Chicken rates in Telugu states: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ప్రియులకు చేదువార్త అందుతోంది. మార్కెట్లో కోడి మాంసం ధరలు ఒక్కసారిగా ట్రిపుల్ సెంచరీని దాటేశాయి. వేసవి ప్రభావం మరియు ఉత్పత్తి తగ్గడం వల్ల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. ప్రస్తుతం కేజీ స్కిన్‌లెస్ ధర మునుపెన్నడూ లేని విధంగా పెరిగి కస్టమర్లను బెంబేలెత్తిస్తోంది.
Read also: Samsung Galaxy S26: శామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
Chicken prices increased in Telugu states
నగరాల్లో తాజా మార్కెట్ రేట్లు
Chicken rates in Telugu states: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 280 నుండి రూ. 300 వరకు పలుకుతోంది. అటు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా కిలో ధర రూ. 300 మార్కును తాకగా, విజయవాడలో రూ. 270 మరియు గుంటూరు (Guntur) ప్రాంతంలో సుమారు రూ. 250 వరకు విక్రయిస్తున్నారు.
ధరలు పెరగడానికి గల కారణాలు
ముఖ్యంగా ఎండల తీవ్రత పెరగడంతో కోళ్ల మరణాల శాతం అధికమై సప్లై తగ్గడం ఒక ప్రధాన కారణం. పౌల్ట్రీ ఫామ్‌ల నిర్వహణ ఖర్చులతో పాటు దాణా ధరలు కూడా పెరగడం ఈ ధరల పెరుగుదలకు దారితీసింది. ఆదివారం వచ్చిందంటే చికెన్ సెంటర్ల వద్ద జనం క్యూ కట్టేవారు, ఇప్పుడు మారుతున్న ధరలను చూసి తక్కువ పరిమాణంలో కొనుగోలు చేస్తూ సరిపెట్టుకుంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: