📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Bangladesh: షేక్ హసీనాకు BNP షాక్ .. వెనక్కి రప్పించే ప్రయత్నాలు

Author Icon By Vanipushpa
Updated: February 14, 2026 • 1:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విద్యార్థుల ఉద్యమంతో బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా(sheik-hasina) 2024లో దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్‌లోనే తలదాచుకుంటున్నారు. అయితే తాజాగా ఎన్నికల్లో గెలిచిన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్ పార్టీ (BNP) షేక్ హసినా వ్యవహారంపై స్పందించింది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమెను తమకు అప్పగించాలని కోరతామని స్పష్టం చేసింది. ఇది రెండు దేశాల విదేశాంగ శాఖల నిర్ణయించాల్సిన అంశమని బీఎన్‌పీ ప్రతినిధి సలహుద్దీన్ అన్నారు. విచారణలను ఎదుర్కునేందుకు హసీనాను స్వదేశానికి పంపించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతామని పేర్కొన్నారు.

Read Also: Nigeria: గాల్లో ఉండగానే పేలిన విమానం ఇంజిన్

Bangladesh: షేక్ హసీనాకు BNP షాక్ .. వెనక్కి రప్పించే ప్రయత్నాలు

భారత్‌కు యూనస్‌ ప్రభుత్వం అభ్యర్థనలు

విద్యార్థుల విద్యార్థుల ఆందోళనతో 2024 ఆగస్టులో షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మానవత్వానికి వ్యతిరేకంగా హసీనా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో బంగ్లాదేశ్‌లోని ‘ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌’ (ICT) ఆమెకు మరణ శిక్ష విధించింది. ఇంకా ఇతర కేసుల్లో కూడా ఆమెకు శిక్షలు పడ్డాయి. ఆమెను తమకు అప్పగించాలని ఇటీవలే పలుమార్లు యూనస్‌ ప్రభుత్వం భారత్‌కు అభ్యర్థనలు పంపింది. కానీ భారత్‌ మాత్రం ఆమెను ఇప్పుడే పంపాలని అనుకోవడం లేదు. కానీ బంగ్లాదేశ్‌ పంపిన అభ్యర్థనను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ఇదిలాఉండగా గురువారం జరిగిన బంగ్లాదేశ్‌ పార్లమెంట్ ఎన్నికల్లో BNP ఘన విజయం సాధించింది. మిత్ర పక్షాలతో కలిసి 299 స్థానాలకు 212 చోట్ల గెలిచింది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సిద్ధమవుతోంది. బీఎన్‌పీ చీఫ్‌ తారిఖ్‌ రెహమాన్ బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Awami League Bangladesh government Bangladesh Nationalist Party Bangladesh political crisis BNP Politics Dhaka Politics Khaleda Zia Sheikh Hasina Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.