Older generation : వృద్ధతరం భారం కాదు.. హారమే!

Read Time:  1 min
Older generation
Older generation
FONT SIZE
GET APP

భారతదేశం అంటేనే నవయవ్వనానికి చిరునామా. ప్రపంచమంతా ముసలితనంతో వణికిపోతుంటే, మన దేశం మాత్రం తన ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’ (యువ శక్తి)తో దూసుకుపోతుందని మనం ఇప్పటివరకు గర్వంగా చెప్పుకున్నాం. కానీ, తెర వెనుక దృశ్యం వేగంగా మారిపో తోంది. వెండి వెలుగుల వెనుక ముంచుకొస్తున్న చీకటిలా.. భారత్లో వృద్ధుల జనాభా (Older generation) పెరగడం, జననాల రేటు తగ్గడం అనేది రానున్న రెండు దశాబ్దాల్లో దేశం ఎదుర్కోబోయే అతిపెద్ద సామాజిక, ఆర్థిక సవాలు కానుంది. గడిచిన దశాబ్ద కాలంలో దేశంలో సంతానోత్పత్తి రేటు (టిఎస్ఆర్) గణనీయంగా పడిపోయింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్చ్ఎస్5) లెక్కల ప్రకారం, భారత సగటు సంతానోత్పత్తి రేటు ఇప్పుడు 2.0కు చేరుకుంది. అంటే, జనాభా స్థిరంగాఉండటానికి అవసరమైన 2.1 శాతం కంటే ఇది తక్కువ. దీని అర్థం ఏమిటంటే, భవిష్యత్తులో మన దేశంలో పిల్లల సంఖ్య తగ్గి, వయసు పైబడిన
వారి సంఖ్య అమాంతం పెరగబోతోంది. గణాంకాలను లోతుగా పరిశీలిస్తే, 2021 నాటికి దేశ జనాభాలో 60 ఏళ్లు పైబ డిన వారు సుమారు 10.1 శాతంగా ఉండగా, 2036 నాటికి ఇది 15 శాతానికి, 2050 నాటికి ఏకంగా 20 శాతానికి చేరుతుందని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యుఎన్ఎఫ్ఎఎ) నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మెరుగైన వైద్య సదుపాయాలు, పెరిగిన ఆయుర్దాయం ఒక రకంగా శుభపరిణామమే అయినా, దానికి తగ్గట్టుగా మన సామాజిక వ్యవస్థలు సిద్ధంగా లేకపోవడమే అసలైన ఆందోళన. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల నీడలో వృద్ధాప్యం హాయి గా,
భరోసాగా గడిచేది. కానీ నేడు సమాజం పూర్తిగా ‘అణు కుటుంబాల’ (న్యూక్లియర్ ఫ్యామిలీస్) మయమైపోయింది. ఉపాధి కోసం, ఉన్నత చదువులకోసం యువత పట్టణాలు, విదేశాలకు తరలిపోతుండటంతో పల్లెల్లోనూ, నగరాల్లోనూ వృద్ధులు ఒంటరివారవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఎమీ నెస్ట్ ‘సిండ్రోమ్’ అనే మానసిక రుగ్మత నేడు భారతీయ ఇళ్లలోకి నిశ్శబ్దంగా ప్రవేశిస్తోంది. పిల్లలు దూరమయ్యాక ఖాళీ అయిన ఇళ్లలో, ఒంటరితనంతోకుమిలిపోతున్న వృద్ధుల సంఖ్య పెరగడం భవిష్యత్తులో తీవ్రమైన మానసిక ఆరోగ్య సంక్షోభానికి దారితీయవచ్చు. ఈ విపత్కర పరిస్థితుల్లోనే సిల్వర్ఎ కానమీ’ అనే సరికొత్త ఆర్థిక కోణంపై చర్చ మొదలవ్వాలి. వృద్ధులను కేవలం సామాజిక భారంగా చూడకుండా, వారి అవసరాలను ఒక ఆర్థిక చోదక శక్తిగా మలచుకోవడమే ఈ వ్యవస్థ ఉద్దేశ్యం. తల నెరిసిన వృద్ధుల సంఖ్య(Older generation) పెరగడం వల్ల వారి కోసం ప్రత్యేకమైన ఉత్పత్తులు, సేవలకు డిమాండ్పెరుగుతుంది.

Read Also : Rajasthan Air Show: వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి

Older generation
Older generation

జపాన్, జర్మనీ వంటి దేశాలు ఇప్పటికే వృద్ధాప్యానికి అనువైన గృహ నిర్మాణాలు, ప్రత్యేక ఆరోగ్య పరికరాలు, వృద్ధులకు సరిపడే పౌషకాహారం, వినోద సాధనాల ద్వారా భారీ ఎత్తున సిల్వర్ మార్కెట్’ను సృష్టించాయి. భారత్ కూడా వృద్ధులను కేవలం పెన్షన్ల మీద ఆధారపడే వర్గంగా కాకుండా, ఉత్పాదక రంగంలో భాగస్వాములుగా మార్చాలి. శారీరక శక్తి ఉన్నంత వరకు వారి అనుభవాన్ని వాడుకోవడా నికి ప్రభుత్వాలు ‘రీస్కిల్లింగ్కా ర్యక్రమాలను చేపట్టాలి. ఆర్థిక కోణంలో చూస్తే యువత శాతం తగ్గడం వల్ల దేశ ఉత్పాదకత దెబ్బతినే ప్రమాదం ఉంది. పన్నులు కట్టే శ్రామిక శక్తితగ్గి, ప్రభుత్వం నుండి సాయం ఆశించే వృద్ధుల సంఖ్య పెరిగితే ఖజానాపై మోయలేని భారం పడుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో సంతానోత్పత్తి రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉండటం వల్ల, ఉత్తరాది కంటే ముందే దక్షిణాది రాష్ట్రాలు వృద్ధాప్యం వైపు అడుగులు వేస్తున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన వంటి రాజ కీయ అంశాల్లోనూ అసమానతలు తలెత్తవచ్చు. వైద్య
రంగంపై ఒత్తిడి కూడా ఊహాతీతం కానుంది. మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వృద్ధుల కోసం ప్రత్యేకమైన ‘జెరియాట్రిక్’కేర్’ (వృద్ధాప్య వైద్యం) వ్యవస్థలు మన దగ్గర ఇప్పటికీ శైశవ దశలోనే ఉన్నాయి. ఈ ముప్పును ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇప్పటి నుంచే సమగ్రమైన జాతీయ వృద్ధాప్య విధానాన్ని (నేషనల్ పాలసీ ఫర్ ఓల్డర్ పీపుల్స్) పటిష్టం చేయాలి. కేవలం పెన్షన్ నిధులు పెంచడం పరిష్కారం కాదు. ప్రతి జిల్లా కేంద్రం లోనూ అత్యాధునిక వృద్ధాశ్రమాలు, డేకేర్ సెంటర్లు, హోమ్కేర్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలి. సామాజికంగా చూస్తే, వృద్ధులను భారంగా కాకుండా ఒక ‘జ్ఞాన నిధి’గా చూసే సంస్కృతిని పాఠశాల స్థాయి నుంచే పిల్లల్లో పెంపొందించాలి. యువత కొరతను అధిగమించేం దుకు పరిశ్రమల్లో ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతలను అందిపుచ్చుకోవాలి. జనాభా లాభం (డెమోగ్రఫీ డివిడెండ్) అనేది ఎల్లకాలం ఉండదు. అది ‘జనాభా భారం’ (డెమోగ్రఫీ బర్)గా మారకముందే మేల్కొ నడం మనందరి బాధ్యత. మనసున్న సమాజంగా మనం వృద్ధాప్యానికి భరోసానిచ్చినప్పుడే, అభివృద్ధి చెందిన భారత్ కల సాకారమవుతుంది.

-మర్రాపు వసుంధరా దేవి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.