Silver price today : వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. పెట్టుబడిదారుల ఆసక్తిని విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ తెల్ల లోహం రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తోంది. ఈ జనవరి నెలలోనే ఇప్పటివరకు దాదాపు 22 శాతం వరకు పెరిగిన వెండి ధర, ప్రధాన పెట్టుబడి సాధనాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.3 లక్షల మైలురాయికి అత్యంత చేరువలో నిలిచింది.
గత శుక్రవారం MCXలో కిలో వెండి ధర రూ.2,87,762 వద్ద ముగిసింది. గమనార్హమైన విషయం ఏమిటంటే, గత ఏడాది (Silver price today) ఏప్రిల్‌లో కేవలం రూ.95,917గా ఉన్న వెండి ధర, ఇప్పటివరకు దాదాపు 200 శాతం పెరిగింది. సాధారణంగా ఇలాంటి భారీ రాబడులు మల్టీబ్యాగర్ షేర్లలోనే కనిపిస్తాయి. కానీ కమోడిటీ మార్కెట్లో వెండి ఈ స్థాయి లాభాలను అందించడం విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవలే కిలో వెండి రూ.2,92,960 వద్ద ఆల్‌టైమ్ హైను నమోదు చేసింది.
Read also : Ahmedabad Flight Crash Case : ఫ్లైట్ క్రాష్ కేసు.. AAIBకి FIP లీగల్ నోటీసులు
వెండి ధరలు ఈ స్థాయిలో పెరగడానికి అంతర్జాతీయంగా పలు కారణాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా భారీగా బంగారం కొనుగోలు చేసిన ప్రపంచ కేంద్ర బ్యాంకులు, ఇప్పుడు తమ నిల్వల్లోకి వెండినీ చేర్చుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనికి తోడు మార్కెట్లో భౌతిక వెండి సరఫరా తగ్గడం కూడా ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది.
వాస్తవానికి 2025 ప్రారంభంలో వెండిపై పెద్దగా అంచనాలు లేవు. గత ఏడాది చివరికి వెండి ధర రూ.1.10 లక్షలకు చేరుతుందని విశ్లేషకులు భావించగా, ఆ మార్కును చాలా ముందే దాటేసింది. ఆ తర్వాత కూడా ఆగకుండా రూ.2.54 లక్షల స్థాయిని అధిగమించింది. ప్రస్తుత ధరను పరిశీలిస్తే, రూ.3 లక్షల మైలురాయిని చేరుకోవడానికి వెండికి కేవలం 4 నుంచి 5 శాతం పెరుగుదల మాత్రమే అవసరం. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల చూపు ఇప్పుడు పూర్తిగా వెండిపైనే కేంద్రీకృతమైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: