ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం(New South Wales)లో కాల్పులు కలకలం రేపాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ఈ మేరకు కాల్పులు జరిపిన లేక్ కార్గేలిగో ప్రాంతంలో ప్రస్తుతం సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 15 వందల మంది నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం అందుతోంది. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ప్రస్తుతం నిందితుల్ని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా మరోసారి కాల్పుల మోతతో అట్టుడికింది.
Read Also: US: మిత్రదేశాలపై ట్రంప్ టారిఫ్‌లు రద్దు..గ్రీన్‌ల్యాండ్‌పై యూటర్న్
ఉగ్రదాడిలో 16 మంది మృతి
గతేడాది డిసెంబర్ 14 న సిడ్నీలోని బోండీ బీచ్ లో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 16 మంది మృతి చెందారు. మరో 40 మంది గాయపడ్డారు. ఈ కేసులో తండ్రీకొడుకులే ఘటనకు పాల్పడినట్లు దర్యాప్తు సంస్థలు తేల్చాయి. అయితే సిడ్నీ ఉగ్రదాడి మృతులకు నివాళిగా ఆస్ట్రేలియా జాతీయ సంతాప దినం పాటిస్తున్న రోజే తాజాగా మరోసారి కాల్పులు జరగడం ఆందోళనకరంగా మారింది. ఆస్ట్రేలియా సౌత్ వేల్స్ రాష్ట్రంలోని లేక్ కార్గేలిగో ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఘటనానంతరం దుండగులు అక్కడినుంచి పరారైనట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: