📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Assam: బీజేపీలో చేరనున్నమాజీ కాంగ్రెస్​ అధ్యక్షుడు భూపేన్​ బోరా!

Author Icon By Vanipushpa
Updated: February 18, 2026 • 5:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

త్వరలో బీజేపీలో చేరనున్న అసోం కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు భూపేన్ బోరా(Bhupen Bora) బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ గౌరవ్ గొగొయ్​ నియంత్రణలో లేదని, దుబ్రి ఎంపీ రాకిబుల్ హుస్సేన్ ఆ పార్టీని నడిపిస్తున్నారని పేర్కొన్నారు. “రాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడిగా ఉన్న గొగొయ్​ ఇప్పుడు కేవలం ఒక డమ్మీగా ఉన్నారని అన్నారు. 10 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో దుబ్రి స్థానాన్ని గెలుచుకున్న రాకిబుల్ హుస్సేన్ మాత్రమే పార్టీకి అసలైన బలంగా, పునాదిగా ఉన్నారు” అని భూపేన్ బోరా విమర్శించారు. సోమవారం కాంగ్రెస్ అధిష్ఠానానికి రాజీనామా లేఖ పంపానని, దీని తర్వాత తనకు రాహుల్ గాంధీ ఫోన్​ చేశారని బోరా చెప్పారు. మరోవైపు భూపేన్ బోరా బీజేపీలో చేరనుండడంపై అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్​ గొగొయ్​ తీవ్రంగా స్పందించారు. బీజేపీలో చేరిన నేతలు వారి రాజకీయ జీవితంలో ‘ప్రాధాన్యత లేని వ్యక్తులు’గా మారిపోయారని, భూపేన్ బోరాకు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు.

Read Also: Andhra Pradesh politics: ఏపీలో కుల రాజకీయాలపై తులసిరెడ్డి కామెంట్స్

Assam: బీజేపీలో చేరనున్నమాజీ కాంగ్రెస్​ అధ్యక్షుడు భూపేన్​ బోరా!

‘అసోం జిన్నా’గా హిమంత బిశ్వ శర్మను: గౌరవ్ గొగొయ్

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అసలైన కాంగ్రెస్​, పాత కాంగ్రెస్​ మధ్యే ఉంటుందని గొగొయ్​ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. “బీజేపీ ప్రస్తుతం పాత కాంగ్రెస్ నాయకులతో నిండిపోయింది. రాష్ట్రంలో 15 ఏళ్ల కాంగ్రెస్ అత్యంత అవినీతికి పాల్పడిన వారు ఇప్పుడు అక్కడ ఉన్నారు” అని గౌరవ్​ గొగొయ్ అన్నారు. భూపేన్ బోరాను కాంగ్రెస్​లో మిగిలిన చివరి హిందూ నాయకుడు అని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అభివర్ణించడంపై గౌరవ్ గొగొయ్ మండిపడ్డారు. హిమంత బిశ్వ శర్మను ‘అసోం జిన్నా’గా అభివర్ణించారు. రాజకీయ నాయకులకు హిందూ సర్టిఫికెట్లు ఇవ్వడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. “కాంగ్రెస్ ఒక మహాసముద్రం లాంటిది. మనమందరం ఇందులో కేవలం నీటి బిందువువలమే. మన తాతలు, తండ్రులు. పూర్వీకుల కంటే ముందు నుంచే కాంగ్రెస్ ఉంది. భూపేన్ బోరా పార్టీని వీడడం అనేది ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపదు” గౌరవ్​ గొగొయ్ అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Assam Politics Bhupen Borah BJP expansion strategy BJP joining news Congress to BJP switch former Congress president Indian political updates party defection news Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.