దేశంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. రాబోయే నెలల్లో గోల్డ్ రేట్ రూ. 2 లక్షల మార్క్ దాటే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే అసలు ఏరోజుకారోజు బంగారం ధరలు నిర్ణయించేది ఎవరు? బంగారం ధరలు ఒక్కో ఊరిలో ఒక్కోరకంగా ఎందుకు ఉంటాయి? తెలుసుకుందాం. బంగార ధర ప్రతి చోటా ఒకేలా ఉండదు. దేశంలోని ఒక్కో నగరంలో ఒక్కో ధర ఉంటుంది. స్థానిక జ్యువెలర్స్ అసోసియేషన్ల రూల్స్ ప్రకారం అలాగే స్టేట్ ట్యాక్స్‌లకు అనుగుణంగా బంగారం ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. అయితే ఈ మార్పు మరీ ఎక్కువగా ఉండదు. నగరాన్ని బట్టి కొద్ది స్థాయిలో మాత్రమే ధరల్లో మార్పులు కనిపిస్తాయి. వీటిని స్పాట్ రేట్స్ అంటారు. స్పాట్ రేట్స్ ను లోకల్ బులియన్ అసోసియేషన్స్ నిర్ణయిస్తాయి.
Read Also: http://Today Gold Rate 21/10/25 : దీపావళి తర్వాత బంగారం, వెండి రేట్లు పెరుగుతాయా?
బంగారం ధరను (Gold Rates) నిర్ణయించే వ్యవస్థను లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలను వెల్లడిస్తుంది. ఉదయం 10:30 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 3:00 గంటలకు మరోసారి బంగారం ధరలను ప్రకటిస్తుంది. దీన్ని బట్టి ప్రపంచమంతా బంగారం ధరలు అమలు అవుతుంటాయి. దేశాలు తమ టైమ్ జోన్ ప్రకారం ధరలను నిర్ణయించుకుంటాయి. భారత్ లో ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇండియన్ కరెన్సీలో ఈ ధరలను విడుదల చేస్తుంది. అయితే లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ అనేది సొంతంగా ధరలను నిర్ణయించదు. గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్, డాలర్-రూపాయి మారకం విలువ, ఇంపోర్ట్ ఫీజులు, డిమాండ్ అండ్ సప్లై వంటి అంశాలు పరిగణలోకి తీసుకుని ఈ ధరని నిర్ణయిస్తుంది. దీనికంటూ కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలుంటాయి. దాన్ని బట్టే ధరలను లెక్క కడుతుంది.బంగారం ధర (Gold Rates) ను నిర్ణయించే వ్యవస్థను లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలను వెల్లడిస్తుంది. ఉదయం 10:30 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 3:00 గంటలకు మరోసారి బంగారం ధరలను ప్రకటిస్తుంది. దీన్ని బట్టి ప్రపంచమంతా బంగారం ధరలు అమలు అవుతుంటాయి. దేశాలు తమ టైమ్ జోన్ ప్రకారం ధరలను నిర్ణయించుకుంటాయి. భారత్ లో ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇండియన్ కరెన్సీలో ఈ ధరలను విడుదల చేస్తుంది. అయితే లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ అనేది సొంతంగా ధరలను నిర్ణయించదు. గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్, డాలర్-రూపాయి మారకం విలువ, ఇంపోర్ట్ ఫీజులు, డిమాండ్ అండ్ సప్లై వంటి అంశాలు పరిగణలోకి తీసుకుని ఈ ధరని నిర్ణయిస్తుంది. దీనికంటూ కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలుంటాయి. దాన్ని బట్టే ధరలను లెక్క కడుతుంది.
బంగారం ఎక్కడ లభ్యమవుతుంది ?
బంగారం అతి తక్కువ ప్రమాణంలో నేల పొరలలో నిక్షిప్తమై ఉంది. భూమిలో బంగారం ప్రధానంగా రెండు రకాలుగా నిల్వ ఉంటుంది. ఒకటి ప్రథమ శ్రేణి, లోడ్ (Lode) నిల్వలు అనియు, ద్వితీయ శ్రేణి నిల్వలను ప్లసెర్ (placer ) అంటారు. మొదటిగా బంగారం ఆవిర్భావం గురించి రకరకాల అంచనాలు, సిద్ధాంతాలు చెలామణిలో ఉన్నాయి. బంగారం మొదటగా సూపరు నోవా నక్షత్రాలు విస్పోటనం చెందినప్పుడు పుట్టినట్లు భౌతిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బంగారం యొక్క సాంద్రత ఎక్కువ కావున భూమియొక్క కేంద్ర భాగంలోని మాగ్మాలో బంగారం అధిక మొత్తంలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
బంగారం వినియోగం?
2009 నాటికి165,000టన్నుల బంగారాన్ని గనులనుండి వెలికి తీసారు. ప్రస్తుతం లభిస్తున్న బంగారంలో 50 % ఆభరణాలు చెయ్యుటకు, 40%ను మూలధనం పెట్టుబడిగా,10%ను నాణేల తయారికి, ఇతరత్రా పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు. భారతదేశంలో విశ్వకర్మ సంతానం బంగారంతో వస్తువుల తయారీ గుడిలో నగల తయారు చేశారు. కేవలం వెండి మాత్రమే కలుపబడిన 14K, 18K బంగారం, ఆకుపచ్చ–పసుపు రంగుల మిళితంగా ఉంటుంది. దీనిని పచ్చ బంగారు అంటారు.తెల్ల బంగారు మిశ్రమ లోహాం, పల్లాడియం లేదా నికెల్ లోహాన్ని బంగారంలో కలపడం వలన ఏర్పడును.17.3 %నికెల్, 5.5%జింకు, 2.2% రాగి కలిపిన 18K బంగారు వెండిలా కనబడుతుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: