తీర్చిదిద్దే శక్తివంతమైన సాధనం. ఇది కేవలం పుస్త కాల జ్ఞానం లేదా పరీక్షల మార్కుల వరకే పరిమితంకాదు. నిజమైన విద్య అంటే మనిషి ఆలోచనా విధానాన్ని మార్చే శక్తి, జీవితాన్ని సార్థకం చేసే మార్గదర్శకం. నేటి వేగవంత మైన ప్రపంచంలో నైపుణ్యాలు, నీతి, నవ చైతన్యం వంటి మూడు ముఖ్యాంశాలు ప్రతి ఒక్కరికి అత్యంత అవసరమైనవి. ఇవన్నీ కలిగినప్పుడు మాత్రమే వ్యక్తి సంపూర్ణ వికాసం సాధ్యమవుతుంది. ఈ పరిపూర్ణతను అందించే మార్గమే సమగ్ర విద్య. నైపుణ్యం ఆధునిక ప్రపంచానికి పునాది, ప్రపంచం మారుతోంది. జ్ఞానం కంటే నైపుణ్యాలే నేటి ఉద్యోగ విపణిలో ముఖ్యం అవుతున్నాయి. కంప్యూటర్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్, సమస్య పరిష్కరణ, నాయకత్వ లక్షణాలు వంటి అనేక నైపుణ్యాలు వ్యక్తిని విజయవంతుడిగా నిలబెట్టే మెట్లు. సాంప్రదాయ విద్యలో నైపుణ్యాల మీద పెద్దగా దృష్టి ఉండలేదు. కానీ పుస్తకాల్ని కంఠస్థం చేసే విద్యతో ఉద్యోగాలు కూడా రాకపో వడం, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం వంటి సమస్యలు ఏర్ప డ్డాయి. కాబట్టే విద్యావ్యవస్థ నైపుణ్యాల పెంపువైపు మళ్లాలి. పాఠశాలస్థాయి నుండే ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం, ప్రయో గాలు, ప్రాక్టికల్ శిక్షణ, డిజిటల్ లిటరసీ వంటి అంశాలను బలపరచాలి. నైపుణ్యం ఉన్న విద్యార్థి ప్రపంచంలో ఎక్కడైనా అవకాశాలను సృష్టించగలడు.

Read Also : Central Government: ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ: కేంద్రం నిర్ణయం

Comprehensive education

నీతి వ్యక్తిత్వ వికాసానికి నిత్యావసరం, నైపుణ్యాలు ఉన్నప్పటికీ విలువలు లేకపోతే వ్యక్తి సమాజానికి హానికరుడు అయిపోతాడు. నీతి అనే విలువ మనిషిని లోపలి నుంచి మార్చుతుంది. నిజాయితీ, దేశభక్తి, బాధ్యతా భారతం, పరస్పర గౌరవం, కరుణ, సేవాభావం ఇవన్నీ నీతి ద్వారా వచ్చే అంశాలు. ప్రస్తుత కాలంలో విలు వలు తగ్గిపోతున్నాయని మనం ప్రతిరోజూ చూస్తున్నాం. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ మానవత్వం తగ్గిపోకుండా చూసుకోవడం కూడా విద్యా వ్యవస్థ బాధ్యతే. విలువల పాఠాలు, కథలు, సమాజ సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన, గురుశిష్య సంబంధాల పట్ల గౌరవం ఇవన్నీ విద్యార్థుల్లో నీతిని పెంపొందించగల అంశాలు. మంచి విలువలతో ఉన్న విద్యార్థి భవిష్యత్తులో మంచి పౌరుడిగా మారతాడు. నవచైతన్యం అభివృద్ధికి కొత్తదారి, భవిష్యత్తు నవ చైతన్యాన్ని కోరుతోంది. కొత్త ఆలోచనలు, కొత్త ప్రయోగాలు, కొత్త పరిష్కారాలే ప్రపంచాన్ని ముందు కు నడిపిస్తున్నాయి. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనను\ప్రోత్సహించడం అనేది సమగ్ర విద్యలో(Comprehensive education) కీలక అంశం. కేవ లం పాఠాలు నేర్పించడం సరిపోదు. ఆ పాఠాలపై సందేహా లు అడగడం, కొత్త ప్రయోగాలు చేయడం, వైఫల్యం భయ పడకుండా ముందుకు సాగడంవంటి ధైర్యం విద్యార్థికి ఉం డాలి. ల్యాబ్లు, ఇన్నోవేషన్ క్లబ్లు, సైన్స్ ఫెయిర్లు, స్టార్టప్ ఆలోచనలకు ప్రోత్సాహం ఇవన్నీ నవ చైతన్యాన్ని పెంపొం దించే మార్గాలు. నవ చైతన్యంతో ఉన్న విద్యార్థి ఉద్యోగం కోసం వెతకడు, ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం కలిగి ఉంటాడు. సాంకేతిక రంగం నుంచి వ్యవసాయం వరకు ప్రతిచోటా ఈ సృజనాత్మక ఆలోచనకు అవసరం పెరిగింది. సమగ్ర విద్య (Comprehensive education)అనేది విద్యార్థిని ఒకేకోణంలో కాకుండాపలు కోణాలలో ఎదగనిచ్చే ప్రక్రియ. అందులో విద్యా జ్ఞానం, సృజనాత్మకత, నైతికత, సామాజిక బాధ్యత, శారీరక ఆరో గ్యం, భావోద్వేగ పరిపక్వత అన్నీ సమపాళ్లలో ఉండాలి. పుస్తకాల జ్ఞానంతోపాటు జీవితానికి అవసరమైన విలువల ను నేర్పడం, నైపుణ్యాలను పెంపొందించడం, సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించే ఆలోచనను పోషించడం ఇవన్నీ సమగ్ర విద్యా లక్ష్యాలు. సమాజంలో మార్పులు వేగంగా జరుగుతున్న

