📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Gulf: భారతీయులను తీసుకురావడానికి బయలుదేరిన 58 విమానాలు

Author Icon By Vanipushpa
Updated: March 4, 2026 • 12:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రతరమవుతున్నాయి. అనేకమంది భారతీయులు గల్ఫ్(Gulf) దేశాల్లో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి భారత ప్రభుత్వం భారీ స్థాయిలో చర్యలు చేపట్టింది. ఈ ప్రత్యేక తరలింపు కార్యక్రమంలో భాగంగా.. భారత విమానయాన సంస్థలు ఒక్కరోజులోనే 58 ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ ఆపరేషన్ ద్వారా వేలాది మంది ప్రయాణికులు భారత్‌కు తిరిగి చేరుకునే అవకాశం లభించనుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రత్యేక విమానాల్లో IndiGo అత్యధికంగా 30 విమానాలను నడుపుతోంది. అలాగే ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కలిపి మొత్తం 23 ప్రత్యేక సర్వీసులను నిర్వహిస్తున్నాయి. అదనంగా.. ఇతర భారతీయ విమానయాన సంస్థలు కూడా అవసరాన్ని బట్టి తమ సేవలను అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also: Aga Syed Ruhullah Mehdi: శ్రీనగర్ ఎంపీ అగా సయ్యద్ పై కేసు నమోదు?

58 flights have left to bring back Indians

ఉద్రిక్తతల వల్ల సాధారణ విమాన సర్వీసులు అంతరాయం

పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల సాధారణ విమాన సర్వీసులు అంతరాయం కలగడంతో, ఈ ప్రత్యేక విమానాలు కీలకంగా మారాయి. పశ్చిమాసియాలోని అనేక దేశాలు భద్రతా కారణాలతో తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేయడం లేదా కఠిన ఆంక్షలు విధించడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న భారతీయులను వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించడమే ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక Flights ప్రధానంగా దుబాయ్, ఫుజైరా వంటి నగరాల నుంచి బయలుదేరి, న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, కొచ్చి, అహ్మదాబాద్, తిరువనంతపురం వంటి కీలక భారతీయ నగరాలకు చేరుకుంటున్నాయి. ఇరాన్‌పై యుద్ధంతో ఖాళీ అవుతున్న అమెరికా ఖజానా.. తొలి 24 గంటల్లోనే రూ. 7 వేల కోట్లకు పైగా ఖర్చు.. ప్రస్తుతం దుబాయ్ గగనతలం పాక్షికంగా మాత్రమే అందుబాటులో ఉండటంతో.. పరిమిత సంఖ్యలోనే విమానాలకు అనుమతులు ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, ప్రయాణికులు తమ విమాన సంస్థ నుంచి స్పష్టమైన బయలుదేరే సమయ సమాచారం అందిన తర్వాత మాత్రమే విమానాశ్రయానికి రావాలని అధికారులు సూచించారు. ముందస్తుగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం లేదా అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయాలకు వెళ్లవద్దని స్పష్టంగా హెచ్చరించారు. మరోవైపు అబుధాబి నుంచి తమ విమాన కార్యకలాపాలను మార్చి 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎతిహాద్ ఎయిర్‌వేస్ (Etihad Airways) ప్రకటించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Air India rescue operation Gulf crisis evacuation Indian diaspora safety Indian evacuation mission Indian government mission Middle East war evacuation Ministry of External Affairs repatriation of citizens special flights for Indians Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.