📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Andhra pradesh: ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి కందుల దుర్గేష్

Author Icon By Rajitha
Updated: March 5, 2026 • 12:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Andhra pradesh: రాష్ట్రాన్ని సినీ, టెలివిజన్ రంగానికి ప్రధానకేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని తన చాంబర్లో టెలివిజన్ ఫ్రెటర్నీటి ఫోరం సభ్యులు ఎఫిసి ఎండి విశ్వనాధన్తో కలసి మంత్రి దుర్గేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బుల్లితెర కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత 45 ఏళ్ళుగా టివి పరిశ్రమ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, కళాకారులు ఉపాధికి అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. విశాఖపట్టణం జిల్లా భీమిలి వద్ద కేటాయించిన స్థలంలో టివి నగర్ (నివాస స్థలాలు), స్టూడియోల నిర్మాణం కోసం సభ్యులు చేసిన అభ్యర్థనను సానుకూలంగా పరిశీలిస్తామన్నారు.

Read also: Andhra Pradesh: మద్యం విక్రయాల్లో డిజిటల్ విప్లవం: కొత్త పాలసీకి గ్రీన్ సిగ్నల్!

AP as a film and television hub

అమరావతి, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి ప్రాంతాల్లో స్టూడియోల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. పెండింగ్లో ఉన్న టివి నంది అవార్డులను త్వరలోనే అందజేస్తామని, ఉగాధి పురస్కారాల్లో టివి కళాకారులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు. దివంగత ప్రముఖులు సుమన్, దేవదాస్ కనకాల పేర్లతో కళాకారులను సత్కరించే ప్రతిపాదనను పరిశీలిస్తామన్నారు. షూటింగ్స్ కోసం ప్రభుత్వ స్థలాలు, ఆడిటోరియాలు, దేవాలయాలు, టూరిజం గెస్ట్ హౌస్లలో రాయీతీలు కల్పించే దిశగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి దుర్గేష్ తెలి పారు. ప్రభుత్వానికి, టివి పరిశ్రమకు మధ్య వారధిగా పనిచేసేందుకు టెలివిజన్ ఫ్రెటర్నిట్ ఫోరమ్ను అనుసంధాన కమిటీగా గుర్తించాలన్నకోరికను పరిగణనలోనికి తీసుకుంటామని మంత్రి చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP News kandula durgesh latest news Nandi Awards Shooting Subsidy Telugu News tv industry

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.