📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Hybrid ATM: ఇకపై ఏటీఎంలో రూ. 500 ఇస్తే 10, 20 రూపాయల నోట్లు వస్తాయి!

Author Icon By Vanipushpa
Updated: January 29, 2026 • 3:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతిరోజూ ఉదయం పాల ప్యాకెట్ దగ్గర నుండి ఆఫీసుకి వెళ్లే ఆటో వరకు మనల్ని వేధించే ప్రధాన సమస్య ‘చిల్లర’. జేబులో రూ. 500 నోటు ఉన్నా పది రూపాయల టీ తాగడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈ చిల్లర కష్టాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ (RBI) కలిసి ఒక అద్భుతమైన ప్లాన్ సిద్ధం చేశాయి. అదే ‘హైబ్రిడ్ ఏటీఎం’ (Hybrid ATM). మన దేశంలో యూపీఐ (UPI) లావాదేవీలు విపరీతంగా పెరిగినప్పటికీ.. ఇప్పటికీ చిన్న చిన్న అవసరాలకు నగదు (Cash) ప్రాధాన్యత తగ్గలేదు. ముఖ్యంగా కూరగాయల మార్కెట్లు, బస్సు ప్రయాణాలు, చిన్నపాటి చిరుతిళ్ల దగ్గర రూ. 500 నోటు ఇస్తే ‘చిల్లర లేదు’ అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సరికొత్త హైబ్రిడ్ (Hybrid ATM)లను ప్రవేశపెడుతోంది. ఈ మిషన్లు కేవలం డబ్బులు డ్రా చేయడానికే కాదు, మీ దగ్గర ఉన్న పెద్ద నోట్లను చిన్న నోట్లుగా మార్చుకోవడానికి కూడా ఉపయోగపడతాయి.

Read Also: India: గాజా సంఘర్షణ పరిష్కారానికి అమెరికా కృషి

Hybrid ATM: ఇకపై ఏటీఎంలో రూ. 500 ఇస్తే 10, 20 రూపాయల నోట్లు వస్తాయి!

హైబ్రిడ్ ఏటీఎంల ప్రత్యేకత ఏంటి?

సాధారణ ఏటీఎంలు ఎక్కువగా రూ. 500, రూ.200 వంటి నోట్లనే స్టాక్ చేస్తాయి. కానీ, ఈ కొత్త హైబ్రిడ్ మిషన్లు (Hybrid ATM) రూ. 10, రూ. 20, రూ. 50 నోట్లను డిస్పెన్స్ చేయడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి. వీటిలో ప్రధానంగా రెండు ఫీచర్లు ఉంటాయి: మైక్రో విత్‌డ్రాల్స్: రోజువారీ అవసరాల కోసం చిన్న మొత్తంలో నగదును తీసుకోవచ్చు. నోట్ ఎక్స్‌ఛేంజ్: మీ వద్ద ఉన్న రూ. 500 నోటును మిషన్‌లో ఉంచితే అది వెంటనే మీకు అవసరమైన చిన్న నోట్లను అందిస్తుంది. మొదటి అడుగు ముంబైలో.. తర్వాత దేశవ్యాప్తంగా! ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఇప్పటికే ముంబైలో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించారు. రైల్వే స్టేషన్లు, బస్ డిపోలు, ప్రభుత్వ ఆసుపత్రులు, రద్దీగా ఉండే మార్కెట్లను దీని కోసం ఎంపిక చేశారు. ముంబైలో ఈ ప్రయోగం సక్సెస్ అయితే మార్చి 2026 నాటికి దేశవ్యాప్తంగా వీటిని విస్తరించాలని ఆర్బీఐ (RBI) లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఇప్పటికీ 60% పైగా లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతున్నందున ఈ నిర్ణయం అక్కడి ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

10 rupee notes 20 rupee notes 500 rupee notes ATM cash denominations ATM currency update cash withdrawal changes Indian Banking Updates RBI News Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.