📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Amaravati: గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

Author Icon By Rajitha
Updated: March 10, 2026 • 12:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Amaravati: రాజధానిలో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఏర్పాటు చేసిన అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎజిఐసిఎల్)కు స్వయం ప్రతిపత్తి కల్పించారు. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకూ సిఆర్డిఏ పరిధిలో ఉన్న ఎజిఐసిఎల్ ఇక నుండి నేరుగా పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యాన పనిచేయనుంది. దీనికోసం స్థానిక సంస్థల స్వయం ప్రతిపత్తి రంగ సంస్థల లిస్టులో 25వ శాఖగా దీన్ని గుర్తించింది. 24వ శాఖగా రెరా ఉంది. దీనికోసం ఎపి పరిపాలనా నిబంధనలు 2018లోని రెండో షెడ్యూలుకు సవరణలు కూడా చేసింది.

Read also: Lokesh : నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

Autonomy granted to Growth and Infrastructure Corporation Limited

అధికారాల బదిలీ మరియు రాజ్యాంగ సవరణలు

అమరావతి అభివృద్ధికి సంబంధించి ఏర్పాటు చేసే ప్రాజెక్టులతో ఎజిఐసిఎల్ నేరుగా ఒప్పందాలు చేసుకోవడం, చర్చలు జరపడం ద్వారా ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 166 క్లాజ్(2),(3) ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి గవర్నర్ ఈ సవరణలు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక నుండి ప్రత్యేక ప్రాజెక్టుల రూపకల్పన, అమలు బాధ్యతలు కూడా ఎజిఐసిఎల్ చూస్తుంది.

నిర్మాణ సంస్థల ప్రస్థానం

అమరావతి రాజధాని నిర్మాణం కోసం 2014 డిసెంబర్లో జిఓ ఇవ్వడంతోపాటు అప్పటి వరకూ ఉన్న ఉడాని క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(సిఆర్ డిఏ)గా మార్పు చేశారు. అనంతరం అమరావతి డెవలప్మెంట్ కంపెనీ, అమరావతి బిల్డింగ్ కనస్ట్రక్షన్ అండ్ మెయింటినెన్స్ కంపెనీ అమరావతి ఇండిస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, అమరావతి ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్, స్కిల్ అకాడమీ, అమరావతి యుటిలిటీస్ కంపెనీ, అమరావతి గ్రోత్ కారిడార్ కంపెనీ, ట్రాన్స్పోర్ట్ కంపెనీ, యుటిలిటీస్ కంపెనీ, పవన్ కంపెనీ, అమరావతి అర్బన్ ప్లానింగ్ డిజైనింగ్ ఇనిస్టిట్యూట్ క్యాపిటల్ సిటీ డెవపల్మెంట్ అండ్ మేనేజ్ మెంట్ కంపెనీ సిసిడిఎంసి రవాణా కోసం అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. వీటితోపాటు అమరావతి డెవలవ్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎడిసిఎల్)ను ఏర్పాటు చేశారు.

స్వయం ప్రతిపత్తితో పెరగనున్న బాధ్యతలు

ప్రస్తుతం పనులను సిఆర్డీఏ, ఎడిసిఎల్ చూస్తున్నాయి. టెండర్లు, లావాదేవీలన్నీ కూడా ఆయా కంపెనీల ద్వారానే నిర్వహిస్తున్నారు. వీటితోపాటు గతేడాది అక్టోబరు ఏడోతేదీన ఎజిఐసిఎల్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొత్తగా ఈ సంస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించారు. దీంతో రెరా మాదిరిగానే ఇది కూడా స్వయంగా కార్యాకలాపాలు నిర్వహించనుంది. దీనికోసం ఇప్పటికే ఎమ్ఎగా మాజీ ఐఎఎస్ శంటి వెంకట రత్న శ్రీనివాస్ ను నియమించారు.

చేపట్టబోయే ప్రాజెక్టులు

ఎజిఐసిఎల్ ద్వారా రాజధాని పరిధిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహం, స్మార్ట్ ఇండిస్టీస్, ఐకానిక్ బ్రిడ్జి, స్పోర్ట్స్ సిటీ, రివర్ంట్ డెవలప్మెంట్, రోపేవే, ఇన్నర్ రింగురోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీనిలో రివర్ ఫ్రంట్ ఏర్పాటుకు అవసరమైన డిపిఆర్ తయారీ కోసం కన్సల్టెన్సీని నియమించేందుకు టెండర్లను కూడా ఆహ్వానించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AGICL Amaravati AP Capital Infrastructure latest news Telugu News Urban Development

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.