📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Andhra Pradesh: కరెంటు కోతలేని వేసవి: వంగలపూడి అనిత

Author Icon By Rajitha
Updated: March 11, 2026 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: వేసవిలో కరెంటు కోతలు అస్సలు ఉండకూడదని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. ఆసుపత్రులు, తాగునీటి పథకాలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా గట్టి చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు తాగునీటి కష్టాలు రాకుండా చూడాలన్నారు. నిరంతరాయంగా మంచినీటి సరఫరా జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆమె ఆదేశించారు. ఏపీ రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఏపీఎస్ఓఎంఏ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో జిల్లా కలెక్టర్లు, లైన్ డిపార్ట్మెంట్లు, విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో.. ఎండలో ప్రయాణించే పాదచారుల కోసం రహదారుల వెంట తాత్కాలిక చలువ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి.. రానున్న రోజుల్లో వడగాల్పుల తీవ్రత మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది.

Read also: Jana Sena Formation Day : జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

Andhra Pradesh: Summer without power cuts: Vangalapudi Anitha

పశువులు, జంతువులు వడదెబ్బకు గురి కాకుండా

ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మంగళవారం ఏపీ రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఏపీఎస్ఈఎంఏ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో జిల్లా కలెక్టర్లు, లైన్ డిపార్ట్మెంట్లు, విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు పాల్గొన్నారు. కాయగూరల మార్కెట్లు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు వంటి జనసమర్ధ ప్రాంతాల్లో తప్పనిసరిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, స్థానిక కమ్యూనిటీ గ్రూపుల భాగస్వామ్యాన్ని పెంపొందించాలని చెప్పారు. వారి సాయంతో కూడళ్ల వద్ద ఉచితంగా మంచినీరు, మజ్జిగ పంపిణీ చేసేలా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. మనుషులతో పాటు మూగజీవాలను కూడా ఎండల నుంచి కాపాడుకోవాలని, పశువులు, జంతువులు వడదెబ్బకు గురి కాకుండా పశుసంవర్ధక శాఖ తగిన జాగ్రత్తలు, సూచనలు జారీ చేయాలన్నారు. గ్రామాల్లో పశువుల తొట్లు నిర్మించి నీరు నింపాలని సూచనలు చేశారు. రాష్ట్రంలో ఎండలు మండిపోబోతున్నాయి. రానున్న రోజుల్లో వడగాల్పుల తీవ్రత మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది.

కొద్ది రోజుల్లో వడగాల్పులు విపరీతంగా ఉంటాయని

ఎండ తీవ్రత, వడగాల్పుల నుంచి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. సమావేశంలో ఏపీఎస్ఓఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వాతావరణ పరిస్థితులపై కీలక వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎండల తీవ్రత విపరీతంగా ఉండబోతోందని ఆయన హెచ్చరించారు. ఆయా ప్రాంతాల్లో సాధారణం కంటే చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రానున్న కొద్ది రోజుల్లో వడగాల్పులు విపరీతంగా ఉంటాయని తెలిపారు. దీంతో అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండి తీరాలని మంత్రి అనిత సూచించారు. వేసవి సెలవుల్లో పిల్లలు చెరువులు, నీటి కుంటలు వద్ద ఆడుకునే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నందున అటువంటి చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ డిపార్టుమెంటు తప్పని సరిగా హాస్పిటల్స్, హోటళ్లు, ప్రవేటు బిల్డింగ్స్ లో వైరింగ్, ఇతర ఫైర్ సేఫ్టీ వంటివి తనిఖీ చేయాలన్నారు. కలెక్టర్లు ఎండ తీవ్రత జాగ్రత్తలపై విసృతంగా ప్రచారం చేయాలని అలాగే ఎండ తీవ్రత సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ 112, 1070, 18004250101 నంబర్లు ప్రచారం చేయాలన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కీలక అడుగు వేసింది. ప్రస్తుత వేసవిని ఎదుర్కొనేందుకు రూపొందించిన హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2026ను మంత్రి అనిత ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధికారులంతా ఈ స్టేట్ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ మార్గదర్శకాలతోనే ముందుకు వెళ్లాలని ఆమె స్పష్టం చేశారు. ఎండల వల్ల ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదని, జీరో క్యాజువాలిటీస్ లక్ష్యంగా పని చేయాలని అధికారులను ఆదేశించారు

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP News electricity Heat Wave latest news Summer 2026 Telugu News vangalapudi anitha water supply

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.