📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Bill Gates: అమరావతిలో బిల్ గేట్స్.. చంద్రబాబుతో భేటీలో కీలక చర్చలు

Author Icon By Vanipushpa
Updated: February 16, 2026 • 1:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్(Bill Gates) కీలక భేటీ జరిగింది. సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్ నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి వెళ్లారు. అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు,ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి బృందంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా చర్చలు జరిగాయి. సమావేశాల అనంతరం Bill Gates సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రం ద్వారా ప్రభుత్వం ఎలా రియల్ టైమ్ డేటాను ఉపయోగించి ప్రజాసేవలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తోందో సీఎం చంద్రబాబు వివరించారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సంక్షేమ పథకాల అమలులో RTGS ద్వారా సాధించిన ఫలితాలను గేట్స్‌కు తెలియజేశారు. డేటా ఆధారిత పాలనతో ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని సీఎం వివరించారు.

Read Also: PM Modi: డేటా సెంటర్లతో భారీ ఉపాధి

Bill Gates: అమరావతిలో బిల్ గేట్స్.. చంద్రబాబుతో భేటీలో కీలక చర్చలు

ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు

గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల ప్రాజెక్టులను మరింత విస్తరించడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో అమలవుతున్న సంజీవని ప్రాజెక్టు గురించి సీఎం చంద్రబాబు సవివరంగా వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. అలాగే, మెడ్‌టెక్, డయాగ్నస్టిక్స్ సేవలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్ వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలను గేట్స్ బృందానికి ప్రజెంటేషన్ రూపంలో వివరించారు. ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య, సాంకేతిక ఆధారిత పరిపాలనలో చేపట్టిన సంస్కరణలు, భవిష్యత్ ప్రణాళికలను గేట్స్ ప్రశంసించారు. ముఖ్యంగా వ్యవసాయంలో సాంకేతిక సాగు, డేటా ఆధారిత పంటల నిర్వహణ, రైతుల ఆదాయాన్ని పెంచే విధానాలపై విస్తృత చర్చ జరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Amaravati Andhra Pradesh AP Development bill gates Gates Foundation N. Chandrababu Naidu Public Policy Technology Investment Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.