📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్

Trump: ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేరేందుకు పాక్ సహా 8 ఇస్లామిక్ దేశాల అంగీకారం

Author Icon By Vanipushpa
Updated: January 22, 2026 • 11:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గాజాలో యుద్ధానికి ముగింపు పలికి, పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేరేందుకు ఎనిమిది ఇస్లామిక్ దేశాలు అంగీకరించాయి బుధవారం ఈ దేశాల విదేశాంగ మంత్రులు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. బోర్డులో చేరాలని ట్రంప్ పంపిన ఆహ్వానాన్ని ఆయా దేశాలు స్వాగతించాయి.
బోర్డ్ ఆఫ్ పీస్​లో చేరేందుకు అంగీకరించిన దేశాల్లో ఖతార్, తుర్కియే, ఈజిప్ట్, జోర్డాన్, ఇండోనేషియా, పాకిస్థాన్ , సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. ఈ దేశాలన్నీ గాజాలో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు జరుగుతున్న అంతర్జాతీయ శాంతి ప్రయత్నాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశాయి. ఇప్పటికే ఈజిప్ట్, పాకిస్థాన్, యూఏఈలు బోర్డులో చేరేందుకు తమ అధికారిక సమ్మతిని ట్రంప్‌కు తెలియజేశాయి.

Read Also: WEF: వరల్డ్ క్లాస్ ‘బ్యూటీ టెక్ హబ్’గా మారనున్న హైదరాబాద్!

Trump: ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేరేందుకు పాక్ సహా 8 ఇస్లామిక్ దేశాల అంగీకారం

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం

ట్రంప్ నేతృత్వంలోని ఈ శాంతి ప్రణాళిక పశ్చిమాసియాలో భద్రతను పెంచుతుందని 8 దేశాల విదేశాంగ మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం యుద్ధం ఆపడమే కాకుండా, ఈ ప్రాంతం ఆర్థికంగా ఎదిగేందుకు ఈ బోర్డు దోహదపడుతుందని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. హమాస్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తాత్కాలిక పరిపాలనా యంత్రాంగంగా ఈ బోర్డు పనిచేయనుంది. యుద్ధంతో చిన్నాభిన్నమైన గాజాను తిరిగి నిర్మించడంతో పాటు, ఆ దేశంలో పాలనను చక్కబెట్టడం, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2803కు అనుగుణంగా శాశ్వత శాంతిని నెలకొల్పడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, భారీ నిధుల సమీకరణ లక్ష్యంగా ఈ బోర్డు పనిచేయనుంది.

పాలస్తీనాపై కూడా కీలక వ్యాఖ్యలు

బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరడంపై పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. అమెరికా పంపిన ఆహ్వానాన్ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించినట్లు తెలిపింది. ఈ బోర్డు ఏర్పాటు ద్వారా యుద్ధానికి పూర్తిస్థాయిలో స్వస్తి పలకడం, పాలస్తీనియన్లకు అందుతున్న సహాయాన్ని భారీగా పెంచడం, ధ్వంసమైన మౌలిక సదుపాయాలను తిరిగి నిర్మించడం వంటిని జరుగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొంది. అలాగే, పాలస్తీనాపై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. 1967కు పూర్వపు సరిహద్దులతో అల్-ఖుద్స్ అల్-షరీఫ్ (జెరూసలేం) రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా దేశం కావాలని పాకిస్థాన్ స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Board of Peace foreign affairs news Global Diplomacy international peace initiative Islamic countries agreement Islamic nations cooperation Pakistan news Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.