📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Epstein Files: ఎప్‌స్టీన్‌తో గడిపినందుకు క్షమాపణలు కోరుతున్నా ..బిల్‌గేట్స్‌

Author Icon By Vanipushpa
Updated: February 5, 2026 • 4:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్వవహారంలో మైక్రోసాఫ్ట్‌ సహ-వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ కూడా అభియోగాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా బిల్‌గేట్స్‌ ఈ అంశంపై స్పందించారు. ఎప్‌స్టీన్‌తో గడిపిన ప్రతీ క్షణానికి ఇప్పుడు చింతిస్తున్నట్లు ఆయన చెప్పారు. అందుకు తాను క్షమాపణలు కోరుతున్నట్లు బిల్‌ గేట్స్‌(Bill Gates) తెలిపారు. ఆస్ట్రేలియా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం సంబంధించి సుమారు 30లక్షల పేజీలను ఇటీవల అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. అందులో బిల్‌గేట్స్‌కు సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయనకు రష్యన్‌ మహిళలతో లైంగిక సంబంధాలు ఉన్నాయని, అందువల్ల ఆయన సుఖవ్యాధుల బారినపడ్డారని 2013లో రాసిన ఈ-మెయిల్‌లో ఎప్‌స్టీన్‌ పేర్కొన్నారు.

Read Also: EC : బిజెపి ఏజెంట్ గా EC పనిచేస్తోంది – మమతా

Epstein Files: ఎప్‌స్టీన్‌తో గడిపినందుకు క్షమాపణలు కోరుతున్నా ..బిల్‌గేట్స్‌

ఎప్‌స్టీన్‌ ఈ-మెయిల్‌లో రాసినది నిజం కాదు

అయితే, ఈ అంశంపై మాట్లాడిన బిల్‌గేట్స్ ఎప్‌స్టీన్‌ ఈ-మెయిల్‌లో రాసినది నిజం కాదని, ఆ సమయంలో అతని ఆలోచన ఏంటో తనకు తెలియదన్నారు. తనను ఈ విధంగా టార్గెట్‌ చేస్తాడని ఊహించలేదన్నారు. మరోవైపు, ఈ-మెయిల్​ అంశాలను గేట్స్​ బృందం కూడా తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా అసంబద్ధమైనవని అతని ప్రతినిధి మీడియాతో పేర్కొన్నారు. తనతో సంబంధాలు కొనసాగించకపోవడం వల్లే ఎప్‌స్టీన్‌ ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేశాడని ఆయన తెలిపారు.

ఇతర మహిళలతో సన్నిహితంగా ఉన్నట్లు తెలియడంతోనే విడాకులు

ఇదిలా ఉండగా, ఎప్​స్టీన్ సెక్స్​​ కుంభకోణం గురించి బిల్​గేట్స్​ భార్య కూడా ఇది వరకే స్పందించారు. బిల్​గేట్స్ ఇతర మహిళలతో సన్నిహితంగా ఉన్నట్లు తెలియడంతో తాను మానసిక క్షోభను అనుభవించానని ఆమె చెప్పారు. తన జీవితంలో ఆ సమయం చాలా బాధాకరమైనదని పేర్కొన్నారు. తమ బంధాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన విలువలను బిల్‌గేట్స్‌ నిలబెట్టుకోకపోవడం వల్లే ఆయనతో విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. అయితే, ఇప్పుడు బయటకు వచ్చిన వార్తలపై మాత్రం బిల్​గేట్సే సమాధానం ఇవ్వాలని ఆమె అన్నారు. ఎప్​స్టీన్​ కుంభకోణంలో బాధిత మహిళలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Bill Gates apology Bill Gates news Bill Gates statement global business news Jeffrey Epstein controversy tech leaders controversy Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.