📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Digital attacks : మితిమీరుతున్న ‘డిజిటల్ దాడులు..

Author Icon By Sudha
Updated: March 16, 2026 • 5:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డి జిటల్ విప్లవం మానవ జీవనశైలిని సమూలంగా మార్చేసింది. ప్రపంచాన్ని ఒక గ్లోబల్ విలేజ్ గా మార్చిన సోషల్ మీడియా, భావప్రకటనా స్వేచ్ఛకు ఒక గొప్ప వేదికగా నిలిచింది. కానీ, దురదృష్టవశాత్తూ అదే వేదిక నేడు అరాచకానికి, అశ్లీలతకు, వ్యక్తిత్వ హననానికి చిరునామాగా మారుతోంది. ఒకప్పుడు సమాచార వారధిగా వెలిగిన సామా జిక మాధ్యమాలు, నేడు వేధింపుల వలయంగా మారి సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరినీ భయాం దోళనకు గురిచేస్తున్నాయి. ట్రోలింగ్ అనేది సోషల్ మీడి యాలో ఇప్పుడు అసాధారణ సమస్యేకాదు, ఇది వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసే సామాజిక వ్యాధిగా మారుతోంది. ఎవ రైనా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే చాలు. వెంటనే దాడులు మొదలవుతున్నాయి. ఫొటోలను మార్ఫింగ్ చేయ డం, అసత్య కథనాలు ప్రచారం చేయడం, సెక్సోర్షన్ బెది రింపులు చేయడం, ఏఐ సాయంతో తప్పుడు వీడియోలు తయారు చేసి ప్రచారం చేయడం వంటి పద్ధతులు పెరుగు
తున్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం సోషల్ మీడియా లో ఉన్న ప్రతి 8 మంది మహిళల్లో ఒకరు ఇలాంటి అశ్లీల బెదిరింపులకు గురవుతున్నారు. ప్రముఖనటి ఇటీవల కాలం లో సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం పై తీవ్రంగా స్పందించడం ఈ సమస్య తీవ్రతను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. తాను మాట్లాడని మాటలను తన పేరుతో ప్రచారం చేయడం, పాత వ్యక్తిగత సంభాష ణలను వక్రీకరించి ప్రచారం చేయడం వంటి చర్యలు తన వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాన్ని వెంటనే తొలగించాలని హెచ్చరిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పషం చేశారు. ఇది కేవలం ఒక సెలబ్రిటీ సమస్య కాదు, సోషల్ మీడియా వేదికలో ఎవరైనా లక్ష్యంగా మారవచ్చని చెప్పడానికి ఈ ఘటన ఉదాహరణ. ఒకప్పుడు విమర్శ అంటే ఆరోగ్యకరంగా ఉండేది. కానీ, నేడు సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రో లింగ్ కేవలం విమర్శలకే పరిమితం కావడం లేదు. సైబర్ స్టాకింగ్, డాక్సింగ్, ఐడెంటిటీ థెఫ్ట్, బాడీ షేమింగ్ వంటి అనేక రూపాల్లో వేధింపులు జరుగుతున్నాయి. ట్రోల్ చేయా లనుకున్న వ్యక్తి ఫోన్ నంబర్, ఇంటి చిరునామా వంటి వ్యక్తిగత వివరాలను బయటపెట్టడం ద్వారా మరింతమంది ని దాడికి ప్రోత్సహించడం జరుగుతోంది. నకిలీ ఖాతాలు (Digital attacks)సృష్టించి అశ్లీల లేదా వివాదాస్పదకంటెంట్ను ప్రచారం చేయడం కూడా సాధారణంగా మారింది. ఈ దాడులు కేవ లం మానసికంగా మాత్రమే కాదు, కొన్నిసార్లు భౌతిక దాడు లకు కూడా దారితీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటన స్వేచ్ఛపైనే ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ భయాన్ని ‘చిల్లింగ్ ఎఫెక్ట్’ అని పిలుస్తారు. అంటే, వ్యక్తులు తమ అభిప్రాయాలను స్వేచ్చగా వ్యక్తం చేయకుండా భయపడే పరిస్థితి.

Read Also : Fastag update : టోల్ బాదుడు షురూ, FASTag పాస్ ధర పెరిగింది

Digital attacks

ఐక్యరాజ్యసమితి నిర్వహించిన అధ్యయనాల్లో కూడా చాలా మంది మహిళా జర్నలిస్టులు ఆన్లైన్ వేధింపుల కారణంగా ఉద్యోగాలు వదిలేయడం, సోషల్ మీడియాకు దూరం కావడం వంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చినట్టు వెల్లడైంది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ట్రోలింగ్ పద్ధతులు కూడా కొత్త రూపాలను సంతరించుకుంటున్నాయి. హ్యాకింగ్, డిజిటల్ ట్రాకింగ్,(Digital attacks) వ్యక్తిగత చాట్లను దొంగిలించడం వంటి చర్యల ద్వారా బాధితులను మరింతగా బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా సంస్థలు కఠిన చర్యలు తీసుకోవాలని చాలా మంది కోరుతు న్నా, వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా అవిపూర్తిగా స్పందిం చడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి. అందుకే వ్యక్తిగత స్థాయిలో జాగ్రత్తలు కూడా అత్యంత అవసరం. సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్గా ఉంచడం, వ్యక్తిగత వివరాల ను వెల్లడించకపోవడం, లొకేషన్ ట్యాగ్లను నివారించడం, బలమైన పాస్వర్డు ఉపయోగించడం, మల్టీఫాక్టర్ ఆథెంటికేషన్ వంటి భద్రతా చర్యలు తీసుకోవడం తప్పనిసరి. అంతేకాదు, వేధింపులు ప్రారంభమైన వెంటనే సంబంధిత ఖాతాలను బ్లాక్ చేయడం, స్క్రీన్షాట్లు భద్రపరచడం, సైబర్ క్రైమ్అ ధికారులకు ఫిర్యాదుచేయడం కూడా చాలాముఖ్యం. సైబర్ నేరాలపై మనదేశంలో కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయి. సైబర్ స్టాకింగ్, ఐడెంటిటీ థెఫ్ట్, ఆన్లైన్ వేధిం పులపై కేసులు నమోదు చేయవచ్చు. 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్, 1091 మహిళల హెల్ప్ లైన్, 14490 నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్వాలైన్ వంటి సేవలు అందుబాటు లో ఉన్నాయి. ఒక గొప్ప ప్రజాస్వామ్య వేదికలాంటి సోషల్ మీడియా ద్వేషం, వేధింపులు, అసత్య ప్రచారాలకు వేదికగా మారితే సమాజానికి పెనుప్రమాదం. సోషల్ మీడియా అనేది ఒక పదునైన కత్తి వంటిది. అది అభివృద్ధికి తోడ్పడాలి కానీ వినాశనానికి కాదు. వ్యక్తుల గౌరవం, గోప్యత గౌరవించబడి నప్పుడే అది నిజమైన స్వేచ్చా వేదిక అవుతుంది. చట్టాల కఠిన అమలుతో పాటు, నెటిజన్లలో సామాజిక బాధ్యత పెరిగినప్పుడే ఈ’డిజిటల్ చీకటి’ తొలగిపోతుంది.
-ఎక్కులూరి నాగార్జున్ రెడ్డి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News child rights childhood in war children affected by war impact of war on children latest news Telugu News war victims children

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.