Bill Gates: రష్యన్ అమ్మాయిలతో సంబంధాలపై బిల్‌గేట్స్ క్లారిటీ

Read Time:  1 min
రష్యన్ అమ్మాయిలతో సంబంధాలపై బిల్‌గేట్స్ క్లారిటీ
రష్యన్ అమ్మాయిలతో సంబంధాలపై బిల్‌గేట్స్ క్లారిటీ
FONT SIZE
GET APP

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రఖ్యాత దాత బిల్ గేట్స్(Bill Gates) మరోసారి వార్తల్లో నిలిచారు. దివంగత లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో గతంలో తనకు ఉన్న సంబంధాల పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన దాతృత్వ సంస్థ ‘బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్’ ఉద్యోగులతో నిర్వహించిన ఒక ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ అంశంపై బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఎప్‌స్టీన్‌తో సమయం గడపడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పిదమని ఆయన అంగీకరించారు. అలాగే రష్యా అమ్మాయిలతో తనకు సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలపై కూడా క్లారిటీ ఇచ్చారు.

Read Also: Vaccine india : గర్భాశయ క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

Bill Gates' clarity on relationships with Russian girls
Bill Gates’ clarity on relationships with Russian girls

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం..

ఈ సమావేశంలో గేట్స్ తన తప్పును ఒప్పుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. “ఎప్‌స్టీన్‌తో గడపడం నేను చేసిన అతిపెద్ద తప్పు. నా పొరపాటు వల్ల ఈ వివాదంలోకి లాగబడిన ప్రతి ఒక్కరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను. మా ఫౌండేషన్ విలువలకు, లక్ష్యాలకు ఇది పూర్తిగా విరుద్ధం” అని ఆయన పేర్కొన్నారు. ఫౌండేషన్ ప్రతిష్ట చాలా సున్నితమైనదని, ఇలాంటి సంఘటనలు ప్రజలు తమతో కలిసి పనిచేసే నిర్ణయంపై ప్రభావం చూపుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన పత్రాల్లో ఎప్‌స్టీన్ రాసిన కొన్ని ఈమెయిల్ డ్రాఫ్టులు బయటపడ్డాయి. అందులో బిల్ గేట్స్‌కు డ్రగ్స్ సరఫరా చేయడంలో, రష్యన్ అమ్మాయిలతో సంబంధాలు ఏర్పాటు చేయడంలో తాను సహకరించినట్లు ఎప్‌స్టీన్ పేర్కొన్నాడు. అయితే ఈ ఆరోపణలను గేట్స్ తీవ్రంగా ఖండించారు. “నేను ఎలాంటి చట్టవిరుద్ధమైన పనులు చేయలేదు. అక్కడ ఏమీ చూడలేదు” అని గేట్స్ స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.