childhood : యుద్ధాలకు బలి అవుతున్న బాల్యం

Read Time:  1 min
childhood
childhood
FONT SIZE
GET APP

ప్ర పంచంలో జరుగుతున్న యుద్ధాలు కేవలం దేశాల మధ్య పోరాటాలు కావు. అవి లక్షలాది బాలల జీవి తాలను, కలలను, భవిష్యత్తును ధ్వంసం చేస్తున్న మానవ విపత్తులు. ఉక్రెయిన్, గాజా, ఇరాన్ వంటి ప్రాంతాల్లో బాంబులు పడుతున్నది కేవలం భవనాలపై కాదు బాలల భవిష్యత్తుపై. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా మొద టగా నశించేది మానవత్వం, ఎక్కువగా నష్టపోయేది బాల్యం.(childhood ) బాంబులు పడుతున్నప్పుడు కూలిపోతున్నది కేవలం భవనా లు కాదు, వేలాది బాలల కలలు, భవిష్యత్తు కూడా. ఉక్రెయిన్, గాజా, ఇరాన్ వంటి ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు లక్షలాది పిల్లలను అనాథలుగా, శరణార్థులుగా మార్చుతున్నాయి. చదువు, ఆరోగ్యం, భద్రత వంటి ప్రాథ మిక హక్కులు కూడా వారికి అందకుండాపోతున్నాయి. బాలలు యుద్ధాలకు కారణం కాకపోయినా, ప్రతి యుద్ధంలో అత్యధికంగా బాధపడుతున్నవారు వారే. అందుకే బాలల (childhood)హక్కులను కాపాడటం అంటే యుద్ధాలను ఆపడం శాంతిని కాపాడటం. ప్రపంచంలో ఎక్కువ యుద్ధాలు ప్రధా నంగా నాలుగు ప్రయోజనాల కోసం జరుగుతున్నాయి. మొదటిది రాజకీయ అధికారం. కొంతమంది నాయకులు విదేశీ శత్రువు” అనే భయాన్ని సృష్టించితీయతను రెచ్చగొట్టి తమ అధికారాన్ని బలపరుచుకుంటారు. రెండవది ఆయుధ వ్యాపారం. ఆయుధ తయారీ సంస్థలు ప్రపంచం లో అతి పెద్ద లాభాలను పొందే రంగాల్లో ఒకటి. యుద్ధం మొదలైతే కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతుంది. మూడవది సహజ వనరులపై ఆధిపత్యం. చమురు, గ్యాస్, ఖనిజాలు, నీరు వంటి వనరుల కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. నాలుగవది మతం లేదా జాతీయత. ఇవి చాలాసార్లు నిజ మైనకారణాలు కాకుండా ప్రజలను యుద్ధానికి ప్రేరేపించే ఒక ముసుగుగా ఉపయోగపడతాయి. ఈ నాలుగు కారణాల్లో ఒక్కటి కూడా సాధారణ ప్రజల ప్రయోజనం కోసం కాదు. లాభం కొద్దిమందికి, నష్టం కోట్లాది మందికి. ఆధునిక యుద్ధాల్లో మరణించే వారిలో ఎక్కువ మంది సైని కులు కాదు, సాధారణ ప్రజలు. అందులో పెద్దభాగం బాలలే.

Read Also : Indians Arrested in UAE: యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

