📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

America:”వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్” లిస్టులో 89 మంది భారతీయులు

Author Icon By Vanipushpa
Updated: February 6, 2026 • 4:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అగ్రరాజ్యం అమెరికా(America) తాజాగా ఆదేశ నేరస్థుల జాబితాను విడుదల చేసింది. ముఖ్యంగా తమ దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా మారిన “వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్” (అత్యంత ప్రమాదకరమైన) నేరగాళ్ల జాబితాను హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ జాబితాలో ఇతర దేశీయులతో పాటు 89 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా ఉండడం గమనార్హం కాగా.. ప్రస్తుతం ట్రంప్ సర్కారు వీరిని సామూహికరంగా బహిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది.

Read Also: Railway News: హోలీ పండుగకు రైల్వే శుభవార్త

America:”వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్” లిస్టులో 89 మంది భారతీయులు

25,000 మంది నేరచరిత్ర కలిగిన అక్రమ వలసదారులు

అమెరికా ప్రభుత్వం కొత్తగా WOW.DHS.GOV అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. వరెస్ట్ ఆఫ్ ద వరెస్ట్ (WOW) పేరుతో రూపొందించిన ఈ డేటాబేస్‌లో సుమారు 25,000 మంది నేరచరిత్ర కలిగిన అక్రమ వలసదారుల వివరాలను పొందుపరిచారు. ఇందులో నేరగాళ్ల పేర్లు, ఫోటోలు, వారు చేసిన నేరాలు, వారి జాతీయతను కూడా బహిరంగంగా ఉంచారు. “అమెరికన్ల ప్రాణాలతో ఆడుకుంటున్న రాక్షసులను వీధుల నుంచి ఎలా తొలగిస్తున్నామో ప్రజలు స్వయంగా చూడాలనే” ఉద్దేశంతోనే ఈ వెబ్‌సైట్‌ను తెచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ జాబితాలో ఉన్న 89 మంది భారతీయులపై హత్యలు, అత్యాచారాలు, డ్రగ్స్ ట్రాఫికింగ్, దొంగతనాలు, హిట్ అండ్ రన్ కేసులు, మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు అమెరికాలో తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి కారణమై ముగ్గురు మృతికి కారకుడైన హర్నీత్ సింగ్, ఉగ్రవాద సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్‌‌ప్రీత్ సింగ్ వంటి వారి పేర్లు కూడా ఈ జాబితాలో ప్రముఖంగా కనిపిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

America crime list deportation issues Homeland Security Indian nationals Telugu News Paper Telugu News Today US Immigration worst of the worst list

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.