📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు

China: శక్స్‌గావ్‌ లోయలో మాదే- చైనా ప్రకటన..ఖండించిన భారత్

Author Icon By Vanipushpa
Updated: January 13, 2026 • 12:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్ముకశ్మీర్​లోని వ్యూహాత్మక ప్రాంతమైన శక్స్‌గావ్‌ లోయ(Shaksgam Valley)పై చైనా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. శక్స్‌గావ్‌ లోయ భూభాగం చైనాకు చెందినదని పేర్కొంది. తమ సొంత భూభాగంలో మౌలిక సదుపాయాల నిర్మాణాలు చేపట్టే హక్కు చైనాకు ఉందని వెల్లడించింది. కాగా, పాక్ ఆక్రమిత కశ్మీర్​లోని శక్స్‌గావ్‌ లోయలో చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (CPEC) ద్వారా జరుగుతున్న మౌలిక సదుపాయాల నిర్మాణాలు చట్టవిరుద్ధం, చెల్లనిదిగా భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. వాటిని తాము గుర్తించలేదని పేర్కొంది. శక్స్‌గావ్‌ లోయ ప్రాంతం భారత్​తో విడదీయలేని భాగమని పేర్కొంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై ప్రాధాన్యం సంతరించుకుంది. “శక్స్‌గావ్‌ లోయ ఉన్న భూభాగం చైనాకు చెందినది. తమ సొంత భూభాగంలో మౌలిక సదుపాయల నిర్మాణం చేసుకునే హక్కు చైనాకు ఉంటుంది.

Read Also: America: క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లపై 10 శాతం పరిమితి: ట్రంప్

China: శక్స్‌గావ్‌ లోయలో మాదే- చైనా ప్రకటన..ఖండించిన భారత్

చైనా వైఖరి మారలేదు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్

చైనా, పాకిస్థాన్ 1960వ దశకంలో ఒక సరిహద్దు ఒప్పందంపై సంతకాలు చేశాయి. రెండు దేశాల మధ్య సరిహద్దులను గుర్తించాయి. ఈ పరిష్కారం రెండు సార్వభౌమ దేశాల హక్కులకు సంబంధించినది. చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (CPEC) అనేది స్థానిక ఆర్థిక, సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి, ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఒక ఆర్థిక సహకార ప్రాజెక్ట్. చైనా, పాక్ మధ్య సరిహద్దు ఒప్పందం, సీపీఈసీ కశ్మీర్ సమస్యపై చైనా వైఖరిని ప్రభావితం చేయవు. ఈ విషయంలో చైనా వైఖరి మారలేదు” అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ స్పష్టం చేశారు.

ఇరుదేశాల మధ్య తీవ్ర దుమారం

జమ్ముకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు పూర్తిగా భారతదేశంలో అంతర్భాగాలని రణధీర్ జైస్వాల్ తెలిపారు. అలాగే అవి దేశంతో విడదీయలేని భాగాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని చైనా, పాకిస్థాన్ అధికారులకు ఇప్పటికే చాలాసార్లు స్పష్టంగా తెలియజేశామని వెల్లడించారు. శక్స్​గావ్‌ లోయలో వాస్తవ పరిస్థితిని మార్చడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలపై తాము నిరంతరం నిరసన తెలియజేస్తున్నామని స్పష్టం చేశారు. తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకునే హక్కు భారత్​కు ఉందని వెల్లడించారు. ఇప్పుడిప్పుడే భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో శక్స్​గావ్‌ వ్యాలీ అంశం మరోసారి ఇరుదేశాల మధ్య తీవ్ర దుమారం రేపుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Border Dispute China territorial claim foreign ministry statement India China Relations Ladakh issue Shaksgam Valley sovereignty dispute Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.