India: AI భూకంపం.. భారత ఐటీ కంపెనీలకు డేంజర్ బెల్స్

Read Time:  1 min
AI భూకంపం.. భారత ఐటీ కంపెనీలకు డేంజర్ బెల్స్
AI భూకంపం.. భారత ఐటీ కంపెనీలకు డేంజర్ బెల్స్
FONT SIZE
GET APP

ఐటీ రంగానికి షాకింగ్ న్యూస్.. ఆంత్రోపిక్ దెబ్బకు కుదేల్ అయిన ఐటీ రంగం ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. గత 30 రోజుల్లో భారత ఐటీ సేవల రంగం కోట్ల రూపాయల మార్కెట్ విలువను కోల్పోయిన సంగతి విదితమే. మార్కెట్ విలువ దాదాపు 50 బిలియన్ డాలర్లు తగ్గి దాదాపు రూ.4.5 లక్షల కోట్లకు చేరుకుంది. తాజాగా ఈ పతనానికి మరింత ఆందోళనకర అంశాలను జోడిస్తూ సిట్రిని రీసెర్చ్ సంచలన నివేదికను విడుదల చేసింది. 2028లో కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఆటోమేషన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపివేసే స్థాయికి చేరుతుందని సిట్రిని రీసెర్చ్ విడుదల చేసిన ఒక ఊహాజనిత నివేదిక తీవ్ర చర్చకు దారితీసింది. ది 2028 గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్ – ఎ థాట్ ఎక్సర్‌సైజ్ ఇన్ ఫైనాన్షియల్ హిస్టరీ, ఫ్రమ్ ది ఫ్యూచర్ అనే ఈ నివేదికలో.. సహ రచయిత అలాప్ షా, AI వలన ఏర్పడే సాంకేతిక అంతరాయం భారత ఐటీ దిగ్గజాలకు పీడకల దృశ్యంగా మారవచ్చని హెచ్చరించారు. తీవ్రమైన AI-ఆధారిత ఆర్థిక షాక్‌ను వివరిస్తుంది. ఇందులో వేగవంతమైన ఆటోమేషన్ కారణంగా భారీ స్థాయిలో వైట్-కాలర్ ఉద్యోగాల తొలగింపులు జరుగుతాయని, వినియోగదారుల డిమాండ్ తగ్గుతుందని, దాంతో ప్రపంచ మార్కెట్లు తీవ్ర అస్థిరతకు గురవుతాయని పేర్కొంది.

Read Also: Amazon: బెంగళూరులో అమెజాన్ కొత్త కార్యాలయం..భారీగా ఉద్యోగాలు

India: AI earthquake.. Danger bells for Indian IT companies
India: AI earthquake.. Danger bells for Indian IT companies

అమెరికాలో నిరుద్యోగం 10 శాతానికి చేరుతుంది

ప్రత్యేకంగా పెద్ద డెలివరీ బృందాలపై ఆధారపడే భారత ఐటీ అవుట్‌సోర్సింగ్ కంపెనీలకు ఈ మార్పు అత్యంత ప్రమాదకరమని నివేదిక చెబుతోంది. Tata Consultancy Services, Infosys, Wipro వంటి సంస్థలు, AI ఆధారిత ఆటోమేషన్ వల్ల తమ సంప్రదాయ వ్యాపార నమూనా పూర్తిగా దెబ్బతినే ప్రమాదంలో ఉన్నాయని విశ్లేషించింది. ఈ ఊహాజనిత దృశ్యం ప్రకారం.. అమెరికాలో నిరుద్యోగం 10 శాతానికి చేరుతుందని.. అలాగే S&P 500 సూచీ 2026 గరిష్ట స్థాయి నుంచి దాదాపు 38 శాతం పడిపోతుందని అంచనా వేసింది. కంపెనీలు మిడ్-స్కిల్ ఉద్యోగులను AI ఏజెంట్లతో భర్తీ చేయడం వల్ల మొదట్లో లాభాలు పెరిగినా.. మధ్యతరగతి ఆదాయాలు క్షీణించి ఘోస్ట్ GDP అనే పరిస్థితి ఏర్పడుతుందని నివేదిక హెచ్చరిస్తోంది. ప్రపంచ దేశాలకు చైనా బిగ్ షాక్.. AI లో నంబర్‌ వన్‌గా డ్రాగన్.. రివర్స్ AI ట్రేడ్ చేస్తున్న భారత్.. AI కోడింగ్ ఏజెంట్ల ఉపాంత ఖర్చు కేవలం విద్యుత్ ఖర్చు స్థాయికి పడిపోతుందని, దాంతో లెగసీ IT కంపెనీలు కాంట్రాక్ట్ రద్దులను ఎదుర్కొంటాయని సిట్రిని అంచనా వేసింది. ఈ ప్రక్రియ 2027 నాటికి వేగవంతమవుతుందని పేర్కొంది. భారతదేశానికి కీలకమైన ఐటీ సేవల రంగం ఏటా 200 బిలియన్ డాలర్లకు పైగా ఎగుమతులు చేస్తోంది. ఇది దేశ కరెంట్ అకౌంట్ మిగులుకు ప్రధాన ఆధారం. అయితే, 2028 నాటికి ఈ రంగంపై ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉంటే.. కేవలం నాలుగు నెలల్లోనే రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 18 శాతం వరకు పడిపోతుందని నివేదిక అంచనా వేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.