Bangalore: బెంగళూరుకు బిగ్ షాక్.. మంగళూరుకు వెళ్లిపోతున్న ఐటీ కంపెనీలు

Read Time:  1 min
బెంగళూరుకు బిగ్ షాక్.. మంగళూరుకు వెళ్లిపోతున్న ఐటీ కంపెనీలు
బెంగళూరుకు బిగ్ షాక్.. మంగళూరుకు వెళ్లిపోతున్న ఐటీ కంపెనీలు
FONT SIZE
GET APP

12 సంవత్సరాలుగా సింగపూర్‌లో పనిచేస్తున్న ఇంజనీర్ ఆదిత్య జీవితంలో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఆడియో సొల్యూషన్స్ సంస్థ Bose Professional అతనికి ఒక ప్రత్యేక బాధ్యతను అప్పగించింది. అదేంటంటే పూర్తిగా కొత్త ఉత్పత్తి శ్రేణిని మొదటి నుంచి నిర్మించడమే కాకుండా.. అమెరికా వెలుపల కంపెనీ స్థాపించే తొలి యూనిట్‌కు సరైన స్థలాన్ని ఎంపిక చేయడం. మొదట కంపెనీ సూచన ఏంటంటే బెంగళూరు. కానీ ఆదిత్యకు అక్కడి వాస్తవ పరిస్థితులు బాగా తెలుసు. తీవ్రమైన ట్రాఫిక్, పెరుగుతున్న జీవన వ్యయం, అధిక ఉద్యోగ మార్పిడులు (attrition) వంటి అంశాలు దీర్ఘకాలిక R&D పనులకు అడ్డంకిగా మారతాయని ఆయన నమ్మారు. అందుకే ఆయన ఒక భిన్నమైన ప్రతిపాదన చేశారు.

Read Also: GATE 2026: ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు మార్చి 19న

 Big shock for Bengaluru.. IT companies moving to Mangalore
Big shock for Bengaluru.. IT companies moving to Mangalore

తక్కువ ట్రాఫిక్, శుభ్రమైన గాలి, సమతుల్య జీవితం

కర్ణాటక తీరంలోని మంగళూరు(Mangalore) గురించి చెప్పాడు. సాంప్రదాయంగా మంగళూరు ఆర్థిక వ్యవస్థ శుద్ధి కర్మాగారాలు, షిప్పింగ్, మత్స్యకార రంగం, వ్యవసాయం చుట్టూ తిరిగింది. కానీ ఉడిపి జిల్లా కర్కల సమీపంలో పెరిగిన ఆదిత్యకు ఈ ప్రాంతంలోని ప్రతిభ, జీవన నాణ్యత, ప్రశాంత వాతావరణం మీద పూర్తి నమ్మకం ఉంది. తక్కువ ట్రాఫిక్, శుభ్రమైన గాలి, సమతుల్య జీవితం.. ఇవన్నీ ఐటీ నిపుణులను ఆకర్షించే అంశాలుగా నమ్మాడు. నవంబర్ 2024లో లింక్డ్‌ఇన్ ద్వారా నియామక ప్రక్రియ ప్రారంభమైంది. మంగళూరు, ఉడిపి ప్రాంతానికి చెందిన కానీ ఇతర నగరాల్లో పనిచేస్తున్న నిపుణులను ప్రత్యేకంగా సంప్రదించారు. ఫలితం ఆశ్చర్యకరంగా వచ్చింది. కుటుంబానికి దగ్గరగా ఉండే అవకాశం, కొత్త ఉత్పత్తిని మొదటి నుంచీ నిర్మించే ఛాన్స్, మంచి జీతం ఇలా ఇవన్నీ వారిని ఆకర్షించాయి.

100 మిలియన్ డాలర్ల విలువైన గ్లోబల్ కొనుగోళ్లు

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు చెక్..ఇకపై నిమిషాల్లోనే ఆఫీసుకు.. రూ. 120 కోట్లతో బెల్లందూర్ మెట్రోస్టేషన్ రెడీ.. జనవరి 2025 నాటికి ఆదిత్య భారత్‌లో బోస్ ప్రొఫెషనల్ రెండో ఉద్యోగిని నియమించారు. అదే సంవత్సరం చివరికి బృందం 50 మందికి చేరింది. నేడు ఈ బృందం మంగళూరులోని కొట్టారా చౌక్‌లో ఉన్న ఆధునిక కార్యాలయం నుంచి అమెరికా మార్కెట్ కోసం కీలక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోంది. బోస్ ప్రొఫెషనల్ ఒక్కటే కాదు. ఇటీవలి సంవత్సరాల్లో మంగళూరు, ఉడిపి, దక్షిణ కన్నడ జిల్లాల్లో వందలాది ఐటీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయి. గత రెండు సంవత్సరాల్లో ఈ ప్రాంత ఐటీ ఆదాయం రూ.3,200 కోట్ల నుంచి దాదాపు రూ.5,000 కోట్లకు చేరుకుంది. ఇందులో సుమారు రూ.3,000 కోట్లు నిపుణుల జీతాల రూపంలో స్థానిక ఆర్థిక వ్యవస్థలోకి ప్రవహిస్తున్నాయి. 2034 నాటికి ఈ ప్రాంత ఐటీ ఆదాయాన్ని రూ.45,000 కోట్లకు చేర్చాలని, ఉద్యోగులను 50 వేల నుంచి 2 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత మూడేళ్లలోనే దాదాపు 100 మిలియన్ డాలర్ల విలువైన గ్లోబల్ కొనుగోళ్లు జరగడం ఇక్కడి టెక్నాలజీ నాణ్యతకు నిదర్శనం.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.