childhood
childhood

అంతర్జాతీయ సంస్థల నివేదికల ప్రకారం ఆధునిక యుద్ధాల్లో సుమారు 90 శాతం మరణాలు సాధారణ ప్రజలవే. బాలలను కోల్పోతే మనం మన భవిష్యత్తును కోల్పోతున్నాం. బాలల రక్తం ఎవరి లాభానికైనా ఖర్చు చేయడం మానవ త్వానికే మచ్చ. బాలలు యుద్ధాలకు కారణం కాదు, కానీ ప్రతి యుద్దంలో పెద్ద బాధితులు వారే. ఉక్రెయిన్ యుద్ధం జీవితాలపై ప్రభావం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగేళ్లుగా కొనసాగుతోంది. దీని ప్రభావం లక్షలాది కుటుంబాలపై పడింది. నివేదికల ప్రకారం 2022 నుంచి కనీసం 3200 మంది బాలలు చనిపోయారు లేదా గాయ పడ్డారు. 2025లో మాత్రమే 92మంది బాలలు మరణిం చగా, 652 మంది గాయపడ్డారు. దేశంలోని మూడింట ఒక వంతు బాలలు మానసిక గాయాలకు గురయ్యారు. పాఠశాలలు ధ్వంసం కావడం, విద్యుత్ సౌకర్యాలపై దాడులు జరగడం వల్ల పిల్లలు చదువు, ఆరోగ్య సేవలు కోల్పోతున్నారు. చాలామంది శరణార్థులుగా మారిపోయా రు. 2023 అక్టోబర్ నుంచి కొనసాగుతున్న గాజా యుద్ధం బాలలపై అత్యంత దారుణ ప్రభావం చూపింది. నివేదికల ప్రకారం 21 వేలకుపైగా బాలలు చనిపోయారు. 44 వేలకు పైగా బాలలు గాయపడ్డారు. వారిలో వేలాది మంది శాశ్వత వికలాంగులయ్యారు. 56వేలకుపైగా బాలలు తమ తల్లిదం డ్రులను కోల్పోయారు. పాఠశాలలు, ఆసుపత్రులు ధ్వంసమ య్యాయి. ఆహారం లేక వేలాది బాలలు ఆకలి చావు అంచున ఉన్నారు. ఈ యుద్ధం వేలాది బాలలను అనాథ లుగా, భయంతో జీవించేలా చేసింది. ప్రతి బాంబు వెనుక ఒక బాలుడి/బాలిక కల చనిపోతున్నది” ఫిబ్రవరి 2026 లో ప్రారంభమైన ఇరాన్ యుద్ధం కూడా బాలలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రారంభ దాడుల్లోనే 180 నుండి 200 మంది బాలలు మరణించినట్లు నివేదికలు చెబుతున్నా యి.

childhood
childhood

ఒక పాఠశాలపై జరిగిన దాడిలో 168మంది బాలికలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పలుపాఠశాలలు, ఆసు పత్రులు ధ్వంసమయ్యాయి. విద్య, ఆరోగ్య సేవలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రపంచ సంఘర్షణల్లో బాలలపై ఆరుప్రధాన ఉల్లంఘనలు జరుగుతున్నాయి. బాలలను చంపడం లేదా గాయపరచడం, బాలలను సైనికులుగా ఉపయోగించడం, పాఠశాలలు, ఆసుపత్రులపై దాడులు, లైంగిక హింస, బాలల అపహరణ, మానవతా సహాయాన్ని నిరాకరించడం. ఇవి అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంఅయి నప్పటికీ యుద్ధాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచంలో కోట్లాది బాలలు యుద్ధ ప్రభావంలో జీవిస్తున్నారు. నివేదికల ప్రకారం ప్రపం చవ్యాప్తంగా 47.3 కోట్ల బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో జీవిస్తున్నారు. ప్రతిరోజు సగటున 23 మంది బాలలుబాంబు దాడుల్లో గాయపడుతున్నారు లేదా చనిపోతున్నారు. పాఠశా లలపై దాడులు గణనీయంగా పెరిగాయి. లక్షలాది బాలలు స్కూల్కు వెళ్లలేకపోతున్నారు. కోట్లాది బాలలు శరణార్థులు గా మారిపోయారు. యుద్ధం వారి జీవితాలను శాశ్వతంగా మార్చేస్తోంది. యుద్ధాలు దేశాలను గెలిపించవచ్చు, కానీ బాల్యాన్ని ఎప్పుడూ ఓడిస్తాయి. యుద్ధం ఎప్పుడూ సమస్య కు పరిష్కారం కాదు. దేశాలు సంభాషణలు, చర్చలు, డిప్ల మసీకి ప్రాధాన్యం ఇవ్వాలి. అంతర్జాతీయ చట్టాలను చేయాలి. ఆయుధ వ్యాపారంపై నియంత్రణఉండాలి. నాయకులు జవాబుదారీతనం పెరగాలి. ప్రజలు కూడా యు ద్ధాలకువ్యతిరేకంగా శాంతికోసం గొంతుఎత్తాలి. బాలలు యు ద్ధాలకు కారణం కాదు. కానీవారు అత్యధిక బాధితులు. అందు వల్ల వారిని ‘బలి’గా కాదు, శాంతి దూతలు’గా చూడాలి.
-డా. కె. రమాప్రభ

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.