📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tariq Rahman: 35 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు ప్రధానిగా ఓ పురుషుడు

Author Icon By Vanipushpa
Updated: February 14, 2026 • 1:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల్లో తారిక్ రెహమాన్(Tariq Rahman) నాయకత్వంలోని బీఎన్పీ భారీ విజయాన్ని సాధించి, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ అధికారం చేపట్టబోతుంది. చివరిసారిగా ఆ పార్టీ 2001 పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందింది. అలాగే, 35 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు ఓ పురుషుడు ప్రధాని కాబోతున్నారు. తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీఎన్‌పీ మిత్ర పక్షాలతో కలిసి 299 స్థానాలకు 212 చోట్ల విజయం సాధించింది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా రెడీ అవుతోంది. అయితే తారిఖ్‌ రెహమాన్ బంగ్లా ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇక, ఎన్నికలతో పాటు జులై నేషనల్‌ ఛార్టర్‌‌పై కూడా ఆ దేశ ఎన్నికల కమిషన్ రెఫరెండం నిర్వహించింది. ఈ రెఫరెండానికి అనుకూలంగా దాదాపు 70 శాతం మంది ఓటేసినట్టు బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్ సీనియర్‌ కార్యదర్శి అహ్మద్‌ అక్తర్‌ వెల్లడించారు. మొత్తం 4,80,74,429 మంది అనుకూలంగా.. 2,25,65,627 మంది వ్యతిరేకంగా ఓటు వేసినట్టు తెలిపారు.

Read Also: AP Budget 2026: ఏప్రిల్ నుంచి చేనేత కార్మికులకు ఉచితవిద్యుత్

Tariq Rahman: 35 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు ప్రధానిగా ఓ పురుషుడు

కేంద్రీకృతం కాకుండా నిరోధించడమే చార్టర్ ప్రధాన లక్ష్యం

దేశ పాలనను సమూలంగా మార్చే లక్ష్యంతో జులై నేషనల్ చార్టర్ 2025 ఆమోదం కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. జులై చార్టర్ ప్రభుత్వ పునర్నిర్మాణానికి సంబంధించిన మొత్తం 84 సంస్కరణ అంశాలను వివరిస్తుంది. జులై 2024లో విద్యార్థుల తిరుగుబాటుతో అప్పటి ప్రధాన మంత్రి షేక్ హసీనా పదవిలో నుంచి దిగిపోయిన తర్వాత ఈ ఛార్టర్‌ను రూపొందించారు. 270 పని దినాలలోపు ఈ సంస్కరణలను అమలు చేయాలని రాజ్యాంగ సంస్కరణల మండలి భావిస్తుంది. కీలక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రాథమికంగా పునర్నిర్మించి, నియంతృత్వ పాలన పునరావృతం కాకుండా, అధికారం కేంద్రీకృతం కాకుండా నిరోధించడమే చార్టర్ ప్రధాన లక్ష్యం. ఇందులోని 84 సంస్కరణల్లో 47కి రాజ్యాంగ సవరణలు అవసరం, మిగతా 37 చట్టాలు లేదా కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా అమలు చేస్తారు.
కాలపరిమితి పరిమితులు: దీర్ఘకాలం కొనసాగే నిరంకుశ పాలనను నిరోధించడానికి ప్రధాన మంత్రులకు నిర్ణీత కాలపరిమితి అమలుచేయడం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bangladesh Political History Bangladesh politics Bangladesh Prime Minister Khaleda Zia Male Prime Minister Bangladesh Sheikh Hasina South Asia politics Telugu News online Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.