ఈ యుగంలో సమగ్ర విద్య అనేది చాలా కీలకం. ఎందుకంటే ఇది వ్యక్తిని జ్ఞానం కలిగినవాడిగా, నైపుణ్యం ఉన్నవాడిగా, విలువలు పాటించే పౌరుడిగా, సృజనాత్మక ఆలోచకుడిగామారుస్తుంది. దేశ అభివృద్ధికి ఇలాంటి పౌరులే అవసరం. పాఠశాలల నుండి ఉన్నత విద్యా సంస్థల వరకు సమగ్ర విద్యను అమలు చేయడం వల్ల ఆరోగ్యవంతమైన, ఆత్మవిశ్వాసంతో నిండిన, బాధ్యత గల, ఆవిష్కరణాత్మక యువత పెరిగి దేశాన్ని ముందుకు నడిపించగలుగుతుంది. విద్య అనేది వ్యక్తిని మాత్రమే కాకుండా, సమాజాన్ని, దేశాన్ని కూడా మార్చగల మహాశక్తి. నైపుణ్యం, నీతి, నవ చైతన్యం ఈ మూడు అంశాలు ఏ ఒక్కరి జీవితాన్నైనా సార్థకంగామార్చగలవు. కానీ ఇవన్నీ ఒకే చోట పొందాలంటే సమగ్ర విద్య తప్పనిసరి. దేశవ్యా ప్తంగా విద్యావ్యవస్థలో మార్పులు వేగం పుంజుకుంటున్నా యి. నూతన అవసరాలకు అనుగుణంగా పాఠశాలల నుండి ఉన్నత విద్యవరకు సమగ్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అభ్యాసం వంటి అంశాలు ప్రముఖ స్థానం పా దిస్తున్నాయి. విద్యా నిపుణుల అభిప్రాయం ప్రకారం, విద్య అంటే కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, విద్యార్థి వ్యక్తి త్వాన్ని అన్నికోణాల్లో అభివృద్ధి సమగ్ర ప్రక్రియ కావా లని సూచిస్తున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యావిధానాల్లో కూడా ఈ మార్పులు స్పష్టంగాపిస్తున్నాయి. పాఠశాలల్లో కొత్త కార్యక్రమాలు, నైపుణ్య ఆధారిత కోర్సులు, సాంకేతిక పరికరాల వినియోగం పెరగడంతో విద్యార్థుల అభ్యాస పద్ధతుల్లో నీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి.

Comprehensive education

ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, జీవన నైపుణ్యాలు, విలువల విద్య వంటి అంశాలను గతులలోకి తీసుకువస్తూ పాఠ శాలలు విద్యార్థులను భవిష్యత్తు వైపు తీర్చిదిద్దుతున్నాయి. విద్యా నిపుణులు చెబుతున్నదేమిటంటే, నేటితరం ఉద్యోగాలకే కాదు, జీవితానికి సిద్ధం అవ్వాలి. అందుకోసం నైపు ణ్యం, నీతి, సృజనాత్మకత కలిసి నడిచే విద్య అవసరం అని. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనను పెంపొందించే ఆవిష్కరణ క్లబ్లు, ల్యాబ్లు, సైన్స్ ఫెయిర్లు కూడా విద్యా సంస్థల్లో ప్రాధాన్యం పొందుతున్నాయి. డిజిటల్ విద్యాభ్యా సం గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్దఎత్తున విస్తరిస్తుండటం మరో ముఖ్య పరిణామంగా భావిస్తున్నారు. ఆన్లైన్ క్లాసు లు, స్మార్ట్ క్లాస్ట్రూమ్లు, డిజిటల్ లైబ్రరీలు విద్యను మరిం త చేరువ చేస్తున్నాయి. మొత్తం మీద విద్యా రంగంలో జరుగుతున్న ఈ మార్పులు సమీప భవిష్యత్తులో దేశ యువతకు మరింత బలమైన భవిష్యత్తును అందించనున్నాయి. విద్యార్థులు నైపుణ్యవంతులుగా, విలువలను పాటించే పౌరులుగా, కొత్త ఆలోచనలతో ముందుకు సాగేందుకు ఈ సంస్కరణలు మేలుచేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి నేటి తరానికి సరైన విద్య అంటే కేవలం పుస్తకాలు కాదు, మంచి విలువలు, జీవిత నైపుణ్యాలు, సృజనాత్మకత, సమస్య పరిష్కరణ, ఆధునిక జ్ఞానం ఇవన్నీ కలగలిపిన బహుముఖ విద్య సమగ్ర విద్యను ప్రతి విద్యా సంస్థలో అమలు చేసినప్పుడే మన దేశం నిజమైన అర్ధంలో విజ్ఞానభారతంగా వెలుగొందుతుంది.
-సొప్పరి నరేందర్

Read hindi news : hindi.vaartha.com

Epaper :epaper.vaartha.com

Read Also:

Breaking News comprehensive education education for all equal society Inclusive Education latest news social equality Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.