📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Chittoor: “మహిళా వారోత్సవాలు” ఘనంగా నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు.

Author Icon By Rajitha
Updated: March 2, 2026 • 4:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీఎస్.ఆర్.రాజశేఖర్ రాజు నేతృత్వంలో జిల్లా అంతటా “మహిళా దినోత్సవ వారోత్సవాలు” ఘనంగా నిర్వహిస్తున్న జిల్లా పోలీసులు. ఈ కార్యక్రమాలలో భాగంగా చిత్తూరు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు పట్టణంలోని కన్నన్ పాఠశాల, ఎం.సి.హెచ్ పాఠశాలలో మహిళల భద్రత అంశంపై వ్యాసరచన పోటీలు, పెయింటింగ్ పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలికలు మహిళా సాధికారత, సమాన హక్కులు, విద్య ప్రాముఖ్యత వంటి అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

Read also: BR Naidu Video : బీఆర్ నాయుడు రాసలీలలు అంటూ వైసీపీ వీడియో ప్రచారం

Women Safety

అనంతరం విద్యార్థులతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించి మహిళల భద్రతపై ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, “మహిళలు మన సమాజానికి మూలస్తంభాలు. ఒక మహిళ విద్యావంతురాలైతే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందుతుంది. మహిళలపై జరిగే వేధింపులు, హింస, దౌర్జన్యాలు వంటి ఘటనలను అరికట్టడం మన అందరి బాధ్యత. కేవలం పోలీసులు మాత్రమే కాకుండా ప్రతి విద్యార్థి, ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలి” అని తెలిపారు. విద్యార్థులకు మహిళల రక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు చట్టాలు మరియు పథకాల గురించి వివరించారు.

మహిళల భద్రతపై అవగాహన సమావేశం

ముఖ్యంగా బాలికలపై జరిగే నేరాలను కట్టడి చేయడానికి ఉన్న చట్టాలపై అవగాహన కల్పించారు. ఎవరైనా వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని, డయల్ 100, 112 వంటి అత్యవసర నంబర్లను ఉపయోగించాలని సూచించారు. అదేవిధంగా “ధైర్యస్పర్శ” వంటి మహిళల రక్షణ కార్యక్రమాల గురించి కూడా వివరించారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అన్య వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోకూడదని, సైబర్ నేరాల నుండి ఎలా రక్షించుకోవాలో కూడా తెలియజేశారు. “మీ భద్రతకు మీరు బాధ్యత వహించాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అన్యాయం జరిగితే మౌనం పాటించకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలి” అని ప్రోత్సహించారు.

“ఈ రోజు మీరు రాసిన ప్రతి వ్యాసం, వేసిన ప్రతి చిత్రం సమాజానికి ఒక సందేశం. మహిళల గౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి కర్తవ్యం. చిన్నప్పటి నుంచే లింగ సమానత్వంపై అవగాహన పెంపొందితే భవిష్యత్‌లో నేరాలు తగ్గుతాయి” అన్నారు. మార్చి 8వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఈ తరహా కార్యక్రమాలు మహిళలకు శక్తిని, మానసిక స్థైర్యాన్ని, స్వీయరక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి దోహదపడతాయని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. శివశంకర్, కరిమునిస్సా, సిబ్బంది పాల్గొనారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

#telugu News Chittoor News International Womens Day latest news Police awareness Women Empowerment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.