పొరుగుదేశం చైనా టెక్నాలజీ రంగంలో దూసుకుపోతోంది. ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతూ టెక్ రంగాన్ని ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అగ్రరాజ్యం అమెరికాను వెనక్కి నెట్టి ఎలాగైనా నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకునేందుకు పావులో కదుపుతోంది. ఇందులో భాగంగా సరికొత్త ఆవిష్కరణల వైపు తన లక్ష్యాన్ని గురి పెట్టింది. ఇప్పుడు తాజాగా పంచవర్ష ప్రణాళికలో హైటెక్ రంగాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది.
కృత్రిమ మేధస్సు (AI), 6G కమ్యూనికేషన్ టెక్నాలజీ, హ్యూమనాయిడ్ రోబోటిక్స్ వంటి భవిష్యత్ పరిశ్రమలను వేగంగా అభివృద్ధి చేయడమే ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా AI చిప్‌ల తయారీలో పురోగతి, తదుపరి తరం వైర్‌లెస్ నెట్‌వర్క్‌ల అభివృద్ధి, అలాగే రోబోటిక్స్‌కు అవసరమైన ప్రమాణాల ఏర్పాటు ద్వారా ప్రపంచ టెక్నాలజీ రంగంలో చైనా(China) తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేయాలనుకుంటోంది.
Read Also: US: మిత్రదేశాలపై ట్రంప్ టారిఫ్‌లు రద్దు..గ్రీన్‌ల్యాండ్‌పై యూటర్న్
కంప్యూటింగ్ సాంకేతికతలు వంటి కీలక రంగాల్లో పురోగతి
AI పరిశ్రమను వేగంగా ముందుకు నడిపించేందుకు శిక్షణ చిప్‌లు, విభిన్న కంప్యూటింగ్ సాంకేతికతలు వంటి కీలక రంగాల్లో పురోగతిని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MIIT) అధికారులు వెల్లడించారు. సాఫ్ట్‌వేర్, బయోటెక్నాలజీ, కమ్యూనికేషన్స్ రంగాల్లో AIని విస్తృతంగా వాడటం ద్వారా ఉత్పాదకతను పెంచాలని చైనా ప్రభుత్వం యోచిస్తోంది. అదే సమయంలో.. ఆధునిక AI మోడల్స్, ఇంటెలిజెంట్ ఏజెంట్ల అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వడం, స్టార్టప్‌లు, సంస్థల వృద్ధికి మద్దతు అందించడం కూడా ఈ వ్యూహంలో భాగంగా ఉంది. AI పర్యావరణ వ్యవస్థను మరింత బలపరచేందుకు పరిశ్రమ ప్రమాణాలు, ఓపెన్-సోర్స్ కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని MIIT భావిస్తోంది.
స్టార్టప్‌ల నుంచి దిగ్గజ కంపెనీల కొత్త ఆవిష్కరణల కోసం
గత కొన్ని సంవత్సరాలుగా చైనా టెక్నాలజీ రంగం వేగంగా విస్తరిస్తోంది. అమెరికా-చైనా టెక్ పోటీ తీవ్రమవుతున్న నేపథ్యంలో.. స్టార్టప్‌ల నుంచి దిగ్గజ కంపెనీల వరకు అందరూ కొత్త ఆవిష్కరణల కోసం పోటీపడుతున్నారు. ఈ క్రమంలో, స్థానిక ప్రభుత్వాలు కూడా తమ అభివృద్ధి ప్రణాళికల్లో హైటెక్ రంగాలను కీలకంగా గుర్తిస్తున్నాయి. చంద్రుడిపై కూర్చుని మందేద్దామా.. ఓ రాత్రికి రూ. 9 కోట్లు..అదే పుల్లు ట్రిప్ అయితే రూ. 90 కోట్లు.. ఇందులో భాగంగానే హాంగ్‌జౌ నగరం 2030 నాటికి మూడు కంటే ఎక్కువ అంతర్జాతీయ స్థాయి ఓపెన్-సోర్స్ AI ఫౌండేషన్ మోడల్స్‌ను అభివృద్ధి చేయాలని, AI పరిశ్రమ ద్వారా 600 బిలియన్ యువాన్లకు మించి ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇ
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: