గ్లోబల్ టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) సోమవారం ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఈ పర్యటనలో ఆయన ముఖ్యమంత్రి తో ముఖాముఖీ భేటీ కావడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఆరోగ్యం, కృత్రిమ మేధ (AI), డిజిటల్ పాలన, వ్యవసాయం వంటి ప్రధాన రంగాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరపనున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లతో భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య సంబంధిత పథకాలు, వాటిని రాష్ట్రవ్యాప్తంగా మరింత సమర్థవంతంగా విస్తరించే విధానాలు, AI ఆధారిత సాంకేతికతను ప్రజాసేవల్లో ఎలా వినియోగించవచ్చనే అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. ప్రత్యేకంగా గేట్స్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్న సేవలపై ఈ సమావేశంలో సమీక్ష జరగనుంది.
Read Also: Tollywood: అల్లు శిరీష్ వెడ్డింగ్ కార్డ్ చిరంజీవికి మొదటి ఆహ్వాన పత్రిక
మాతృ శిశు ఆరోగ్యం, ప్రాథమిక వైద్య సేవలు
గతంలో చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిన గేట్స్ ఫౌండేషన్.. వాటిని మరింత విస్తృతంగా ప్రజలకు అందించే అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ముందడుగు వేయాలని భావిస్తోంది. మాతృ శిశు ఆరోగ్యం, ప్రాథమిక వైద్య సేవలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్ వంటి అంశాలు చర్చల్లో ప్రాధాన్యం పొందనున్నాయి. సమావేశం అనంతరం బిల్ గేట్స్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక వ్యవస్థ అయిన రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (RTGS)ను సందర్శించనున్నారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రజా సేవల అమలు, పథకాల పురోగతి, డేటా ఆధారిత నిర్ణయాలను ఎలా తీసుకుంటుందో ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం గేట్స్‌కు కలుగుతుంది.
బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్న మూడవ పర్యటన
రూ.3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్..అమరావతిపై ప్రత్యేక ఫోకస్.. పూర్తి వివరాలు ఇవిగో.. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్వర్ణ ఆంధ్ర 2047 విజన్‌ను కూడా గేట్స్‌కు వివరించనున్నారు. ఈ దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలో ఆరోగ్య సేవల ఆధునీకరణ, మెడిటెక్ రంగం అభివృద్ధి, డయాగ్నొస్టిక్ మౌలిక వసతుల విస్తరణ, “సంజీవని” డిజిటల్ హెల్త్ రికార్డు వంటి పథకాలు కీలకంగా ఉన్నాయి. ఇవి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయి. అధికారిక కార్యక్రమాల అనంతరం బిల్ గేట్స్ అమరావతి పరిసర ప్రాంతాల్లోని ఒక వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించనున్నారు. అక్కడ డ్రోన్లు, AI ఆధారిత సాంకేతికతల ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని ఎలా పెంచవచ్చో ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ఈ ఆధునిక పద్ధతులు రైతులకు ఖర్చులు తగ్గించి, దిగుబడులు పెంచడంలో ఉపయోగపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్న మూడవ పర్యటన ఇది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: