విజయవాడ : రాష్ట్రంలో వంట గ్యాస్ కు ఎటువంటి ఇబ్బంది లేదని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వినియోగదారుల అవసరాలను గుర్తించి ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందన్నారు. వంట గ్యాస్ కొరత ఉందంటూ వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వంట గ్యాస్ సరఫరాపై ఉన్నతాధికారులతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని ప్రజలెవరూ దీనిపై అనవసరమైన ఆందోళనకి గురి కావొద్దని మంత్రి నాదెండ్ల విజప్తి చేశారు. గృహ అవసరాలకు, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ప్రస్తుతానికి ఇబ్బంది ఏమీ లేదని తెలిపారు.
Read also: Rajahmundry Nurses Suspended:ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్
Nadendla Manohar: There is no problem with cooking gas in the state.
బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు
గ్యాస్ ఎల్పీజీ అక్రమంగా బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా జిల్లాలవారీగా చర్యలు తీసుకోవాలనీ ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రానికి అందుబాటులో ఉన్న గ్యాస్ నిల్వల గురించి అధికారులతో మంత్రి నాదెండ్ల చర్చించారు. గృహ అవసరాలకు గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అవసరం అయితే వాణిజ్య అవసరాలకు అందించే ఎల్పీజీ గ్యాస్ను ప్రాధాన్యతల ప్రకారం అందించే ఏర్పాటు చేస్తామని వివరించారు.
సరఫరా వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ
హెచ్ పీసీ విశాఖపట్నం రిఫైనరీ, మంగళూరు నుంచి వచ్చే హస్సన్ చర్లపల్లి పైపులైను, విశాఖలోని హెచ్ పీసీ, బీపీసీ, ఐఓసీల ద్వారా రాష్ట్రం నుంచి సరఫరా అవుతున్న గ్యాస్ సరఫరాపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని నాదెండ్ల పేర్కొన్నారు. అంతేకాకుండా రోజువారీ అవసరాలకు సరిపడా నిల్వల్లో ఏ మాత్రం తేడా వచ్చినా, ప్రత్యామ్నాయంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ముందుకు వెళ్తామని నాదెండ్ల స్పష్టం చేశారు. ప్రత్యేక నిఘా బృందాలను నియమించుకొని గ్యాస్ పక్కదోవ పట్టకుండా జాయింట్ కలెక్టర్లు నియంత్రించాలని ఇష్టానుసారం ధరలు పెంచినా, వదంతులు వ్యాప్తి చేసినా సరే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. గ్యాస్ సరఫరాపై ప్రత్యేక దృష్టి ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా సరఫరా చైన్ ను పర్యవేక్షిస్తూ, ఎక్కడైనా సరఫరాలో లోపాలు వస్తే వెంటనే సరిదిద్దే ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి నాదెండ్ల ఆదేశించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: