📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

PM Modi: మానవ వికాసానికి ఏఐ అవకాశం..ఆటంకం కాదు

Author Icon By Vanipushpa
Updated: February 19, 2026 • 3:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏఐ( కృత్రిమ మేధ) మానవ వికాసానికి అటంకంగా చూడరాదని, అవకాశంగా పరిగణించాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. మానవ అభివృద్ధిలో ఏఐ కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు. ఏఐ(AI) సామర్థ్యం మన ఆలోచనలకు అందనంత దూరంలో ఉందని, ఏఐ వినియోగం చట్టబద్ధంగా, పునఃసమీక్షించేలా ఉండాలని సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతోన్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు’ లో గురువారం ప్రధాని మోదీ ప్రసంగించారు. మేకిన్‌ ఇండియా, భారత ఆవిష్కరణ సామర్థ్యాన్ని ఈ సదస్సు చాటుతోందని పేర్కొన్నారు.

Read Also: Bill Gates: చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో బిల్ గేట్స్ భేటీ

PM Modi: AI is an opportunity for human development…not a threat

మనం ఏఐని శాసించాలి: మోదీ

ఏఐ కృత్రిమ మేధ మనల్ని కాదు.. మనం ఏఐని శాసించాలి అని మోదీ వివరించారు. మానవ కేంద్రీకృత ఏఐ నిర్మాణం మన లక్ష్యం కావాలని, ఏఐ పరివర్తన శక్తిగా కొనసాగుతుందని.. దాన్ని దుర్వినియోగం చేస్తే విధ్వంసానికి దారితీస్తుంది అని, దానిని సద్వినియోగం చేసుకుంటే అనేక సమస్యలకు పరిష్కారాలు చూపుతుందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఆరోవంతు జనాభా భారత్‌లోనే ఉంది అని, భారత కృత్రిమ మేధను, కొత్త సాంకేతికను అందిపుచ్చుకోవడంలో ఆసక్తి చూపుతుందని తెలిపారు. భారత్‌ ఏఐ పురోభివృద్ధిలో ఒక చరిత్రగా నిలుస్తుంది అన్నారు. మనుషులు, సాంకేతికత కలిసి అభివృద్ధి పయనం సాగించే శకంలో మనం ఉన్నామని, భవిష్యత్తులో ఏఐ ఏం చేయగలదో కాదు.. ప్రస్తుతం కృత్రిమ మేధను ఉపయోగించి మనం ఏం చేయగలమనేదే అసలు ప్రశ్నగా చూడాలని, ప్రజల సంక్షేమం, శ్రేయస్సే ఏఐకి మన బెంచ్‌ మార్క్‌లు అని ప్రధాని తెలిపారు. కృత్రిమ మేధ(ఏఐ) వినియోగంలో ‘మానవ్‌విజన్‌’ ఉండాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ విజన్‌ అర్థం, ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ఆయన వివరించారు. మానవ విజన్ లోని M – మోరల్‌ అండ్‌ ఎథికల్‌ సిస్టమ్‌: నైతిక విలువలు, బాధ్యతలను పరిగణనలోకి తీసుకుని ఏఐ వ్యవస్థలకు మార్గనిర్దేశం అని తెలిపారు. A – అకౌంటబుల్‌: పారదర్శక నిబంధనలతో, జవాబుదారీతనంతో ఏఐ వ్యవస్థలు పనిచేయాలని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AI and human development AI innovation AI opportunities Artificial intelligence Digital Transformation ethical AI future of work Latest News in Telugu technology and society Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.