Silver investment : బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో పెట్టుబడిదారులు ఇప్పుడు వెండి వైపు మొగ్గుచూపుతున్నారు. ఇటీవల కాలంలో బంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. దీంతో వెండి కూడా ఒక మంచి పెట్టుబడి మార్గంగా మారుతోంది. జ్యువెలరీ షాపుల్లో వెండి ఆభరణాలతో పాటు వెండి బిస్కెట్లు, నాణేలపై వినియోగదారుల ఆసక్తి స్పష్టంగా పెరిగింది.
గత రెండేళ్లలో బంగారంతో పోలిస్తే వెండిపై వచ్చిన రాబడి ఎక్కువగా ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఎలక్ట్రానిక్స్, సోలార్, సెమీకండక్టర్ల రంగాల్లో వెండి వినియోగం పెరగడం ధరల పెరుగుదలకు మరింత ఊతమిచ్చింది.
రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ప్రముఖ సంస్థ Amrapali Jewellery సీఈవో తరంగ్ అరోరా మాట్లాడుతూ— వినియోగదారుల డిమాండ్ (Silver investment) మేరకు తమ షాపుల్లో వెండి బిస్కెట్లు విక్రయించడం ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో వెండిని పెద్దగా పట్టించుకోకపోయినా, ఇప్పుడు పెట్టుబడి దృష్టితో ప్రజలు వెండి కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.
అలాగే 2025–26 ఆర్థిక సంవత్సరంలో వెండి బిస్కెట్లు, నాణేలు కొనుగోలు చేసే వారి సంఖ్య గత ఏడాదితో పోలిస్తే సుమారు 50 శాతం పెరిగిందని Gargi by PNGadgil & Sons కో-ఫౌండర్ ఆదిత్య మోదక్ వెల్లడించారు. బంగారం ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోవడంతో చాలామంది వెండిని ప్రత్యామ్నాయ పెట్టుబడిగా ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు.
Read also: RBI: ఇకపై వెండి వస్తువులకు కూడా బ్యాంకుల్లో తాకట్టు సదుపాయం
దీపావళి సమయంలో వెండి ధరలు పెరిగినప్పటికీ, కార్పొరేట్ సంస్థలు తక్కువ బరువు ఉన్న వెండి నాణేలను గిఫ్టింగ్ కోసం పెద్ద ఎత్తున ఆర్డర్ చేశాయని తెలిపారు. గత మూడు నెలల్లో వెండి బిస్కెట్లు, బులియన్ కొనుగోళ్లు భారీగా పెరిగాయని వెల్లడించారు. బంగారం లాగా స్థిరత్వం వెండికి లేకపోయినా, అధిక రిస్క్‌తో పాటు ఎక్కువ లాభాల అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఈవీ వాహనాలు, సోలార్ ప్యానెల్స్, సెమీకండక్టర్ పరిశ్రమల నుంచి పెరిగిన డిమాండ్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధర ఔన్సుకు 90 డాలర్లను దాటింది. రూపాయి విలువ బలహీనపడటంతో దేశీయ స్పాట్ మార్కెట్‌లో వెండి ధర తొలిసారిగా కిలోకు రూ.3 లక్షల మార్కును దాటడం గమనార్హం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: