📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Adulterated milk : కాటేస్తున్న కల్తీపాలు

Author Icon By Sudha
Updated: February 24, 2026 • 3:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కల్తీ, కల్తీ.. ఎటుచూసినా కల్తీ. ఇక్కడ, అక్కడ అని కాదు. తాగే నీటిలో కల్తీ, పాలల్లో కల్తీ, తినే పప్పులో కల్తీ, ఉప్పులో కల్తీ, విత్తనాల్లో కల్తీ, నూనెలో కల్తీ, చివరకు ప్రాణాపాయస్థితి నుండి కాపాడే అత్యవసర మందుల్లో కల్తీ, అది, ఇది అనికాదు. ఎక్కడ చూసినా కల్తీమయం అయిపోతున్నది. ఇది కలి యుగం కాదు, కల్తీయుగంగా మారిపోతున్న దేమోననిపిస్తు న్నది. రానురాను కల్తీ మనిషి మనుగడకే ప్రమాదంవాటిల్లే సూచనలు కన్పిస్తున్నాయి. అన్నిటి కంటే ముఖ్యంగా పసి పిల్లల నుండి వయోవృద్ధుల వరకు నిత్యంవాడే పాలల్లో కల్తీ రానురాను తీవ్రరూపం దాల్చడం ఆందోళన కలిగించే అంశం. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా, రాజమహేంద్ర వరంలో కల్తీపాలు (Adulterated milk) తాగి ఇప్పటికే నలుగురు మరణించగా, మరో పన్నెండు మందివరకు ఆస్పత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. లాలాచెరువు సమీపాన చౌడేశ్వరీనగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల పదిహేనో తేదీ శివరాత్రి రోజు నుండి కొంద రికి వాంతులు అవడం, మూత్ర విసర్జన కాకపోవడంతో పొట్ట ఉబ్బడం తదితర సమస్యలతో దాదాపు పధ్నాలుగు మంది ఒక్కొక్కరుగా వివిధ ఆస్పత్రు ల్లో చేరారు. వీరిలో ఇద్దరు ఆదివారం మృతిచెందగా, మరో ఇద్దరు నేటి తెల్ల వారుజామున మృతిచెందారు. బాధితుల్లో ఎక్కువ మంది అరవైయేళ్లు పైబడిన వారే కాగా, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనారోగ్యా నికి గురికావడం, ఈ సంఖ్య అంతకంతకు పెరుగుతుండ డంతో ఆదివారం అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రులపాలైన బాధితులందరికీ ఒకేవ్యక్తి పాలు పోస్తుండటంతో అక్కడ కల్తీ జరిగి ఉండవచ్చునని అనుమానిస్తు న్నారు. ఆవ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారి స్తున్నారు. పాలల్లో కల్తీ జరగడం తెలుగు రాష్ట్రాల్లో ఇది మొదటిసారి కాదు. చివరిది కూడా కాకపోవచ్చు.

Read Also: Indian Railways: ఆదాయంలో రికార్డులు సృష్టిస్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్

Adulterated milk

గతంలో తెలంగాణలోనల్గొండజిల్లాలో ఒక వ్యాపారి ఇంటిపై దాడి చేసి యూరియా, డిటర్జెంట్ వంటి రసాయనికాలతో తయారు చేసిన కృత్రిమపాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే కాదు తరుచుగా వివిధ ప్రాంతాల్లో కల్తీ పాలు (Adulterated milk)పట్టుబడుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా సేకరించిన ప్రతి మూడు పాల నమూనాల్లో ఒక దాంట్లో కల్తీ ఆనవాళ్లు కనపడుతున్నట్లు నిర్ధారించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో కూడా పాల ఉత్పత్తికి, వినియోగానికి తేడా అంతకంతకు పెరిగి పోతున్నది. దీని భర్తీ చేసేందుకు రసాయనికాలతోకూడిన పాలతోపాటు రకరకాల మార్గా లలో కల్తీపాలను పెంచు కుంటున్నారు. కొందరు వ్యాపా రులు పశువుల్లో కృత్రిమంగా పాలఉత్పత్తిని పెంచేందుకు అత్యంత ప్రమాదకరంగా ఆక్సోడూసిన్ ఇంజక్షన్లు విచ్చ ల విడిగా వాడుతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి భారీ గా తెప్పించి ఒక ముఠా పాల ఉత్పత్తిదారులకు సరఫరా చేస్తున్న వైనాన్ని, ఔషధ నియంత్రణ అధికారులువలపన్ని గతంలో పట్టుకున్నారు. ఈఇంజక్షన్లు చేయడం వల్ల గెదె సహజంగా ఇచ్చే పాలకంటే రెండు, మూడు రెట్లు ఎక్కు వగా ఇస్తాయంటున్నారు. దీంతో పాల ఉత్పత్తిదారులు కొందరు ఇంజక్షన్లు ఇచ్చి తమ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అవలంబిస్తున్నారు. కానీ ఈ ఇంజక్షన్ ఇచ్చిన గెదెల పాలు తాగడం వల్ల హార్మన్ల సమతుల్యత దెబ్బ తింటుందని, చిన్నతనంలోనే మోకాళ్ల సమస్యలు, తదితర శారీరక రుగ్మతలు సంభవించే అవకాశాలున్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఎంతోకాలంగా ఇలాంటివ్యాపారులు కొందరు పాలశీతల కేంద్రాలకుకూడా సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు కూడాఉన్నాయి.

Adulterated milk

గ్రామాల నుండి పాలు తీసుకొనివచ్చి అమ్ముకునేవారు ఎక్కడ పడితే అక్కడ ఏ నీళ్లు అంటే ఆ నీళ్లు కలుపుతున్నారు. ఫ్లోరైడ్ తదితర రసాయనాలు ఉన్ననీళ్లను కలపడంతో ప్రజారోగ్యంపై తీవ్రప్రభావం పడుతున్నది. ఉత్పత్తికి, డిమాండుకు ఉన్న లోటును భర్తీచేసేందుకు ప్రభుత్వపరం గా త్రికరణశుద్ధిగా ప్రయత్నాలు జరగడంలేదనేచెప్పొచ్చు. పాల ఉత్పత్తిని పెంచేందుకు పాలకులు ప్రవేశపెడుతున్న పథకాలు విఫలమవుతున్నాయి. భారీఎత్తున చిన్న, సన్న కారు రైతులకు సమృద్ధిగా పాలుఇచ్చే సంకరజాతి ఆవుల ను, బర్రెలను ఏనాటినుంచో సరఫరా చేస్తూనే ఉన్నారు. కానీ ఆ రైతులు అవసరమైన మౌలికవసతులు కల్పించక పోవడంతో ఎనభై శాతంపైగా గిట్టుబాటుకాక ఆ రైతులు పాడిపశువులను అమ్ముకున్నారు. అందుకే గ్రామాలనుంచి పాల ఉత్పత్తి అంతకంతకు తగ్గిపోతున్నది. ఇప్పుడు నగ రాల నుంచి గ్రామాలకు ప్యాకెట్ పాలు సరఫరా చేయాల్సిన దురదృష్టపు పరిస్థితులు దాపురించాయి. ప్రైవేట్ డెయిరీలు విజృం భించిపోతున్నా అదేసమయంలో సహకారం రంగం నడుస్తున్న అతిపెద్ద డెయిరీలు నష్టాలబాటలో మూసివేతకు దగ్గరలో ఉన్నాయి. కొన్నిమూసివేశారుకూడా. పాలకుల వద్ద ఒక నిర్దిష్టమైన ప్రణాళికలులేవు. రైతులకు ప్రోత్సాహకాలు మాటలవరకే పరిమితమవుతు న్నాయి. ప్రజావసరాలను దృష్టిలో ఉంచుకొని ఒకస్పష్టమైన ముం దస్తు ప్రణాళిక ప్రకారం పాలఉత్పత్తిని పెంచే చర్యలు తీసు కోవడంలో పాలకులు విఫలమ వుతున్నారనడంలో సందే హం లేదు. మన పూర్వీకులు ఈ విషయంలో ఎంతో ముందుచూపుతో వ్యవహరించారని చెప్పొచ్చు. మహాత్ముడు కూడా వ్యవసాయ అనుబంధ రాబడి పెంచితేతప్ప కోట్లా ది గ్రామీణ పేదల ఆర్థిక పరిస్థితి మెరుగుపడదని ఎన్నో సార్లు వక్కాణించారు. పాలఉత్పత్తి అందుకు ఒక మార్గం. కానీనేటి పాలకులు దాన్ని విస్మరిస్తున్నారు. ఫలితంగాపాల కల్తీ పెరిగిపోతున్నది. ఇదేపరిస్థితి కొనసాగితే కొరత తీవ్ర రూపందాల్చి దాన్ని భర్తీచేసేందుకు దళారులు కల్తీమార్గం లో విజృంభిస్తారు. ఇది మనిషి మనుగడకే ప్రమాదకరం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Adulterated milk Breaking News fake milk Food Safety Awareness latest news Milk Adulteration milk safety Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.